Mahesh Babu : నందిపై శివుడిలా మహేష్.. విజువల్ అదిరిపోయిందబ్బా.. వీడియోస్ మీకోసం..
దర్శకధీరుడు రాజమౌళి దర్శకత్వంలో సూపర్ స్టార్ మహేష్ బాబు ఓ ప్రాజెక్ట్ చేస్తున్న సంగతి తెలిసిందే. SSMB 29 పేరుతో కొన్ని నెలలుగా ఈ మూవీ షూటింగ్ జరుపుకుంటుంది. ఇప్పటికే ఈ ప్రాజెక్ట్ పై భారీ అంచనాలు నెలకొనగా.. కొన్నాళ్ల క్రితం విడుదలైన మహేష్ బాబు ప్రీ లుక్ పోస్టర్ మరింత హైప్ క్రియేట్ చేసింది.

ప్రస్తుతం ఎమహేశ్-రాజమౌళి ‘గ్లోబ్ ట్రాటర్’ ఈవెంట్ సందడి కనిపిస్తుంది. ఇక సోషల్ మీడియాలో ఈవెంట్ హడావుడి ఎలా ఉందో చెప్పక్కర్లేదు. హైదరాబాద్ శివారులోని రామోజీ ఫిల్మ్ సిటీలో ఈ వేడుక నిర్వహిస్తున్నారు. ఇప్పటికే ఈ షో ప్రారంభం కాగా.. వందలాది మంది అభిమానులు చేరుకున్నారు. పాటు వేలాదిమంది దీన్ని వీక్షిస్తున్నారు. అయితే ఈవెంట్ ప్రారంభంలోనే మూవీ టైటిల్ ఏంటనేది ప్రకటించేశారు. గత కొన్నిరోజుల నుంచి వినిపిస్తున్నట్లుగానే ‘వారణాసి’ అని ఫిక్స్ చేశారు. టైటిల్ గ్లింప్స్ వీడియోని ఈవెంట్ స్క్రీన్ పై ప్రసారం చేశారు. ఇందుకు సంబంధించిన వీడియోస్ అభిమానులు సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు.
తాజాగా రివీల్ అయిన వీడియోలో మహేష్ ఎద్దు పై స్వారీ చేస్తూ.. నందిపై శివుడిలా కనిపిస్తున్నారు. ఇప్పుడు నెట్టింట షేర్ అవుతున్న విజువల్స్ అదిరిపోయాయి. ఇందులో మహేష్ రుద్ర అనే పాత్రలో కనిపించనున్నారు. అలాగే మందాకినిగా ప్రియాంక చోప్రా, కుంభ పాత్రలో పృథ్వీరాజ్ సుకుమారన్ కనిపించనున్నారు.
Edhi Chalu Saami 🔥🔥🔥🥵🥵🥵#GlobeTrotter #GlobeTrotterEvent pic.twitter.com/9cKkbKIcSQ
— GlobeTrotter Fan Club (@GlobetrotterOfl) November 15, 2025
#VARANASI 💥🔥🔥🔥🔥🔥🔥🔥
JAI BABU @urstrulyMahesh 🦁🦁🦁#GlobeTrotter #SSMB29 pic.twitter.com/nviB8jIeUq
— ☆ Loyal Maheshians ☆ (@LoyalMaheshians) November 15, 2025
Yesss, finally! #SSMB29 is now #VARANASI! 🔱🔥
Emunaaduraaa Babuuu… World Records Thenguthunam! 💥🧨🦁#GlobeTrotter #PeddaHeroCinema
— Praneeth Chowdary (@praneethballa) November 15, 2025
ఇవి కూడా చదవండి : ఒకప్పుడు తినడానికి తిండి లేదు.. ఇప్పుడు 5 నిమిషాలకు 5 కోట్లు..




