Sarkaru Vaari Paata: భారీ ధరకు మహేష్ సర్కారు వారి పాట ఓవర్సీస్ రైట్స్.. ఎంతో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..

సూపర్ స్టార్ మహేష్ బాబు సినిమా కోసం ఆయన అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. మహేష్ నటిస్తున్న తాజా చిత్రం సర్కారు వారి పాట.

Sarkaru Vaari Paata: భారీ ధరకు మహేష్ సర్కారు వారి పాట ఓవర్సీస్ రైట్స్.. ఎంతో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..
Mahesh Babu
Follow us
Rajeev Rayala

| Edited By: Ravi Kiran

Updated on: Nov 13, 2021 | 6:46 AM

Sarkaru Vaari Paata: సూపర్ స్టార్ మహేష్ బాబు సినిమా కోసం ఆయన అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. మహేష్ నటిస్తున్న తాజా చిత్రం సర్కారు వారి పాట. పరశురామ్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతుంది. ఈ సినిమాలో అందాల భామ కీర్తిసురేష్ హీరోయిన్ గా నటిస్తుంది. ఈ సినిమాలో మొదటి సారి మహేష్ తో జతకడుతుంది ఈ మహానటి. ఇక బ్యాంకింగ్ రంగంలో జరిగే అతి పెద్ద కుంభకోణం లో చుకున్న తండ్రిని కాపాడే కొడుకుగా మహేష్ ఈ సినిమాలో కనిపించనున్నారని తెలుస్తుంది. ఇప్పటికే విడుదలైన ఈ సినిమా పోస్టర్లు సినిమాలే అంచనాలను పెంచేశాయి. ఇక మహేష్ పుట్టిన రోజు సందర్భంగా విడుదలైన సర్కారు వారి పాట టీజర్ ఆ అంచనాలను తారాస్థాయికి చేర్చింది. ఈ సినిమాలో సూపర్ స్టైలిష్ గా కనిపించనున్నాడు సూపర్ స్టార్.

ఇక ఈ సినిమా రిలీజ్ సంక్రాంతికి ఉంటుందని అంతా భావించారు. జనవరి 13న సినిమాను విడుదల చేయనున్నట్టు కూడా ప్రకటించారు చిత్రయూనిట్.. కానీ అనుకోని కారణాల వల్ల సినిమా వాయిదా పడింది. ఈ సినిమా సమ్మర్ లో విడుదల చేయనున్నారు. ఏప్రిల్ 1న సర్కారు వారి పాట సినిమా ప్రేక్షకులముందుకు రానుంది. ఇదిలా ఉంటే ఈ సినిమాకు సంబంధించిన ఓ న్యూస్ ఇప్పుడు ఫిలిం సర్కిల్స్ లో చక్కర్లు కొడుతుంది. ‘సర్కారువారి పాట’ చిత్రం ఓవర్సీస్ హక్కులు భారీ ధరకు అమ్ముడుపోయాయని సమాచారం. ఓ ప్రముఖ పంపిణీ సంస్థ ఈ హక్కులను సుమారు 15 కోట్లకు సొంతం చేసుకున్నట్టు తెలుస్తోంది.

మరిన్ని ఇక్కడ చదవండి.

NTR’s EMK Contestant: సామాన్యుడిని కోటీశ్వరుడు చేసిన తారక్ షో.. తన తెలివితేటలతో దుమ్ము రేపిన పోలీసు…

Manchu Vishnu: కోల్పోయిన దానిని మళ్లీ సాధిస్తానంటోన్న ప్రెసిడెంట్‌ విష్ణు.. ఇన్‌స్టాలో ఇంట్రెస్టింగ్‌ పోస్ట్‌..

Nooran Sisters: విచిత్ర గానంతో.. మీమ్స్‌తో పాపులర్ అయిన ఈ సిస్టర్స్.. రెహ్మాన్ మెచ్చిన గాయనీమణులు అని తెలుసా..