Ajith Kumar: అజిత్ రేంజ్ ఇది.. ఒక్క సినిమాకు అన్ని కోట్లు ఆఫర్.. లెక్క తెలిస్తే బేజారే..
ఎప్పటికప్పుడు ప్రేక్షకులను అలరించేందుకు సరికొత్త కంటెంట్ చిత్రాలను ఎంచుకుంటారు అజిత్. ఈ ఏడాది తునీవు సినిమాతో థియేటర్లలో సందడి చేశారు. తమిళంతోపాటు తెలుగులోనూ ఈ చిత్రానికి పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది. అయితే ఇప్పటివరకు ఎన్నో సూపర్ హిట్ చిత్రాల్లో నటించిన అజిత్.. తన సినిమా ప్రచార కార్యక్రమాలకు మాత్రం దూరంగా ఉంటారు. ఆయనతో కొత్త ప్రాజెక్ట్స్ నిర్మించేందుకు అటు నిర్మాతలు పోటీ పడుతుంటారు.

కోలీవుడ్ స్టార్ హీరో అజిత్ కుమార్ సినీ పరిశ్రమలోనే ప్రత్యేకమైన గుర్తింపు. హిట్టు, ప్లాపులతో సంబంధం లేకుండా అజిత్ సినిమా కోసం ఆయన ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తుంటారు. ఎప్పటికప్పుడు ప్రేక్షకులను అలరించేందుకు సరికొత్త కంటెంట్ చిత్రాలను ఎంచుకుంటారు అజిత్. ఈ ఏడాది తునీవు సినిమాతో థియేటర్లలో సందడి చేశారు. తమిళంతోపాటు తెలుగులోనూ ఈ చిత్రానికి పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది. అయితే ఇప్పటివరకు ఎన్నో సూపర్ హిట్ చిత్రాల్లో నటించిన అజిత్.. తన సినిమా ప్రచార కార్యక్రమాలకు మాత్రం దూరంగా ఉంటారు. ఆయనతో కొత్త ప్రాజెక్ట్స్ నిర్మించేందుకు అటు నిర్మాతలు పోటీ పడుతుంటారు.
అజిత్ తో ఓ సినిమా నిర్మించేందుకు ప్రముఖ నిర్మాణ సంస్థ సన్ పిక్చర్స్ ముందుకు వచ్చింది. ఈ మూవీ కోసం ఆయనకు ఏకంగా రూ.150 కోట్లు పారితోషికం ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నట్లు కోలీవుడ్ ఇండస్ట్రీలో టాక్ వినిపిస్తోంది. ఇప్పటివరకు అంతపెద్ద మొత్తం పారితోషికాన్ని రజినీ, కమల్, విజయ్ మాత్రమే తీసుకుంటున్నారు. ఇప్పుడు అజిత్ కు కూడా అంత పెద్ద మొత్తంలో రెమ్యూనరేషన్ ఇచ్చేందుకు రెడీగా ఉన్నట్లు సమాచారం. ప్రస్తుతం ఆయన విడాముయిర్చి చిత్రంలో నటించడానికి సిద్ధమవుతున్నారు. లైకా ప్రొడక్షన్స్ సంస్థ నిర్మిస్తోన్న ఈ సినిమా త్వరలోనే రెగ్యూలర్ షూటింగ్ స్టార్ట్ కానుంది. ఈ మూవీ తర్వాత సన్ పిక్చర్స్ నిర్మాణంలో అజిత్ సినిమా చేయనున్నారు.
View this post on Instagram
హిట్టు, ప్లాపులతో సంబంధం లేకుండా సన్ పిక్చర్స్ వరుస చిత్రాలను నిర్మిస్తోంది. ఇటీవల రజినీకాంత్ ప్రధాన పాత్రలో నటించిన జైలర్ చిత్రం ఊహించని రెస్పాన్స్ అందుకుంది. దీంతో ఈ సినిమాను నిర్మించిన సన్ పిక్చర్స్ భారీ లాభాలను అందుకుంది. ఇక ఈ నిర్మాణ సంస్థ బ్యానర్ లో ధనుష్ కథానాయకుడిగా ఓ సినిమాను భారీ ఎత్తున నిర్మిస్తున్నారు. అలాగే రజినీ, లోకేష్ కనగరాజ్ కాంబోలో ఓ మూవీని నిర్మించనున్నారు.
View this post on Instagram
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.