Anudeep KV: స్కూల్‌లో ఒక అమ్మాయిని గాఢంగా ప్రేమించా.. కానీ.. తన లవ్ స్టోరీ చెప్పేసిన జాతి రత్నాలు డైరెక్టర్
జాతి రత్నాలు సినిమాతో టాలీవుడ్ లో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు డైరెక్టర్ కేవీ అనుదీప్. అయితే ఈ మధ్యన డైరెక్టర్ గా కంటే యాక్టర్ గానే ఎక్కువ కనిపిస్తున్నాడు అనుదీప్. గతేడాది ఏకంగా మూడు సినిమాల్లో నటించిన ఈ డైరెక్టర్ ఇప్పుడు మళ్లీ మెగా ఫోన్ పట్టుకుని ఫంకీ అనే సినిమాను తెరకెక్కించాడు.

డైరెక్టర్ అనుదీప్ కేవీ సినిమాలు చాలా ఫన్నీగా ఉంటాయి. ముఖ్యంగా వన్ వర్డ్స్ జోకులు ఇతని సినిమాల్లో బాగా పేలుతుంటాయి. పిట్ట గోడ సినిమాతో డైరెక్టర్ గా ఎంట్రీ ఇచ్చిన అనుదీప్ జాతి రత్నాలు సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. ఎలాంటి అంచనాలు లేకుండా రిలీజైన ఈ సినిమా సూపర్ హిట్ గా నిలిచింది. అనుదీప్ డైరెక్ష న్ కు కూడా మంచి పేరొచ్చింది. దీని తర్వాత తమిళ హీరో శివ కార్తికేయన్ తో తెరకెక్కించిన ప్రిన్స్ ఆడియెన్స్ ను కడుపుబ్బా నవ్వించింది కానీ కమర్షియల్ గా వర్కవుట్ అవ్వలేదు. మధ్యలో ఫస్ట్ డే ఫస్ట్ షో అనే సినిమాకు స్టోరీ అందించిన అనుదీప్ నటుడిగానూ సత్తా చాటుతున్నాడు. మ్యాడ్, కల్కి, మ్యాడ్ స్క్వేర్, హరి హర వీరమల్లు, మిత్ర మండలి సినిమాల్లో అనుదీప్ నటన ఆడియెన్స్ ను కడుపుబ్బా నవ్వించింది. అయితే మళ్లీ మెగా ఫోన్ పట్టుకున్న ఈ దర్శకుడు ఫంకీ అనే సినిమాను తెరకెక్కించాడు. విశ్వక్ సేన్ ఇందులో హీరోగా నటించింది. డ్రాగన్ బ్యూటీ కయాదు లోహన్ కథానాయికి. ఇప్పటికే అన్నిహంగులు పూర్తి చేసుకున్న ఫంకీ సినిమా ఫిబ్రవరి 13న గ్రాండ్ గా రిలీజ్ కానుంది. ఈ నేపథ్యంలో సినిమా ప్రమోషన్లలో చురుగ్గా పాల్గొంటున్నాడు అనుదీప్. వరుసగా ఇంట్వర్యూలు ఇస్తూ బిజీ బిజీగా ఉంటున్నాడు. ఈ సందర్భంగా తన పర్సనల్ అండ్ ప్రొఫెషనల్ లైఫ గురించి పలు ఆసక్తికర విషయాలు పంచుకుంటున్నాడు.
అలా తాజాగా ఓ ఇంటర్వ్యూలో యాంకర్ సుమ ‘మీరు ఎవరినైనా ప్రేమించారా?’ అని అనుదీప్‌ని అడగ్గా..’స్కూల్‌లో ఉన్నప్పుడు ఒక అమ్మాయిని ప్రేమించాను. ఆ విషయం ఆమెకు చెప్పలేదు. అంటే వన్ సైడ్ లవ్ అనమాట. ఇప్పుడు ఆ అమ్మాయికి పెళ్లి అయిపోయి ఎక్కడో ఉంటుంది. కాలేజీలో ఎవరినీ లవ్ చేయలేదు. ప్రస్తుతానికైతే ప్రేమ, పెళ్లి మీద ఆసక్తి లేదు. పెళ్లి చేసుకోవాలనే ఇంట్రెస్ట్ లేదు’ అని సమాధానమిచ్చాడీ డైరెక్టర్. అయితే అనుదీప్.. ఇదంతా సీరియస్‌గానే చెప్పాడా? లేదా జోక్‌గా చెప్పాడా? అనేది మాత్రం తెలియదు. ఎందుకంటే గతంలో చాలా సార్లు ఇలాగే సీరియస్ విషయాన్ని కామెడీగా చెబుతుంటాడు. అందులోనూ ఏది నిజం, ఏది అబద్ధమో అనేది తెలియకుండా మరీ మాట్లాడుతుంటాడు. అందుకే ఇప్పుడు చెప్పింది కూడా నిజమా? కాదా? అని నెటిజన్లు అయోమయంలో పడ్డారు.
ఫంకీ సినిమా ప్రమోషన్లలో కేవీ అనుదీప్, విశ్వక్ సేన్..
View this post on Instagram
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.




