Tollywood News: ఇండ‌స్ట్రీలో ఇంట్ర‌స్టింగ్ న్యూస్.. మహేష్ మూవీ కోసం తమన్ అండ్ డీఎస్పీ ఇద్దరూ.. !

తమన్ అండ్ డీఎస్పీ... ఒకరు ఉప్పెన లాంటి పవర్ ఫుల్ ట్యూన్స్ కి కేరాఫ్.. మరొకరు భూమ్ బద్దలయ్యే బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కి మారు పేరు. వీళ్ళిద్దరూ కలిస్తే.. కలిసి ఒకే సినిమాకు పని చేస్తే..!

Tollywood News:   ఇండ‌స్ట్రీలో ఇంట్ర‌స్టింగ్ న్యూస్..  మహేష్ మూవీ కోసం తమన్ అండ్ డీఎస్పీ ఇద్దరూ.. !
Thaman Dsp
Follow us
Ram Naramaneni

|

Updated on: May 13, 2021 | 7:39 PM

తమన్ అండ్ డీఎస్పీ… ఒకరు ఉప్పెన లాంటి పవర్ ఫుల్ ట్యూన్స్ కి కేరాఫ్.. మరొకరు భూమ్ బద్దలయ్యే బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కి మారు పేరు. వీళ్ళిద్దరూ కలిస్తే.. కలిసి ఒకే సినిమాకు పని చేస్తే..! చూడాలని ఎవరికుండదు చెప్పండి..? కానీ… అది అంత ఈజీగా అయ్యే పనేనా? అనేది డౌట్. కానీ ఆ ఒక్కడు అనుకుంటే మాత్రం అవ్వుద్దట. ఎవరు ఆ ఒక్కరు? తెలుసుకుందాం ప‌దండి. సీటిమార్ సాంగ్ తో సౌత్ టు నార్త్ జబర్దస్త్ టూరేసి.. ఖాన్ సాబ్ లనే ఫిదా చేసిన దేవిశ్రీ ప్రసాద్.. ఫ్యూచర్లో రెండు భారీ హిందీ సినిమాలకు మ్యూజిక్ ఇవ్వబోతున్నారు. ఇటు.. వకీల్ సాబ్ మూవీకిచ్చిన పవర్ ఫుల్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్… తమన్ రేంజ్ ని కొత్త హైట్స్ లో నిలబెట్టింది. కట్ చేస్తే.. తమన్ అండ్ డీఎస్పీ ఇద్దరూ మహేష్ మూవీ కోసం కలిసి పనిచెయ్యబోతున్నారన్నది ఒక ఇంట్రస్టింగ్ న్యూస్.

ఏడాదిన్నర కిందట సరిలేరు నీకెవ్వరూ, అల వైకుంఠపురములో ఆల్బమ్స్ తో వీళ్లిద్దరి మధ్య ఒకరకమైన యుద్ధమే జరిగింది. కానీ.. ఆ వెంటనే మహేష్ తో తమన్, బన్నీతో దేవి సినిమాలు ఒప్పుకుని… తమకు ప్రొఫెషనల్ రైవల్రి లేదని చాటుకున్నారు. అదే రూట్లో ఇంకాస్త ముందుకెళ్లి ఒకే సినిమాకు ఇద్దరూ కలిసి పని చేస్తే? ఈ రేర్ ఫీట్ గురూజీ త్రివిక్రమ్ చేతుల మీదుగా జరిగితే..? ఇంక చెప్పాల్సింది ఏముంటుంది.

మహేష్-త్రివిక్రమ్ కాంబినేషన్లో వచ్చిన ఖలేజా, అతడు.. రెండూ మ్యూజికల్లీ సూపర్ హిట్సే. కాకపోతే ఆ రెండు సినిమాలకూ ట్యూన్స్ కట్టింది మణిశర్మ. ఇప్పుడు చెయ్యబోయే హ్యాట్రిక్ మూవీ.. సంగీత పరంగా అంతకంటే బెటర్ అనిపించుకోవాలన్నది త్రివిక్రమ్ ప్లాన్. అందుకే డఎస్పీ ప్లస్ తమన్.. ఇద్దరి సర్వీసెస్ తీసుకుని.. పాటల్ని, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ని అదరగొట్టాలని స్కెచ్ వేస్తున్నారట. కానీ.. ఈ మల్టిపుల్ ఎక్స్ పరిమెంట్ రియాలిటీలోకొచ్చేదాకా డౌటే అన్నది మరో వెర్షన్. ఈ నెలాఖరులో రిలీజ్ కాబోయే టైటిల్ పోస్టర్ తోనైనా ఈ కాంబినేషన్ పై క్లారిటీ వస్తుందేమో చూడాలి!

Also Read: కోవిడ్ వ్యాక్సిన్ తీసుకున్న సూపర్ స్టార్ రజనీకాంత్, కరోనా వైరస్ పై పోరులో గెలుద్దామన్న కుమార్తె సౌందర్య

ఇర్ఫాన్ పఠాన్‌ను టార్గెట్ చేసిన బాలీవుడ్ ఫైర్ బ్రాండ్ కంగనా రనౌత్‌.. ఇద్దరి మధ్య సోషల్ మీడియాలో మాటల యుద్ధం..