AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Megastar Chiranjeevi: సమాతా మూర్తి విగ్రహాన్ని దర్శించుకున్న చిరంజీవి దంపతులు..

రంగారెడ్డి జిల్లా ముచ్చింతల్‏లో సమాతామూర్తి సన్నిదిలో 11వ రోజు రామానుజచార్యల సహస్రాబ్ధి ఉత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి.

Megastar Chiranjeevi: సమాతా మూర్తి విగ్రహాన్ని దర్శించుకున్న చిరంజీవి దంపతులు..
Megastar
Rajitha Chanti
|

Updated on: Feb 12, 2022 | 7:38 PM

Share

రంగారెడ్డి జిల్లా ముచ్చింతల్‏లో సమాతామూర్తి సన్నిదిలో 11వ రోజు రామానుజచార్యల సహస్రాబ్ధి ఉత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. శ్రీరామనగరంలో శ్రీ భగవద్రామానుజుల సహస్రాబ్ధి ఉత్సవాలు మహావైభవంగా సాగుతున్నాయి. వేదమంత్రాలు, అష్టోత్తర నామాలు, శ్రీలక్ష్మీనారసింహుడి స్తోత్రాలతో..శ్రీరామ నగరం పులకించి పోతోంది. యాగాలు, యజ్ఞక్రతువులు, విశేషపూజలతో ఆధ్మాత్మిక పరిమళాలను వెదజల్లుతోంది. సమాతా మూర్తి విగ్రహాన్ని దర్శించుకోవడానికి రాజకీయ, సినీ ప్రముఖులు అక్కడకు చేరుకుంటున్నారు. తాజాగా మెగాస్టార్ చిరంజీవి దంపతులు సమాతామూర్తి విగ్రహంతోపాటు పాటు 108 దివ్య దేశాలను వారు దర్శించుకున్నారు. సమతామూర్తి విగ్రహ విశేషాలను రాము రావ్ దగ్గరుండి చిరంజీవి దంపతులకు వివరించారు. అంతకు ముందు భీష్మ ఏకాదశి సందర్భంగా విష్ణు సహస్ర నామా పారాయణం నిర్వహించారు. హోమగుండాల పరిక్రమణలో భక్తులు తన్మయత్వం చెందారు.

అలాగే జూనియర్‌ ఎన్టీఆర్‌ కుటుంబసభ్యులు సమతామూర్తి భవ్య విగ్రహాన్ని దర్శించుకున్నారు. యజ్ఞశాలను దర్శించి పూజా కార్యక్రమాల్లో పాల్గొన్నారు. అలాగే ప్రముఖ నిర్మాత దిల్ రాజు ..కుటుంబసమేతంగా సమాతామూర్తి విగ్రాహాన్ని దర్శించుకున్నారు. ఇక నిన్న ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ సమాతా మూర్తి విగ్రహాన్ని దర్శించుకున్నారు.

Also Read: Sarkaru Vaari Paata: సర్కారు వారి పాట చిత్రాన్ని వదలని పైరసీ బెడద.. ఒక్కరోజు ముందుగానే కళావతి సాంగ్ లీక్..

Priya Prakash Varrier: కచా బాదం పాటకు స్టెప్పులేసిన ప్రియా ప్రకాష్.. నెట్టింట్లో తెగ వైరల్ అవుతున్న వీడియో..

Throwback Pic: ఈ ఫోటోలో ఉన్న చిన్నారి ఎవరో గుర్తుపట్టారా.? గ్లామర్ షోకు దూరంగా జూనియర్ సౌందర్యగా..

Manchu Lakshmi: ఎట్టకేలకు నెరవేరబోతున్న మంచు లక్ష్మీ కల.. ఈరోజు కోసం ఎదురుచూస్తున్నానంటూ..

Follow Us