Tollywood: ఈ తొర్రి పళ్ల పాపను గుర్తు పట్టారా? టాలీవుడ్ క్రేజీ హీరోయిన్.. భర్త కూడా హ్యాండ్సమ్ హీరోనే

ఛైల్డ్ ఆర్టిస్టుగా కెరీర్ ప్రారంభించి ఆ తర్వాత స్టార్ హీరోయిన్లుగా ఎదిగిన ముద్దుగుమ్మలు ఇండస్ట్రీలో చాలా మందే ఉన్నారు. ఈ క్రేజీ హీరోయిన్ కూడా సరిగ్గా ఈ జాబితాకే చెందుతుంది. బాల నటిగా చిన్నప్పుడే పలువురు స్టార్ హీరోలతో స్క్రీన్ షేర్ చేసుకున్న ఈ అమ్మాయి ఆ తర్వాత పలు సినిమాల్లో కథానాయికగా నటించి మెప్పించింది.

Tollywood: ఈ తొర్రి పళ్ల పాపను గుర్తు పట్టారా? టాలీవుడ్ క్రేజీ హీరోయిన్.. భర్త కూడా హ్యాండ్సమ్ హీరోనే
Tollywood Actress Childhood Photo
Follow us
Basha Shek

|

Updated on: Nov 27, 2024 | 8:27 AM

పై ఫొటోలో తొర్రిపళ్ల తో క్యూట్ గా కనిపిస్తోన్న ఈ పాప ఎవరో గుర్తు పట్టారా? ఈ అమ్మాయి బాల నటిగా సినిమా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టింది. తల్లిదండ్రులు కూడా సినిమా ఇండస్ట్రీకి చెందిన వారు కావడంతో చిన్నప్పుడే ముఖానికి రంగు వేసుకుంది. సినిమాలతో పాటు కొన్ని టీవీషోల్లోనూ మెరిసింది. అయితే మధ్యలో చదువు కోసం కాస్త గ్యాప్ ఇచ్చింది. ఆ తర్వాత మళ్లీ హీరోయిన్ గా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టింది. శింబు వంటి స్టార్ హీరోలతో స్క్రీన్ షేర్ చేసుకుంది. ఎక్కువగా తమిళ, మలయాళ సినిమాల్లో నటించిన ఈ ముద్దుగుమ్మ తెలుగులో మూడు సినిమాల్లో మాత్రమే నటించింది. అందులోనూ ఆమెకు బాగా గుర్తింపు తెచ్చింది ఒక్క మూవీనే. సినిమాల సంగతి పక్కన పెడితే.. క్రేజీ హీరోయిన్ గా కెరీర్ పీక్స్ లో ఉండగానే ఒక హ్యాండ్సమ్ హీరోను పెళ్లి చేసుకుందీ అందాల తార. దీంతో క్రమంగా సినిమాలకు దూరమైందీ ముద్దుగుమ్మ. ప్రస్తుతం సోషల్ మీడియాలో మాత్రమే కనిపిస్తోన్న ఈ క్యూటీని కనిపెట్టారా? కష్టంగా ఉందా?అయితే సమాధానం మేమే చెబుదాం లెండి. ఆమె మరెవరో కాదు వెళ్లిపోమాకే ఎదనే వదిలెళ్లి పోమాకే’ అంటూ కుర్రాళ్ల మనసులను కొల్లగొట్టిన హీరోయిన్ మంజిమా మోహన్. నాగ చైతన్య నటించిన సాహసం శ్వాసగా సాగిపో సినిమాలో లీల పాత్రలో ఎంతో క్యూట్ గా నటించి మెప్పించిందీ అందాల తార.

సాహసం శ్వాసగా సాగిపో సినిమా తర్వాత కథానాయకుడు, మహానాయకుడు చిత్రాల్లో మాత్రమే నటించింది మంజిమా మోహన్. ఈ సినిమాల్లో ఆమె నారా భువనేశ్వరి పాత్రను పోషించింది. కాగా సినిమా కెరీర్ పీక్స్ లో ఉండగానే 2022లో ప్రముఖ నటుడు కార్తీక్ కొడుకు.. హీరో గౌతమ్ కార్తీక్ ను వివాహం చేసుకుంది మంజిమా. వీరిది ప్రేమ వివాహం. ‘దేవరత్తం’ అనే సినిమాలో మంజిమా మోహన్, కార్తీక్ కలసి నటించారు. అప్పటి నుంచి వీరి మధ్య ప్రేమ మొదలైంది. ఆ తర్వాత ఇరు పెద్దల అనుమతితో మూడు ముళ్ల బంధంలోకి అడుగుపెట్టారీ లవ్ బర్డ్స్.

ఇవి కూడా చదవండి

భర్త హీరో కార్తీక్ తో మంజిమా మోహన్..

పెళ్లి తర్వాత పెద్దగా సినిమాల్లో కనిపించడం లేదు మంజిమా మోహన్. గతేడాది బూ అనే తమిళ్/ తెలుగు సినిమాలో ఓ కీలక పాత్ర పోషించిందీ ముద్దుగుమ్మ. అయితే సోషల్ మీడియాలో మాత్రం ఫుల్ యాక్టివ్ గా ఉంటోందీ అందాల తార. ఇక భర్త కార్తీక్ కూడా పలు సినిమాల్లో నటిస్తున్నాడు. కడలి సినిమాతో తెలుగు వారికి కూడా బాగా దగ్గరయ్యాడు కార్తీక్.

.మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.