Jailer: జైలర్ సినిమా విలన్ రెమ్యునరేషన్ ఎంతో తెలుసా..? మరీ ఇంత తక్కువా..!!

ఆడియో రైట్స్, ఓటీటీ, శాటిలైట్ రైట్స్ కలుపుకుంటే సినిమా వసూళ్లు 1000 కోట్లు దాటాయి. సినిమా విజయంతో ఆనందంలో తేలిపోతున్న నిర్మాత కళానిధిమారన్ హీరో రజనీకాంత్, దర్శకుడు నెల్సన్, సంగీత దర్శకుడు అనిరుధ్ రవిచంద్రన్‌లకు ఖరీదైన కార్లను బహుమతిగా ఇచ్చారు. కానీ ‘జైలర్’ సినిమాలో విలన్ గా నటించి అందరి దృష్టిని ఆకర్షించిన మలయాళ నటుడు వినాయకన్ పారితోషికం చాలా తక్కువనే తీసుకున్నారని గుసగుసలు వినిపిస్తున్నాయి.

Jailer: జైలర్ సినిమా విలన్ రెమ్యునరేషన్ ఎంతో తెలుసా..? మరీ ఇంత తక్కువా..!!
Vinayakan
Follow us
Rajeev Rayala

|

Updated on: Sep 20, 2023 | 9:56 AM

రజనీకాంత్ నటించిన ‘ జైలర్ ‘ సూపర్ డూపర్ హిట్ సొంతం చేసుకుంది. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద 600 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది. ఆడియో రైట్స్, ఓటీటీ, శాటిలైట్ రైట్స్ కలుపుకుంటే సినిమా వసూళ్లు 1000 కోట్లు దాటాయి. సినిమా విజయంతో ఆనందంలో తేలిపోతున్న నిర్మాత కళానిధిమారన్ హీరో రజనీకాంత్, దర్శకుడు నెల్సన్, సంగీత దర్శకుడు అనిరుధ్ రవిచంద్రన్‌లకు ఖరీదైన కార్లను బహుమతిగా ఇచ్చారు. కానీ ‘జైలర్’ సినిమాలో విలన్ గా నటించి అందరి దృష్టిని ఆకర్షించిన మలయాళ నటుడు వినాయకన్ పారితోషికం చాలా తక్కువనే తీసుకున్నారని గుసగుసలు వినిపిస్తున్నాయి. ఈ విష‌యాన్ని వినాయకన్ స్వ‌యంగా తెలిపాడు.

‘జైలర్’ సినిమాలో విలన్ పాత్రను అద్భుతంగా హ్యాండిల్ చేశారు వినాయకన్. వినాయకన్ చాలా సినిమాల్లో విలన్ గా నటించారు. అయితే జైలర్ సినిమా కోసం వినయగన్ కేవలం 35 లక్షల రూపాయల పారితోషికం తీసుకున్నట్లు వార్తలు హల్ చల్ చేస్తున్నాయి. అయితే దీని గురించి ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన వినాయకన్ .. నిర్మాతలు ఈ వార్త వినకపోతే చాలు అని అన్నారు.. నాకు 35 లక్షలు ఇచ్చారన్న వార్తల్లో నిజం లేదు. ఈ తప్పుడు వార్తలను కొందరు ప్రచారం చేసినట్లు తెలుస్తోంది. నిర్మాతలు నేను అడిగినంత ఇచ్చారు. సెట్‌లో నాకు రాయల్ ట్రీట్‌మెంట్ కూడా ఇచ్చారు’’ అని అన్నారు.

సినిమా సినిమా చేసి చాలా కాలం అయ్యింది. ‘జైలర్’ నాకు చాలా పెద్ద అవకాశం. అవకాశం ఇచ్చినందుకు నేను సంతోషిస్తున్నా.. ‘జైలర్’ సినిమాలో పాత్ర కారణంగా ధనుష్ నటించిన ‘కెప్టెన్ మిల్లర్’ సినిమా అవకాశాన్ని కోల్పోవాల్సి వచ్చింది. అయితే అదంతా మా చేతుల్లో లేదు’’ అని వినాయకన్ అన్నారు. మలయాళ నటుడైన వినాయకన్. డ్యాన్సర్‌గా కెరీర్ ప్రారంభించి ఆ తర్వాత చిన్న చిన్న పాత్రల్లో నటిస్తూ ఈ స్థాయికి ఎదిగాడు. మలయాళంలో ‘కమ్మటిపదం’ సినిమాలో ఆయన నటనతో మెప్పించారు. ఆ సినిమాకు నేషనల్ అవార్డ్ వస్తుందని అనుకున్నారు కానీ మిస్ అయింది. కానీ ఫిలింఫేర్, కేరళ రాష్ట్ర అవార్డులు అందుకున్నారు. 2006లో ‘తిమిరు’ సినిమాలో చిన్న పాత్రతో తమిళ చిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టిన వినాయకన్ ఇప్పుడు యమా క్రేజ్ తెచ్చుకున్నాడు. ఇప్పుడు పెద్ద సూపర్ స్టార్ రజనీకాంత్ ను ఢీ కొట్టే విలన్ గా ఎదిగాడు. అలాగే అతడు మంచి సంగీత విద్వాంసుడు కూడా.. వినాయకన్ కొన్ని మలయాళ చిత్రాలకు సంగీత దర్శకత్వం కూడా చేసారు. ఇక ఈ విలన్ కు మరిన్ని అవకాశాలు వస్తున్నాయి.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.