RGV: పోస్ట్ పెట్టి ఏడాదైంది.. అంత ఎమర్జెన్సీ ఏమొచ్చిందంటున్నా.. జస్ట్ ఆస్కింగ్

దాదాపుగా 40 గంటలు... రంగంలోకి స్పెషల్‌ టీములు.. మూడు రాష్ట్రాల్లో ముమ్మర గాలింపు చర్యలు... అయినా ఫలితం లేదు. వివాదాస్పద దర్శకుడు రామ్‌గోపాల్‌ వర్మ జాడ దొరకట్లేదు. పోలీసులు ఓ వ్యూహంతో వేట సాగిస్తున్న వేళ..

RGV: పోస్ట్ పెట్టి ఏడాదైంది.. అంత ఎమర్జెన్సీ ఏమొచ్చిందంటున్నా.. జస్ట్ ఆస్కింగ్
Rgv
Follow us
Ravi Kiran

|

Updated on: Nov 27, 2024 | 9:00 AM

వర్మ మిస్సింగ్‌ సిరీస్‌ ఇంకా ఎన్ని ఎపిసోడ్లు ఉంటుందోనన్న చర్చ వేళ.. జస్ట్ ఆస్కింగ్ అంటూ తళుక్కున మెరిశారు ఆర్జీవీ. వీడియో రిలీజ్ చేస్తూ.. పోలీసులకు ప్రశ్నాస్త్రాలు సంధించారు. తనపై నమోదైన కేసులపై సెటైర్లు వేశారు రాంగోపాల్‌వర్మ. తాను ఎవర్నో.. ఏదో అంటే.. వాళ్లకు మనోభావాలు దెబ్బతినడం ఏంటంటూ వ్యంగ్యాస్త్రాలు సంధించారు. ఏడాది క్రితం పెట్టిన పోస్టులకు ఇప్పుడు మనోభావాలు దెబ్బతిన్నాయా అంటూ వర్మ అడిగారు.

అసలు, పోలీసులు పెట్టిన సెక్షన్లు తనకెలా వర్తిస్తాయంటూ ప్రశ్నించారు. పోలీసుల్ని రాజకీయ నేతలు అస్త్రాలుగా మార్చుకున్నారని ఆరోపించారు. మర్డర్‌ కేసుల్నే ఏళ్లతరబడి పట్టించుకోరు.. వీటికి అంత ఎమర్జెన్సీ ఏమొచ్చిందంటున్నారు వర్మ. తాను పరారీలో లేనని, మూవీ షూటింగ్‌లో బిజీగా ఉన్నానని చెప్పారు. పోలీసులు తనకు ఇచ్చిన నోటీసులకు రిప్లై ఇచ్చానని.. ప్రొడ్యూసర్స్‌కి నష్టం వస్తుంది కాబట్టే సమయం కోరానని వర్మ అన్నారు.

మరోవైపు ఆర్జీవీ దాఖలు చేసిన ముందస్తు బెయిల్‌ పిటిషన్లపై ఇవాళ ఏపీ హైకోర్టులో విచారణ జరగనుంది. సోషల్‌ మీడియాలో పవన్, లోకేష్‌లపై అనుచిత పోస్టులు పెట్టారని, మార్ఫింగ్‌ ఫొటోలు పోస్ట్ చేశారనే ఫిర్యాదులపై ఒంగోలు, విశాఖ, గుంటూరు జిల్లాలో కేసులు నమోదు అయ్యాయి. ఇక తనపై నమోదైన కేసుల్లో ముందస్తు బెయిల్ కోరుతూ ఆర్జీవీ పిటిషన్‌ దాఖలు చేశారు. తనపై నమోదైన కేసులను క్వాష్‌ చేయాలని వర్మ ఇప్పటికే ఏపీ హైకోర్టును ఆశ్రయించారు. క్వాష్‌ పిటిషన్‌ని హైకోర్టు తోసిపుచ్చడంతో- వర్మ బెయిల్‌ పిటిషన్‌ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌పై ఇవాళ ఏపీ హైకోర్టు విచారణ చేపడుతుంది.

అటు రామ్ గోపాల్ వర్మ కోసం ముమ్మరంగా గాలింపు చర్యలు చేపట్టారు ప్రకాశం పోలీసులు. హైదరాబాద్‌లో రెండు బృందాలుగా ఏర్పడి గాలిస్తున్నారు. సతాను పారిపోలేదని, తనపై పెట్టిన కేసులోని సెక్షన్లు తనకు ఎలా వర్తిస్తాయనిస ప్రశ్నిస్తూ తాజాగా వర్మ వీడియో విడుదల చేయడంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. విడుదలైన వీడియో ఆధారంగా వర్మ ఉన్న ప్రాంతాన్ని గుర్తించేందుకు ప్రయత్నిస్తున్నారు.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

వానలు బాబోయ్ వానలు.! తరుముకొస్తున్న తుఫాన్.. ఈ ప్రాంతాలకు..
వానలు బాబోయ్ వానలు.! తరుముకొస్తున్న తుఫాన్.. ఈ ప్రాంతాలకు..
కంగువా ఫ్లాప్ కావడానికి ఆ హీరోనే కారణం.. నిర్మాత సంచలన ఆరోపణలు
కంగువా ఫ్లాప్ కావడానికి ఆ హీరోనే కారణం.. నిర్మాత సంచలన ఆరోపణలు
పోస్ట్ పెట్టి ఏడాదైంది.. అంత ఎమర్జెన్సీ ఏమొచ్చిందంటున్నా..
పోస్ట్ పెట్టి ఏడాదైంది.. అంత ఎమర్జెన్సీ ఏమొచ్చిందంటున్నా..
శ్రీవారి భక్తులకు గుడ్ న్యూస్.. త్వరలో తీరనున్న గదుల కష్టాలు
శ్రీవారి భక్తులకు గుడ్ న్యూస్.. త్వరలో తీరనున్న గదుల కష్టాలు
మహేష్ బాబుతో ఉన్న ఈ చిన్నోడు ఇప్పుడు టాలీవుడ్‌లో తోపు హీరో..
మహేష్ బాబుతో ఉన్న ఈ చిన్నోడు ఇప్పుడు టాలీవుడ్‌లో తోపు హీరో..
JEE మెయిన్‌కు 12.80 లక్షల దరఖాస్తులు.. నేటితో ఎడిట్ విండో క్లోజ్
JEE మెయిన్‌కు 12.80 లక్షల దరఖాస్తులు.. నేటితో ఎడిట్ విండో క్లోజ్
పవన్ అంటే తుఫాన్ కాదు ఇక సునామీయే..
పవన్ అంటే తుఫాన్ కాదు ఇక సునామీయే..
ఈ తొర్రి పళ్ల పాప టాలీవుడ్ క్రేజీ హీరోయిన్.. భర్త కూడా హీరోనే
ఈ తొర్రి పళ్ల పాప టాలీవుడ్ క్రేజీ హీరోయిన్.. భర్త కూడా హీరోనే
పాకిస్తాన్‌లో హింసాత్మక నిరసనలు.. PTI నేత సహా 10 మంది మృతి
పాకిస్తాన్‌లో హింసాత్మక నిరసనలు.. PTI నేత సహా 10 మంది మృతి
TGPSC గ్రూప్ 3 పరీక్ష ప్రిలిమినరీ కీ, ఫలితాలు వచ్చేది అప్పుడే...?
TGPSC గ్రూప్ 3 పరీక్ష ప్రిలిమినరీ కీ, ఫలితాలు వచ్చేది అప్పుడే...?