Sudigali Sudheer: సుడిగాలి సుధీర్ విరక్తి.. ఇక మ్యారేజ్ చేసుకోనంటూ తేల్చీ చెప్పేశాడు.. కారణం అదేనా?
పెళ్లీడుకొస్తే.. ఎవరైనా పెళ్లే చేసుకుంటారు. కాని తాను మాత్రం పెళ్లి చేసుకోనని అంటున్నారు సుడిగాలి సుధీర్. అనడమే కాదు.. ఇదే మాటను కాస్త గట్టిగా.. ఫిక్స్ అనేలా చెబుతున్నారు. ఈ మాటలతో నెట్టింట తెగ వైలర్ అవుతున్నారు.
బుల్లితెర సూపర్ స్టార్ సుడిగాలి సుధీర్ హీరోగా నటిస్తోన్న చిత్రం గాలోడు. మాస్ అండ్ యాక్షన్ ఎంటర్టైనర్గా రాబోతున్న ఈ చిత్రంలో సుధీర్ సరసన గెహ్నా సిప్పి హీరోయిన్‌గా నటిస్తోంది. ఈ చిత్రానికి రాజశేఖర్ రెడ్డి పులిచర్ల దర్శకత్వం వహించగా.. ప్రకృతి సమర్పణలో సంస్కృతి ఫిలింస్ నిర్మిస్తోంది. ఇప్పటికే విడుదలైన టీజర్, ట్రైలర్‌లకు విశేషమైన స్పందన లభించింది. ఈ చిత్రం నవంబర్ 18న ప్రపంచవ్యాప్తంగా విడుదలవుతోన్న సందర్భంగా హీరో సుధీర్ ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. ఈ క్రమంలోనే ప్రేమ, పెళ్లి గురించి ఆసక్తికర కామెంట్స్ చేశారు.
సుధీర్ మాట్లాడుతూ.. తనకు ఆన్ స్క్రీన్ కెమిస్ట్రీ అంటే నాకు అంతగా ఇష్టం ఉండదని. రష్మీ గారికి నాకు ఎందుకు అలా కుదిరిందంటే.. మేం ఇద్దరం పట్టుకోం.. ముట్టుకోం. కళ్లతోనే మా భావాలు చెప్పేందుకు ప్రయత్నిస్తుంటాం. ఆన్ స్క్రీన్ మీద రొమాన్స్ మాత్రం వద్దని చెబుతాను. కానీ డైరెక్టర్‌కు నేను చెప్పే పొజిషన్‌లో లేను. ఆ స్థాయికి వచ్చినప్పుడు మాత్రం కచ్చితంగా అలాంటివి వద్దని చెబుతానని అన్నారు. తాను పెళ్లి చేసుకోనంటూ… షాకింగ్ కామెంట్స్ చేశారు. కొశ్వ్చన్ అడిని యాంకర్‌కే జబర్దస్త్ రేంజ్ పంచ్ ఇచ్చారు.
అయితే సుడిగాలి సుధీర్… రష్మితో లవ్‌లో ఉన్నారనే న్యూస్ నెట్టింట వైరల్ క్రమంలో… నేను..పెళ్లి చేసుకోను అంటూ.. ఈ బాయ్ కామెంట్ చేయడం ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. పెళ్లి కాకుండా రష్మితో ఎప్పటికీ లివింగ్ రిలేషన్లో ఉంటాడేమో అనే అనుమానాన్ని అందరిలో కలిగిస్తోంది.