Focus : విజయేంద్ర ప్రసాద్ చేతులమీదుగా..సుహాసిని మ‌ణిర‌త్నం ఫస్ట్ లుక్..

విజ‌య్ శంక‌ర్, అషూ రెడ్డి, సుహాసిని మ‌ణిర‌త్నం, భానుచంద‌ర్ ప్ర‌ధాన పాత్ర‌ల‌లో నటించిన చిత్రం ఫోకస్‌.

Focus : విజయేంద్ర ప్రసాద్ చేతులమీదుగా..సుహాసిని మ‌ణిర‌త్నం ఫస్ట్ లుక్..
Suhasini Maniratnam
Follow us
Rajeev Rayala

|

Updated on: Feb 26, 2022 | 7:15 AM

Focus : విజ‌య్ శంక‌ర్, అషూ రెడ్డి, సుహాసిని మ‌ణిర‌త్నం, భానుచంద‌ర్ ప్ర‌ధాన పాత్ర‌ల‌లో నటించిన చిత్రం ఫోకస్‌. జి. సూర్య‌తేజ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్న సస్పెన్స్‌ థ్రిల్లర్ మూవీ ఇది. మర్డర్‌ మిస్టరీ బ్యాక్‌డ్రాప్‌లో ఆసక్తికరమైన క‌థ‌-క‌థ‌నాల‌తో ప్రేక్షకులను ఆద్యంతం ఆశ్చర్యపరిచే విధంగా ఈ మూవీ తెరకెక్కింది. ఇప్ప‌టికే విడుద‌లైన ఫ‌స్ట్‌లుక్ పోస్ట‌ర్‌, వేలంటైన్స్‌డే సంద‌ర్భంగా రిలీజైన పోస్ట‌ర్స్‌కి మంచి రెస్పాన్స్ వ‌చ్చింది. తాజాగా ఫోక‌స్ మూవీ నుండి సీనియ‌ర్ న‌టి సుహాసిని మ‌ణిరత్నం స్పెష‌ల్ లుక్ పోస్ట‌ర్ ను స్టార్ రైట‌ర్ విజ‌యేంద్ర‌ప్ర‌సాద్ ఆవిష్క‌రించారు.

ఈ సంద‌ర్భంగా రచయిత విజ‌యేంద్ర‌ప్ర‌సాద్ మాట్లాడుతూ  “సూర్య‌తేజ త‌న డెబ్యూ మూవీగా రిలాక్స్ మూవీ మేక‌ర్స్ ప‌తాకంపై `ఫోక‌స్` అనే చిత్రాన్ని తెర‌కెక్కిస్తున్నారు. విజ‌య్‌శంక‌ర్, అషూ రెడ్డి హీరోహీరోయిన్లు. సుహాసిని గారు ముఖ్య పాత్ర‌లో న‌టించారు. ఈ సినిమా టీజ‌ర్ చూశాను. చాలా బాగుంది. ఇంకా మంచి పాత్ర‌లు చాలా ఉన్నాయి. అంద‌రూ ఈ సినిమాని చూసి ఎంక‌రేజ్ చేయండి. టీమ్ అంద‌రికీ ఆల్ ది బెస్ట్‌“ అన్నారు. అలాగే చిత్ర ద‌ర్శ‌కుడు జి. సూర్య‌తేజ మాట్లాడుతూ – “నేను ద‌ర్శక‌త్వం వ‌హించిన‌ మొద‌టి చిత్రం `ఫోక‌స్`. ఈ సినిమాలోని సుహాసిని గారి లుక్ ను ఎన్నో సూప‌ర్ హిట్ చిత్రాల‌కు క‌థల‌ను అందించిన విజ‌యేంద్ర‌ప్ర‌సాద్ గారు విడుద‌ల చేయ‌డం చాలా సంతోషంగా ఉంది. భాను చంద‌ర్‌, షియాజీ షిండే, జీవా, సూర్య భ‌గ‌వాన్ ఇలా చాలా మంది ఆర్టిస్టులు ఈ సినిమాలో న‌టించారు. స‌స్పెన్స్ థ్రిల్ల‌ర్ మూవీ. షూటింగ్ పూర్త‌యింది. ప్ర‌స్తుతం పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ జ‌రుగుతోంది. మార్చిలో రిలీజ్ చేయ‌డానికి స‌న్నాహాలు చేస్తున్నాం“ అన్నారు. స్కైరా క్రియేషన్స్‌ సమర్పణలో రిలాక్స్‌ మూవీ మేకర్స్ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. ఈ సినిమాకు సంబందించిన మరిన్ని వివరాలు త్వరలో వెల్లడించనున్నారు.

