Sudheer Babu: “ఆయన నన్ను యాక్టర్‌గా నమ్మారు.. నేను ఆయన కథల్ని నమ్మాను”.. సుధీర్ బాబు ఆసక్తికర కామెంట్స్

యంగ్ హీరో సుధీర్ బాబు(Sudheer Babu) నటిస్తోన్న లేటెస్ట్ మూవీ ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి. మంచి అభిరుచి కలిగిన దర్శకుడిగా పేరు తెచ్చుకున్న ఇంద్రగంటి మోహన్ కృష్ణ

Sudheer Babu: ఆయన నన్ను యాక్టర్‌గా నమ్మారు.. నేను ఆయన కథల్ని నమ్మాను.. సుధీర్ బాబు ఆసక్తికర కామెంట్స్
Sudheer Babu
Follow us
Rajeev Rayala

|

Updated on: Sep 15, 2022 | 8:50 PM

యంగ్ హీరో సుధీర్ బాబు(Sudheer Babu) నటిస్తోన్న లేటెస్ట్ మూవీ ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి. మంచి అభిరుచి కలిగిన దర్శకుడిగా పేరు తెచ్చుకున్న ఇంద్రగంటి మోహన్ కృష్ణ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో అందాల భామ కృతి శెట్టి హీరోయిన్ గ నటిస్తోంది.   విలక్షణమైన ప్రేమకథగా ”ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి’ తెరకెక్కింది.  బెంచ్‌మార్క్ స్టూడియోస్‌పై మైత్రీ మూవీ మేకర్స్‌తో కలిసి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. గాజులపల్లె సుధీర్ బాబు చిత్రాన్ని సమర్పిస్తున్నారు. సెప్టెంబర్ 16న ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ విడుదలౌతున్న నేపథ్యంలో  హీరో సుధీర్ బాబు మీడియాతో ముచ్చటించారు. ఈ సందర్భంగా సుధీర్ బాబు మాట్లాడుతూ ఆసక్తికర విషయాలను పంచుకున్నారు.

ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి’ ట్రైలర్ లో ఒక ఒక డైలాగ్ వుంది. ”మనం సినిమా తీస్తున్నాం అనుకుంటాం. కానీ సినిమానే మనల్ని తీస్తుంది’అని. వాస్తవానికి మా కాంబినేషన్ వలన ఈ సినిమా జరగలేదు. సినిమానే మమ్మల్ని ఎంపిక చేసుకుంది అన్నారు సుధీర్ బాబు. ఇంద్రగంటి గారు నన్ను యాక్టర్ గా నమ్మారు. నేను ఆయన కథల్ని నమ్మాను. ఆయన ఒక కాంబినేషన్ ని సెట్ చేసుకోవాలనుకునే దర్శకుడు కాదు. ఒక హిట్ ఇచ్చిన వెంటనే ఒక పెద్ద స్టార్ కోసం ఎదురుచూస్తారు. కథలు రాస్తారు. కానీ ఆయన మాత్రం ఒక కథని రాసుకొన్న తర్వాత దానికి ఎవరు నప్పుతారో చూస్తారు. ఆయన నాతో సినిమాలు చేయడం అదృష్టంగా భావిస్తున్నాను అన్నారు. అలాగే ఇంద్రగంటి గారి సినిమాల్లో ఎమోషన్ చాలా గొప్పగా వుంటుంది. ప్రతి ఒక్కరూ ఆ పాత్రలతో ప్రయాణిస్తారు. ఇందులో కమర్షియల్ సినిమా డైరెక్టర్ పాత్రలో కనిపిస్తా. ఆ పాత్రకి కొంచెం తిక్క, భిన్నమైన అభిరుచి వుంటుంది. కమర్షియల్ సినిమా కూడా గొప్ప పర్పస్ కోసం తీస్తామని ప్రోజెక్ట్ చేయడం జరిగింది. ఇంద్రగంటి గారు ఈ పాత్రని చాలా వైవిధ్యంగా డిజైన్ చేశారు అన్నారు.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి  

ఇవి కూడా చదవండి
డ్రగ్ స్మగ్లర్ హత్య.. చంపి పగ తీర్చుకున్న బిష్ణోయ్ గ్యాంగ్.!
డ్రగ్ స్మగ్లర్ హత్య.. చంపి పగ తీర్చుకున్న బిష్ణోయ్ గ్యాంగ్.!
మీ శరీరంలో ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు నిర్లక్ష్యం చెయ్యద్దు.!
మీ శరీరంలో ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు నిర్లక్ష్యం చెయ్యద్దు.!
వెలగ పండుతో అద్భుతాలే.. సంతానలేమి సమస్యలు మాయం!
వెలగ పండుతో అద్భుతాలే.. సంతానలేమి సమస్యలు మాయం!
ఐటీ చెల్లింపుదారులకు పండగే.. వచ్చే బడ్జెట్‌లో ట్యాక్స్ తగ్గింపు.?
ఐటీ చెల్లింపుదారులకు పండగే.. వచ్చే బడ్జెట్‌లో ట్యాక్స్ తగ్గింపు.?
ఇలాంటి వాళ్లను ఏం చేయాలి? రేణూ దేశాయ్ సంచలన పోస్ట్.. ఏమైందంటే?
ఇలాంటి వాళ్లను ఏం చేయాలి? రేణూ దేశాయ్ సంచలన పోస్ట్.. ఏమైందంటే?
17 ఏళ్లకే క్రేజీ హీరోయిన్.. రహస్యంగా పెళ్లి, 9 నెలలకే విడాకులు..
17 ఏళ్లకే క్రేజీ హీరోయిన్.. రహస్యంగా పెళ్లి, 9 నెలలకే విడాకులు..
ఐఆర్‌సీటీసీ సైట్‌ డౌన్‌ అయితే రైలు టికెట్లను బుక్‌ చేసుకోవడం ఎలా?
ఐఆర్‌సీటీసీ సైట్‌ డౌన్‌ అయితే రైలు టికెట్లను బుక్‌ చేసుకోవడం ఎలా?
కొత్త ఫీచర్లతో హోండా యూనికార్న్.. అప్‌డేట్ మోడల్ విడుదల
కొత్త ఫీచర్లతో హోండా యూనికార్న్.. అప్‌డేట్ మోడల్ విడుదల
బిచ్చగత్తె చేతిలో అనుమానాస్పద ప్లాస్టిక్ బ్యాగ్.. తెరిచి చూడగా
బిచ్చగత్తె చేతిలో అనుమానాస్పద ప్లాస్టిక్ బ్యాగ్.. తెరిచి చూడగా
హైడ్రాకు ఇప్పటివరకు ఎన్ని ఫిర్యాదులు వచ్చాయో తెలుసా..?
హైడ్రాకు ఇప్పటివరకు ఎన్ని ఫిర్యాదులు వచ్చాయో తెలుసా..?