R.Madhavan: ఆ ఎయిర్ పోర్టుపై మాధవన్ ట్వీట్.. రిప్లై ఇచ్చిన ప్రధాని మోడీ..
'ప్రస్తుతం నేను కొత్త కెంపెగౌడ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఉన్నాను. విదేశాల్లో ఉన్న ఫీలింగ్ కలుగుతుంది. ఎవరు నమ్మలేరు ఇది విమానాశ్రయం అంటే. ఇక్కడ ఉన్న మౌలిక సదుపాయాలను చూస్తుంటే నమ్మకం రావడం లేదు. ఎయిర్ పోర్టులో వేలాడుతున్న మొక్కలు అన్నీ నిజమైనవి. పైనా ఇంకా నిర్మాణాలు చేశారు. అన్నీ అద్భుతంగా ఉన్నాయి' అంటూ ఎయిర్ పోర్టు మొత్తాన్ని వీడియో తీసి షేర్ చేశారు.

దక్షిణాది హీరో ఆర్.మాధవన్ ఇటీవల బెంగుళూరులోని కెంపెగౌడ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టుకు సంబంధించి ఓ వీడియో పోస్ట్ చేశారు. అందులో ఎయిర్ పోర్టులో కొత్తగా ఓపెన్ చేసిన టెర్నినల్ మౌలిక సదుపాయాలపై ప్రశంసలు కురిపించారు. ఎయిర్ పోర్టులోకి అడుగుపెట్టగానే విదేశాల్లో ఉన్న ఫీలింగ్ కలిగిందని.. అది విమానాశ్రయం అంటే ఎవరు నమ్మలేరని అన్నారు. తాజాగా మాధవన్ పోస్ట్ చేసిన వీడియో సోషల్ మీడియాలో వైరలవుతుంది. ‘ప్రస్తుతం నేను కొత్త కెంపెగౌడ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఉన్నాను. విదేశాల్లో ఉన్న ఫీలింగ్ కలుగుతుంది. ఎవరు నమ్మలేరు ఇది విమానాశ్రయం అంటే. ఇక్కడ ఉన్న మౌలిక సదుపాయాలను చూస్తుంటే నమ్మకం రావడం లేదు. ఎయిర్ పోర్టులో వేలాడుతున్న మొక్కలు అన్నీ నిజమైనవి. పైనా ఇంకా నిర్మాణాలు చేశారు. అన్నీ అద్భుతంగా ఉన్నాయి’ అంటూ ఎయిర్ పోర్టు మొత్తాన్ని వీడియో తీసి షేర్ చేశారు.
ఇక ఈ వీడియోను షేర్ చేస్తూ బెంగుళూరులోని కెంపెగౌడ ఇంటర్నేషనల్ విమానాశ్రయం. అత్యుత్తమమైనది. మౌలిక సదుపాయాలు ప్రపంచంలోని అద్భుతమైనవి. చాలా గరవంగా ఉంది అంటూ క్యాప్షన్ ఇచ్చారు. ప్రస్తుతం ఈ వీడియో వైరలవుతుండగా.. మాధవన్ పోస్టు పై ప్రధాని మోడీ స్పందించారు. భారతదేశ వృద్ధికి నెక్ట్స్ జెన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటూ రిప్లై ఇచ్చారు ప్రధానీ మోడీ. ఇక మాధవన్ వీడియోపై నెటిజన్స్ భిన్న రకాలుగా స్పందిస్తున్నారు.
View this post on Instagram
బెంగళూరులోని కెంపేగౌడ అంతర్జాతీయ విమానాశ్రయం సెప్టెంబర్ 12న టెర్మినల్ 2 (T2)లో అంతర్జాతీయ కార్యకలాపాలను ప్రారంభించింది. టెర్మినల్ 1 ఇండిగో, అకాసా ఎయిర్, అలయన్స్ ఎయిర్, స్పైస్‌జెట్ దేశీయ విమానాలకు కార్యాచరణ కేంద్రంగా పనిచేస్తుంది. టెర్మినల్ 2 ఎయిర్ ఏషియా, ఎయిర్ ఇండియా, స్టార్ ఎయిర్, విస్తారా దేశీయ విమానాలతో పాటు అన్ని అంతర్జాతీయ విమానాలకు ప్రత్యేకంగా అంకితం చేయబడుతుందని బెంగళూరు ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్ లిమిటెడ్ ప్రకటన తెలిపింది.
View this post on Instagram
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.