మరిన్ని ఇక్కడ చదవండి : 

Bigg Boss OTT Telugu: ‏బిగ్‏బాస్ కొత్తింటిని చూపించిన నాగార్జున.. ఇక గ్యాప్ లేకుండా చూసేయండి అంటూ ప్రోమో రిలీజ్..

Poonam Kaur: పూనమ్ కౌర్ ఆసక్తికర ట్వీట్.. స్క్రీన్ షాట్ షేర్ చేస్తూ రివ్యూ చెప్పేసిందిగా..

Bheemla Nayak: ఈ టికెట్ ధరలకు మేము సినిమాను ప్రదర్శించలేమంటూ థియేటర్స్ క్లోజ్… ఎక్కడంటే..

టమాటా మసాలా కర్రీ.. ఎందులోకైనా అదుర్స్ అంతే..
టమాటా మసాలా కర్రీ.. ఎందులోకైనా అదుర్స్ అంతే..
ఉపేంద్ర UI బ్యూటీని శ్రీలీలతో పోలుస్తున్న నెటిజన్స్.. ఎందుకంటే..
ఉపేంద్ర UI బ్యూటీని శ్రీలీలతో పోలుస్తున్న నెటిజన్స్.. ఎందుకంటే..
ఇంట్లో పనిచేసే వారితో రామ్ చరణ్- ఉపాసన క్రిస్మస్ వేడుకలు.. ఫొటోస్
ఇంట్లో పనిచేసే వారితో రామ్ చరణ్- ఉపాసన క్రిస్మస్ వేడుకలు.. ఫొటోస్
ప్రఖ్యాత రచయిత వాసుదేవన్ నాయర్ కన్నుమూత
ప్రఖ్యాత రచయిత వాసుదేవన్ నాయర్ కన్నుమూత
నితీష్, నవీన్ పట్నాయక్‌కు భారతరత్న.. తెరమీదకు కొత్త డిమాండ్
నితీష్, నవీన్ పట్నాయక్‌కు భారతరత్న.. తెరమీదకు కొత్త డిమాండ్
శివన్న ఆరోగ్యంపై అప్డేట్ ఇచ్చిన కూతురు.. ఎమోషనల్ పోస్ట్
శివన్న ఆరోగ్యంపై అప్డేట్ ఇచ్చిన కూతురు.. ఎమోషనల్ పోస్ట్
మల్లారెడ్డా మజాకా.. జిమ్‌లో అదరగొట్టిన మాజీ మంత్రి
మల్లారెడ్డా మజాకా.. జిమ్‌లో అదరగొట్టిన మాజీ మంత్రి
స్మార్ట్ వాచ్‌లు పెట్టుకుంటున్నారా.. ఈ వ్యాధులు రావడం ఖాయం!
స్మార్ట్ వాచ్‌లు పెట్టుకుంటున్నారా.. ఈ వ్యాధులు రావడం ఖాయం!
ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలుకలిగిన క్యాబేజీ..వారానికి ఒక్కసారైనా తింటే
ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలుకలిగిన క్యాబేజీ..వారానికి ఒక్కసారైనా తింటే
శ్రీతేజ్‌ను పరామర్శించిన జానీ మాస్టర్.. బన్నీ గురించి ఏమన్నాడంటే?
శ్రీతేజ్‌ను పరామర్శించిన జానీ మాస్టర్.. బన్నీ గురించి ఏమన్నాడంటే?