AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Bigg Boss Thanuja: ఇది కరెక్ట్ కాదు మేడమ్.. బిగ్‌బాస్ తనూజపై ఫ్యాన్స్ ఫైర్.. అసలు ఏం జరిగిందంటే?

బిగ్‌బాస్ తెలుగు 9లో కంటెస్టెంట్‌గా అవకాశం దక్కించుకుని రన్నరప్ గా నిలిచింది తనూజ పుట్టస్వామి. ఒకదశలో విజేతగా నిలుస్తుందనుకున్న ఆమె అనూహ్యంగా రన్నరప్ టైటిల్ తో సరిపెట్టుకుంది. ఇదిలా ఉంటే ఒక విషయంలో తనూజ అభిమానులు ఆమెపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

Bigg Boss Thanuja: ఇది కరెక్ట్ కాదు మేడమ్.. బిగ్‌బాస్ తనూజపై ఫ్యాన్స్ ఫైర్.. అసలు ఏం జరిగిందంటే?
Tanuja Puttaswamy
Basha Shek
|

Updated on: Jan 26, 2026 | 7:26 PM

Share

బిగ్ బాస్ తెలుగు సీజన్ 9తో తెలుగింటి ఆడబిడ్డగా మారిపోయింది కన్నడ బ్యూటీ తనూజ పుట్టస్వామి. అంతకుముందు తెలుగులో పలు సీరియల్స్, ప్రోగ్రామ్స్ చేసినప్పటికీ బిగ్‌బాస్‌తోనే మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ను సొంతం చేసుకుందీ అందాల తార. కన్నడ నాటకు చెందిన తనూజ మొదట అందాల రాక్షసిలో సీరియల్ లో నటించింది. ఆ తర్వాత ముద్ద మందారం సీరియల్ తో మంచి పాపులారిటీ సొంతం చేసుకుంది. తెలుగుతో పాటు తమిళంలోనూ కొన్ని సీరియల్స్, షోలలో నటించిన తనూజ అనూహ్యంగా గతేడాది తెలుగు బిగ్‌బాస్ 9లో కంటెస్టెంట్‌గా అడుగు పెట్టింది. తన ఆట, మాట తీరుతో అందరి దృష్టిని ఆకర్షించింది. గేమ్స్, టాస్క్‌లు, డిస్కషన్స్ ఇలా అన్నింటిలోనూ తన సత్తా చాటింది. ఓటింగ్‌లో ఎవ్వరూ అందుకోని విధంగా టాప్‌లోకి దూసుకొచ్చింది. బిగ్ బాస్ సీజన్ 9 మొత్తం ఓటింగ్ లో టాప్ లో నిలిచిన తనూజనే టైటిల్ కూడా గెలుస్తుందనుకున్నారు. అయితే అనూహ్య పరిణామాల మధ్య బిగ్‌బాస్ షో తెలుగు 9 టైటిల్ ను కల్యాణ్ పడాల ఎగరేసుకుపోయాడు. అయినా ఏ మాత్రం నిరాశ చెందలేదు తనూజ. తన బిహేవియర్ తో తానే నిజమైన విన్నర్‌నని నిరూపించుకుంది. ఇదిలా ఉంటే బిగ్ బాస్ హౌస్ నుంచి బయటకు వచ్చిన తర్వాత పెద్దగా బయట కనిపించడం లేదు తనూజ. ఆమధ్యన ఓ టీవీ ప్రోగ్రామ్ లో మాత్రమే తళుక్కుమంది. చివరకు సోషల్ మీడియాలోనూ సైలెంట్ అయిపోయిందీ అందాల తార.

గతంలో సోషల్ మీడియాలో పుల్ యాక్టివ్ గా ఉందేది తనూజ. తన పర్సనల్ అండ్ ప్రొఫెషనల్ విషయాలన్నింటినీ ఇన్ స్టా గ్రామ్ లో షేర్ చేసుకునేది. అయితే ఇప్పుడు అలా ఉండడం లేదీ ముద్దుగుమ్మ. కేవలం అప్పుడప్పుడు మాత్రమే పోస్టులు పెడుతోంది. ఒకసారి తనూజ ఇన్ స్టా గ్రామ్ ఖాతాను పరిశీలిస్తే.. ఆమె జనవరి 09న ఒక పోస్ట్ పెట్టింది. ఆ తర్వాత ఎలాంటి అప్ డేట్స్ ఇవ్వలేదు. ఈ క్రమంలోనే తనూజ తమను పట్టించుకోవడం లేదంటూ అభిమానులు, నెటిజన్లు మండి పడుతున్నారు. సోషల్ మీడియాలో ఏదో ఒక అప్ డేట్ ఇవ్వాలంటూ ఫన్నీగా ట్రోల్ చేస్తున్నారు. పోకిరి సినిమాలో మహేష్, ఇలియానాల ల మధ్య జరిగే సరదా సంభాషణను ఉపయోగించి ఈ బిగ్ బాస్ బ్యూటీని ట్రోల్ చేస్తన్నారు. ‘వస్తావ్ ఇన్‌స్టాలో 4, 5 స్టోరీలు షేర్ చేస్తావ్.. లేదా ఫెస్టివల్‌ కి ఒక స్టోరీ పెట్టేసి వెళ్లిపోతావ్.. ఏం అప్‌డేట్ ఇచ్చావ్? బిగ్‌బాస్ షో అయిపోయింది.. ఫ్యాన్స్ కి ఒక అప్‌డేట్ ఇద్దాం.. కనీసం ఫోటోషూట్ అయినా చేద్దాం. కనీసం నీ రీల్స్ అయినా షేర్ చేశావా? లేదు. స్టోరీలు స్టోరీలు ట్రైన్ బోగీలాగా షేర్ చేస్తావ్’ అంటూ నెటిజన్లు రూపొందించిన ఓ వీడియోను తనూజనే స్వయంగా తన ఇన్‌స్టా స్టోరీలో పోస్ట్ చేసింది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. మరి ఇప్పటికైనా తనూజ సోషల్ మీడియాలో యాక్టివ్ అవుతుందేమో చూడాలి.

ఇవి కూడా చదవండి

తనూజ లాస్ట్ ఇన్ స్టా గ్రామ్ పోస్ట్..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.