Superstar Krishna: ఆ స్టార్ హీరో క్రేజ్‌ను చూసి సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చిన కృష్ణ.. ఆయన ఎవరంటే..

నటశేఖరుడు సినీ సింహాసనాన్ని విడిచి వెళ్లిపోయారు. టాలీవుడ్‌ షెహన్‌షా ఇకలేరు. తెలుగువారి అల్లూరి సీతారామరాజు ఇలకు దూరమయ్యారు. అంటూ భోరున విలపిస్తున్నారు..

Superstar Krishna: ఆ స్టార్ హీరో క్రేజ్‌ను చూసి సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చిన కృష్ణ.. ఆయన ఎవరంటే..
Superstar Krishna
Follow us

|

Updated on: Nov 15, 2022 | 8:49 AM

నటశేఖరుడు సినీ సింహాసనాన్ని విడిచి వెళ్లిపోయారు. టాలీవుడ్‌ షెహన్‌షా ఇకలేరు. తెలుగువారి అల్లూరి సీతారామరాజు ఇలకు దూరమయ్యారు. అంటూ భోరున విలపిస్తున్నారు సూపర్‌స్టార్‌ కృష్ణ అభిమానులు. మంచి మనసున్న మారాజు ఇక మళ్లీ కనిపించరా అంటూ కన్నీటిపర్యంతమవుతున్నారు. కట్టలు తెంచుకున్న దుఃఖాన్ని దిగమింగుకుని దేవుడులాంటి మనిషి చివరి చూపు కోసం క్షణాలు లెక్కపెడుతున్నారు.

ఘట్టమనేని రాఘవయ్య చౌదరి, నాగరత్నమ్మ దంపతులకు 1942 మే 31న బుర్రిపాలెంలో జన్మించారు కృష్ణ. ఆయన పూర్తి పేరు ఘట్టమనేని శివరామకృష్ణమూర్తి. కృష్ణది బాగా కలిగిన కుటుంబం కాకపోయినా ఎలాంటి లోటులేనీ అప్పర్‌ మిడిల్‌క్లాస్‌ ఫ్యామిలీ. కృష్ణ తండ్రి పేరున్న రైతు. వారికి కలప వ్యాపారం కూడా ఉండేది. ఆయన బాలయ్యమంతా సొంతూరిలోనే గడిచింది. ఏలూరు సి.ఆర్‌.రెడ్డి కాలేజీలో డిగ్రీ చదివారు కృష్ణ.

అక్కినేని నాగేశ్వరరావును చూసి..

అక్కినేని నాగేశ్వరరావు 60 చిత్రాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఒకరోజు ఆయన్ని సి.ఆర్‌.రెడ్డి కాలేజీకి ఆహ్వానించింది యాజమాన్యం. సినిమా స్టార్‌కి ఎలాంటి ఆదరణ ఉంటుందో ఆరోజు కళ్లారా చూశారు కృష్ణ. హీరో అయితే అంత క్రేజ్‌ సొంతమవుతుందని అనుకున్నారు. తాను కూడా హీరో కావాలని కలలుకన్నారు. ఇంకేముంది.. ఏమాత్రం సంశయం లేకుండా ఆ విషయాన్నే తండ్రితో చెప్పి చెన్నై బయలుదేరారు. అక్కడ చక్రపాణిని కలిశారు. అప్పటికి కృష్ణ మరీ యంగ్‌గా ఉండటంతో సినిమాల్లో వేషాలు వేయడానికి మరికొన్నాళ్లు ఆగాల్సి వస్తుందని సూచించారు చక్రపాణి. కృష్ణను తీసుకెళ్లి ఎన్టీఆర్‌కి పరిచయం చేశారు. కృష్ణను చూసిన రామారావు ‘ఓ రెండేళ్ల పాటు నాటకాల్లో నటించండి. అనుభవం వస్తుంది. పర్సనాలిటీ పెరుగుతుంది. ఇప్పుడైతే మీ వయసుకు తగ్గ పాత్రలు లేవు’ అని అన్నారు. ఎల్వీ ప్రసాద్‌ కూడా ఆ విషయాన్నే చెప్పడంతో నాటకాల్లో నటించాలనుకున్నారు కృష్ణ.

ఇవి కూడా చదవండి

అనుకున్నదే తడవుగా చేసిన పాపం కాశీకి వెళ్లినా.. అనే నాటకంలో నటించే అవకాశం వచ్చింది. అందులో ఫస్ట్ హీరోగా శోభన్‌బాబు నటించారు. అలా సినిమాల్లోకి రాకముందే శోభన్‌బాబుకి, కృష్ణకు మంచి పరిచయం ఏర్పడింది. ఆ తర్వాత కూడా కొన్ని నాటకాలు వేశారు కృష్ణ. అలా నాటకాలు వేస్తున్న సమయంలోనే ఎల్వీ ప్రసాద్‌ దర్శకత్వంలో కొడుకులు – కోడళ్లులో అవకాశంవచ్చింది. చాన్సు దక్కిందని ఆనందించే లోపు ఆ సినిమా ఆగిపోయింది. నిరాశతో తెనాలికి వెళ్లిపోయారు కృష్ణ. సరిగ్గా అప్పుడే, ఉప్పు సత్యాగ్రహ ఉద్యమం నేపథ్యంలో నటుడు జగ్గయ్య నిర్మించిన పదండి ముందుకులో చిన్న అవకాశం వచ్చింది కృష్ణను వెతుక్కుంటూ. ఆయన సినిమాల్లో నటించిన తొలి పాత్ర అదే. ఆ తర్వాత కులగోత్రాలు, మురళీకృష్ణలాంటి సినిమాల్లో నటించారు. ‘తేనెమనసులు’తో హీరోగా సుస్థిర స్థానం సంపాదించుకున్నారు. ఇండస్ట్రీలో టాలెంట్‌ కంటే మంచితనం, క్రమశిణ చాలా ముఖ్యం అని ఆదుర్తి దగ్గర నేర్చుకున్నారు కృష్ణ. అలా మొదలైన సినీ ప్రస్థానంలో వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం రాలేదు.

మరిన్ని సినిమా వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..

Latest Articles