Tamannaah Bhatia : వారిపై తమన్నా సీరియస్.. లీగల్ నోటీసులు
మిల్కీ బ్యూటీ తమన్నా మంచు మనోజ్ నటించిన శ్రీ అనే సినిమాతో హీరోయిన్ గా పరిచయమైన విషయం తెలిసిందే.. ఆతర్వాత శేఖర్ కమ్ముల దర్శకత్వం వహించిన హ్యాపీ డేస్ సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకుంది.

Tamannaah : మిల్కీ బ్యూటీ తమన్నా మంచు మనోజ్ నటించిన శ్రీ అనే సినిమాతో హీరోయిన్‌గా పరిచయమైన విషయం తెలిసిందే.. ఆతర్వాత శేఖర్ కమ్ముల దర్శకత్వం వహించిన హ్యాపీ డేస్ సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకుంది. హ్యాపీ డేస్ సినిమా తర్వాత తమన్నాకు వరుస ఆఫర్లు క్యూ కట్టాయి. బ్యాక్ టు బ్యాక్ స్టార్ హీరోల సరసన నటించే ఛాన్స్‌లు దక్కించుకుంది ఈ బ్యూటీ. తక్కువ సమయంలోనే తమన్నా మంచి తెలుగులో క్రేజ్‌ను సొంతం చేసుకుంది. అటు తెలుగు లోనే కాకుండా తమిళ్‌లోను సినిమాలు చేస్తూ దూసుకుపోతుంది మిల్కీ బ్యూటీ.. అయితే ఇటీవలే బుల్లితెర పై కూడా మెరిసింది ఈ చిన్నది. ప్రముఖ టీవీ ఛానెల్ రూపొందించిన ఓ కార్యక్రమానికి తమన్నా హోస్ట్ గా వ్యవహరించింది. నేషనల్ వైడ్‌గా సూపర్ క్రేజ్ తెచ్చుకున్న కుకింగ్ షో మాస్టర్ చెఫ్ కార్యక్రమానికి హోస్ట్‌గా వ్యవహరించింది మిల్కీ బ్యూటీ.
ఈ షోకి ప్రమోషన్స్ కూడా భారీ రేంజ్ లో చేశారు. అయితే హిందీలో క్లిక్ అయినట్టుగా తెలుగులో ఈ షోకి రేటింగ్స్ అంతగా రావడంలేదు. ఖర్చు పరంగా చూస్తే తమన్నాకు భారీ రెమ్యునరేషన్ ఇవ్వడం. దాంతో ఇప్పుడు తమన్నా ప్లేస్ లోకి స్టార్ యాంకర్ అనసూయను తీసుకున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో తమన్నా షో యాజమాన్యానికి షాక్ ఇచ్చింది. తనకు రావాల్సిన బ్యాలెన్స్ అమౌంట్ ఇవ్వాలంటూ నోటీసులు పంపిందని తెలుస్తుంది. తనను తొలగించారన్న అసంతృప్తితో ఉన్న తమన్నా తనకు యాజమాన్యం నుంచి రావల్సన బకాయిలను చెల్లించాలని ప్రొడక్షన్ హౌస్‌కు లీగల్ నోటీసులు పంపిందట. మరి ఈ నోటీసుల పై షో యాజమాన్యం ఎలా స్పందిస్తుందో చూడాలి.
మరిన్ని ఇక్కడ చదవండి :
>Vijay Devarakonda : ఇండియాని షేక్ చేయబోతున్నాం.. ఫిక్స్ అయిపోండి.. విజయ్ దేవరకొండ ఆసక్తికర కామెంట్స్