AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Kanguva: సూర్య కంగువా ఫ్లాప్ కావడానికి ఆ హీరోనే కారణం.. నిర్మాత సంచలన ఆరోపణలు

కోలీవుడ్ స్టార్ సూర్య నటించిన 'కంగువ' చిత్రం ఆడియెన్స్ ను పెద్దగా ఆకట్టుకోలేదు. బాక్సాఫీస్ దగ్గర పెద్దగా కలెక్షన్లు రావడం లేదు. అయితే కంగువా పరాజయానికి వారే కారణమంటూ నిర్మాత సంచలన ఆరోపణలు చేశారు. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు కోలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారాయి.

Kanguva: సూర్య కంగువా ఫ్లాప్ కావడానికి ఆ హీరోనే కారణం.. నిర్మాత సంచలన ఆరోపణలు
Suriya Kanguva
Basha Shek
|

Updated on: Nov 27, 2024 | 8:56 AM

Share

ఒక నటుడి సినిమా రాగానే మరో నటుడి అభిమానులు సినిమాపై నెగిటివ్ ప్రచారం చేయడం, నెగిటివ్ పోస్ట్ లు పెట్టడం సర్వ సాధారణమైపోయాయి.  దాదాపు ప్రతి సినిమా ఇండస్ట్రీలోనూ ఈ దుష్ప్రచారం కొనసాగుతోంది. కానీ తమిళనాడులో మాత్రం కాస్త ఎక్కువే. కొంతమంది స్టార్ నటుల అభిమానులు మిగతా నటీనటులపై నెగిటివ్ వార్తలు, ట్రోల్‌లు చేస్తున్నారు. ఇటీవల విడుదలైన ‘కంగువ’ సినిమా బాక్సాఫీస్ వద్ద నిరాశ పర్చింది. అయితే ‘కంగువ’ సినిమా పరాజయానికి ఇద్దరు స్టార్ నటులు, రెండు రాజకీయ పార్టీల అభిమానులే కారణమని చిత్ర సహ నిర్మాత ఒకరు ఆరోపిస్తున్నారు. ‘కంగువ’ చిత్రానికి కో-ప్రొడ్యూసర్‌గా వ్యవహరిస్తూ సూర్యకు సన్నిహితుడు కూడా అయిన ధనంజయన్‌ మాట్లాడుతూ.. ‘నేను 2014లోనే దీని గురించి మాట్లాడాను. సూర్య ను ఇద్దరు స్టార్ నటుల అభిమానులు టార్గెట్ చేస్తున్నారు. గత కొన్నేళ్లుగా సూర్య సినిమాలన్నింటిని అడ్డుకునే ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఇప్పుడు ఆయనతో పాటు రెండు రాజకీయ పార్టీలు కూడా సూర్యకు వ్యతిరేకంగా పని చేస్తున్నాయి. ముఖ్యంగా ఒక స్టార్ నటుడి అభిమానులు సూర్యను ఎంతగానో ద్వేషిస్తున్నారు. నేను గత కొన్నాళ్లుగా దీనిని గమనిస్తున్నాను. నేను సూర్య గురించి ఏ పోస్ట్ చేసినా, ఒక నటుడి అభిమానులు వచ్చి నెగెటివ్ కామెంట్స్ చేస్తున్నారు. ఈ వ్యాఖ్యలు చేసే వారి ఖాతాలన్నీ ఆ హీరో ఫొటోతోనే కనిపిస్తున్నాయి. అయితే తమిళ చిత్ర పరిశ్రమలో సూర్య స్థానాన్ని ఎవరూ భర్తీ చేయలేరు’ అని ధనంజయన్ చెప్పుకొచ్చారు.

గతంలో నటుడు సూర్య నీట్ గురించి కొన్ని వ్యాఖ్యలు చేశారు. ఆ సమయంలో సూర్య చేసిన వ్యాఖ్య తమిళనాడులోని రెండు రాజకీయ పార్టీలకు ఇబ్బందిని, అసహనాన్ని కలిగించింది. అందుకే ఆ రెండు రాజకీయ పార్టీల సభ్యులు కూడా సూర్య సినిమాలను తుంగలో తొక్కేందుకు ప్రయత్నిస్తున్నారు’ అని ధనంజయన్ అన్నారు.

ఇవి కూడా చదవండి

అయితే ధనంజయ్ నేరుగా ఎవరి పేరు చెప్పలేదు. దీంతో ఆ హీరో ఎవరై ఉంటాడా? అని నెటిజన్లు చర్చించుకుంటున్నారు. కాగా గతంలో నీట్ గురించి సూర్య ప్రకటన చేసినప్పుడు కొన్ని రాజకీయ పార్టీలు అతనిని విమర్శించాయి. నీట్ కారణంగా తమిళనాడులో ముగ్గురు విద్యార్థులు ఆత్మహత్య చేసుకున్నప్పుడు మాట్లాడిన సూర్య ఈ మెడికల్ ఎంట్రెన్స్ ఎగ్జామ్ పై కొన్ని సంచలన వ్యాఖ్యలు చేశాడు. దీంతో కొన్ని పార్టీల నుంచి సూర్యకు తీవ్ర వ్యతిరేకత ఎదురైంది.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.