AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

SSMB 29 Globetrotter: ఎవరి ఊహలకు అందదు.. మహేష్- రాజమౌళి సినిమా కథను లీక్ చేసిన విజయేంద్ర ప్రసాద్

ప్రస్తుతం ఎక్కడ చూసినా మహేశ్ బాబు- రాజమౌళి 'గ్లోబ్ ట్రాటర్' గ్రాండ్ ఈవెంట్ గురించే చర్చ నడుస్తోంది. సోషల్ మీడియాలోనూ ఈ ఈవెంట్ కు సంబంధించిన ఫొటోలు, వీడియోలే కనపిస్తున్నాయి. హైదరాబాద్ లోని రామోజీ ఫిల్మ్ సిటీలో జరుగుతోన్న ఈ ఈవెంట్ కోసం అభిమానులు భారీగా తరలివచ్చారు.

SSMB 29 Globetrotter: ఎవరి ఊహలకు అందదు.. మహేష్- రాజమౌళి సినిమా కథను లీక్ చేసిన విజయేంద్ర ప్రసాద్
Mahesh Babu Varanasi Movie
Basha Shek
|

Updated on: Nov 15, 2025 | 7:58 PM

Share

సూపర్ స్టార్ మహేష్‌ బాబు, దర్శక ధీరుడు రాజమౌళి కాంబినేషన్ లో ఓ యాక్షన్ అడ్వెంచర్ థ్రిల్లర్ మూవీ తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించి రిలీజైన అప్డేట్స్ అభిమానులకు తెగ నచ్చేశాయి. పృథ్వీరాజ్ సుకుమారన్ (కుంభ), ప్రియాంక చోప్రా (మందాకిని) ఫస్ట్ లుక్స్ కు ఫ్యాన్స్ నుంచి సూపర్బ్ రెస్పాన్స్ వచ్చింది. ఇక సంచారి సాంగ్ అయితే యూట్యూబ్ లో చార్ట్ బస్టర్ గా నిలిచింది. ఇక ఈ క్రేజీ ప్రాజెక్టుకు సంబంధించి శనివారం (నవంబర్ 15) హైదరాబాద్ రామోజీ ఫిల్మ్ సిటీలో ఓ గ్రాండ్ ఈవెంట్ జరుగుతోన్న సంగతి తెలిసిందే. ఇదే ఈవెంట్ లోనే మహేష్ సినిమాకు టైటిల్ ను అధికారికంగా ప్రకటించారు. ముందు నుంచి ఊహించినట్లుగా ఈ గ్లోబల్ ప్రాజెక్టుకు వారణాసి అని పవర్ ఫుల్ టైటిల్ ఫిక్స్ చేశారు. అలాగే ఈ సినిమాలో మహేష్ బాబు రోల్ ను రివీల్ చేశారు. ఈ మూవీలో రుద్ర అనే పవర్ ఫుల్ రోల్ లో కనిపించనున్నాడు సూపర్ స్టార్. ఈ మేరకు తాజాగా రిలీజైన టైటిల్ గ్లింప్స్ లో చేతిలో త్రిశూలం పట్టుకుని కనిపించాడు మహేష్. ప్రస్తుతం ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారింది.

మహేష్ బాబు – రాజమౌళి సినిమా టైమ్ ట్రావెల్ కథనా?

కాగా వారణాసి సినిమా కథ గురించి సోషల్ మీడియాలో ఆసక్తికర చర్చ జరుగుతోంది. మహేష్- రాజమౌళి సినిమా కథ ఇదేనంటూ చాలా మంది నెట్టింట పోస్టులు పెడుతున్నారు. వారణాసి సినిమా పురాతన ప్రపంచం, ఆధునిక యుగం మధ్య కదులుతున్న టైమ్ ట్రావెల్ చుట్టూ తిరుగుతుందని చాలా మంది అభిప్రాయపడుఉతన్నారు. ‘టైమ్ ట్రాటర్ .. ఇది టైమ్ ట్రావెల్ మూవీ.. పురాతన ప్రపంచం.. మోడ్రన్ వరల్డ్ గ్లోబ్ ట్రాటర్ గా మహేష్ కనిపించనున్నాడు’ అని నెటిజన్లు పోస్టులు వైరల్ చేస్తున్నారు.

ఇవి కూడా చదవండి

గ్లోబ్ ట్రాటర్ ఈవెంట్ లో రచయిత విజయేంద్ర ప్రసాద్ కూడా ఈ సినిమా కథపై ఓ హింట్ ఇచ్చాడు..’ఒక్కోసారి మాట్లాడటానికి మాటలు రావు.. కొన్నిసార్లు ఉన్నా చెప్పలేం. ఈ సినిమాలో 30 నిమిషాల లెంత్ ఉంది.. అలా చూస్తుండిపోయాను మహేష్ బాబు విశ్వరూపం అందులో. సీజీ లేదు, బ్యాగ్రౌండ్ లేదు ఏం లేకపోయినా మహేష్ విశ్వరూపం చూపించాడు. కొన్ని సినిమాలు మనుషులు చేస్తారు.. కొన్ని సినిమాలు దేవతలు చేయించుకుంటారు. అనుక్షణం రాజమౌళి గుండెల మీద హనుమాన్ ఉన్నాడు.. ఊపిరితో కర్తవ్యం బోధిస్తున్నాడు. హనుమకు రామనామం ఇష్టం’ అంటూ సినిమా బ్యాక్ డ్రాప్ హనుమాన్ అని చెప్పకనే చెప్పాడు విజయేంద్రప్రసాద్.

గ్లోబ్ ట్రాటర్ ఈవెంట్ లో మహేష్ బాబు, ప్రియాంక చోప్రా..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

అత్తవారింట సమంతకు గ్రాండ్‌ వెల్‌కమ్‌
అత్తవారింట సమంతకు గ్రాండ్‌ వెల్‌కమ్‌
బిగ్ బాస్ కు షాకిచ్చిన స్టార్ మా.. సీరియల్ ఎఫెక్ట్
బిగ్ బాస్ కు షాకిచ్చిన స్టార్ మా.. సీరియల్ ఎఫెక్ట్
భరణిని తొక్కేసి కళ్యాణ్ దూకుడుకి బ్రేకేసిన రీతూ
భరణిని తొక్కేసి కళ్యాణ్ దూకుడుకి బ్రేకేసిన రీతూ
రాజ్‌ గురించి బ్రేకింగ్ న్యూస్ కావాలా ?? మాజీ భార్య షాక్
రాజ్‌ గురించి బ్రేకింగ్ న్యూస్ కావాలా ?? మాజీ భార్య షాక్
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
వామ్మో.. కరోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్
వామ్మో.. కరోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
కారు స్టార్ట్‌ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్‌ చేసిన డ్రైవర్‌ షాక
కారు స్టార్ట్‌ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్‌ చేసిన డ్రైవర్‌ షాక
వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం
వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం
ఖతర్నాక్‌ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..
ఖతర్నాక్‌ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..