AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Sudha Murty: వ్యాక్సిన్ వార్ సినిమా పై రివ్యూ ఇచ్చిన సుధామూర్తి.. ఏమన్నారంటే

మానవతా మూర్తి సుధా మూర్తి కూడా ఇటీవల ' ది వ్యాక్సిన్ వార్' సినిమా చూశారు . సినిమా గురించి తన రివ్యూ ఇచ్చారు. అంతకు ముందు నటుడు మాధవన్ సినిమా చూశాడు. ఇప్పుడు సుధా మూర్తి కూడా సినిమాను మెచ్చుకున్నారు. దాంతో ఈ సినిమా క్రేజ్ మరింత పెరిగింది. 'ది వ్యాక్సిన్ వార్' సినిమా ఇండియన్ తొలి బయో సైన్స్ సినిమా. కోవిడ్ సమయంలో భారతదేశం ఎలాంటి  కష్టాలను ఎదుర్కొంది. అలాగే కరొనకు నివారణను కనుగొనడానికి ఎలా కష్టపడింది అనేదే ఈ చిత్రంలో చూపించనున్నారు.

Sudha Murty: వ్యాక్సిన్ వార్ సినిమా పై రివ్యూ ఇచ్చిన సుధామూర్తి.. ఏమన్నారంటే
Sudha Murthy
Follow us
Rajeev Rayala

|

Updated on: Sep 20, 2023 | 9:29 AM

వివేక్ అగ్నిహోత్రి దర్శకత్వంలో తెరకెక్కిన వ్యాక్సిన్ వార్ మూవీ విడుదలకు ముందే సంచలనాలు సృష్టిస్తుంది.  సెలబ్రిటీల కోసం ఈ సినిమా స్పెషల్ షోను ఏర్పాటు చేస్తున్నారు. మానవతా మూర్తి సుధా మూర్తి కూడా ఇటీవల ‘ ది వ్యాక్సిన్ వార్’ సినిమా చూశారు . సినిమా గురించి తన రివ్యూ ఇచ్చారు. అంతకు ముందు నటుడు మాధవన్ సినిమా చూశాడు. ఇప్పుడు సుధా మూర్తి కూడా సినిమాను మెచ్చుకున్నారు. దాంతో ఈ సినిమా క్రేజ్ మరింత పెరిగింది. ‘ది వ్యాక్సిన్ వార్’ సినిమా ఇండియన్ తొలి బయో సైన్స్ సినిమా. కోవిడ్ సమయంలో భారతదేశం ఎలాంటి  కష్టాలను ఎదుర్కొంది. అలాగే కరొనకు నివారణను కనుగొనడానికి ఎలా కష్టపడింది అనేదే ఈ చిత్రంలో చూపించనున్నారు. వివేక్ అగ్నిహోత్రి గతంలో తెరకెక్కించినది  కాశ్మీర్ ఫైల్స్ సినిమా ఎంత పెద్ద హిట్ అయ్యిందో ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు.

వాక్సిన్ వార్ సినిమా చూసిన సుధామూర్తి మాట్లాడుతూ.. ది వ్యాక్సిన్‌ వార్‌’ని ‘హృదయానికి హత్తుకునే’ సినిమా అని  పేర్కొన్నారు. సుధా మూర్తి  మాట్లాడుతూ..సినిమా పై రివ్యూ ఇచ్చారు. ‘మహిళల పాత్ర నాకు అర్థమైంది. మహిళలు తమ వృత్తులు చేసుకుంటూనే..తల్లి, భార్య తమ బాధ్యతలను నిర్వర్తిస్తున్నారు. ఓ వైపు కుటుంబం మరో వైపు తమ పనిని బ్యాలెన్స్ చేయడం చాలా కష్టం. ఈ విషయంలో కొంతమంది మహిళలు అద్భుతాలు సృష్టిస్తున్నారు. మేము ఉంటున్న భవనం పైన మా తల్లిదండ్రులు నివసించారు. నేను క్రింద నివసిస్తున్నా. కాబట్టి మరింత పని చేయడానికి ఇది నాకు సహాయపడింది. పిల్లలను పెంచడం అలాగే తమ వృత్తిని కొనసాగించడం కష్టం. అలా చేయాలంటే కుటుంబసభ్యుల సహకారం అవసరం.

కోవిడ్ సమయంలో మహిళా శాస్త్రవేత్తలు ల్యాబ్‌కు వచ్చి పరిశోధనలు చేశారు. ఇది సినిమాలో చూపించారు అని అన్నారు. అలాగే కోవాక్సిన్ అంటే ఏమిటో సామాన్యులకు అర్థం కావడం లేదు. అయితే దీని వెనుక ఉన్న కృషిని ఈ సినిమా చూపించారు. శాస్త్రవేత్తలందరూ నిస్వార్థ కృషి చేశారు. కోవిడ్ కాలంలో శాస్త్రవేత్తలు ఎంతో శ్రమించి ప్రాణాలను పణంగా పెట్టి వ్యాక్సిన్ ను కనిపెట్టారు. దాంతో మనం ఆనందంగా జీవించగలిగాం’ అ ని  అన్నారు.

దర్శకుడు వివేక్ అగ్ని హోత్ర ఇన్ స్టా గ్రామ్ పోస్ట్

View this post on Instagram

A post shared by Sonu Sood (@sonu_sood)

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.