AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Mahesh Babu: జక్కన్న మాస్టర్ ప్లాన్.. మహేష్ బాబు కోసం రంగంలోకి హాలీవుడ్ నటి

తన నెక్స్ట్ సినిమాను ఆర్ఆర్ఆర్ కంటే భారీగా అదేవిధంగా భారీ బడ్జెట్ తో ప్లాన్ చేస్తున్నాడు. సినిమా ప్రీ ప్రొడక్షన్ కోసం దాదాపు రెండేళ్లుగా వెచ్చిస్తున్నాడు జక్కన్న. సూపర్ స్టార్ మహేష్ బాబు తో రాజమౌళి సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమా కోసం పలువురు విదేశీ టెక్నీషియన్స్‌తో కూడా చర్చించి అగ్రిమెంట్ కూడా చేసుకున్నారు. కేవలం టెక్నీషియన్స్‌నే కాకుండా విదేశాల నుంచి కొంతమంది నటీమణులను కూడా రప్పిస్తున్నాడు రాజమౌళి.

Mahesh Babu: జక్కన్న మాస్టర్ ప్లాన్.. మహేష్ బాబు కోసం రంగంలోకి హాలీవుడ్ నటి
Mahesh Babu
Rajeev Rayala
|

Updated on: Jan 07, 2024 | 5:12 PM

Share

ఆర్ఆర్ఆర్ చిత్రంతో భారీ విజయాన్ని సొంతం చేసుకోవడమే కాదు ప్రపంచవ్యాప్త ఖ్యాతిని సాధించాడు దర్శకుడు రాజమౌళి. బాహుబలి సినిమాతో తెలుగు సినిమా స్థాయిని పెంచిన రాజమౌళి. ఆతర్వాత ఆర్ఆర్ఆర్ సినిమాతో సంచలన విజయం సాధించాడు. ఇప్పుడు తన నెక్స్ట్ సినిమాను ఆర్ఆర్ఆర్ కంటే భారీగా అదేవిధంగా భారీ బడ్జెట్ తో ప్లాన్ చేస్తున్నాడు. సినిమా ప్రీ ప్రొడక్షన్ కోసం దాదాపు రెండేళ్లుగా వెచ్చిస్తున్నాడు జక్కన్న. సూపర్ స్టార్ మహేష్ బాబు తో రాజమౌళి సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమా కోసం పలువురు విదేశీ టెక్నీషియన్స్‌తో కూడా చర్చించి అగ్రిమెంట్ కూడా చేసుకున్నారు. కేవలం టెక్నీషియన్స్‌నే కాకుండా విదేశాల నుంచి కొంతమంది నటీమణులను కూడా రప్పిస్తున్నాడు రాజమౌళి.

మహేష్ బాబు , రాజమౌళి  సినిమాలో హీరోయిన్ ఎవరు అనే క్యూరియాసిటీ మొదటి నుంచీ ఉంది. ఇప్పుడు ఈ క్యూరియాసిటీకి తెర పడింది. మహేష్ బాబు సరసన కథానాయికగా విదేశీ నటిని ఎంపిక చేశారట రాజమౌళి. మహేష్ బాబు సరసన ఇండోనేషియా నటి చెల్సియా ఎలిజబెత్ ఇస్లెన్ కథానాయికగా నటించనుందని టాక్ వినిపిస్తుంది. రాజమౌళికి, చిత్ర బృందానికి ఓకే చెప్పిన ఈ సుందరి ఇప్పటికే సినిమాకు స్క్రీన్ టెస్ట్, లుక్ టెస్ట్ లు కూడా చేసిందని రూమర్స్ వస్తున్నాయి. రాజమౌళి తన సినిమాలో నటీనటులను ఎంపిక చేసేందుకు అమెరికాలోని ఓ కొత్త కాస్టింగ్ ఏజెన్సీ సహాయం తీసుకున్నాడని, దాని ద్వారా చెల్సియా ఇస్లాయిన్‌ని హీరోయిన్‌గా ఎంపిక చేసినట్లు సమాచారం.

చెల్సియా ఎలిజబెత్ ఇస్లెన్ టీవీ సిరీస్ ‘తాయెంగా మేసా గిట్టు’ ద్వారా ప్రజాదరణ పొందింది. ఈ సీరియల్‌లో నటనకు గానూ ఎన్నో అవార్డులు కూడా అందుకుంది. రాజమౌళి ఆర్ఆర్ఆర్ సినిమాలో విదేశీ నటి ఒలివా మోరిస్‌ను తీసుకున్నాడు, ఇప్పుడు మహేష్ సినిమాలో సినిమాలో చెల్సియా ఎలిజబెత్ ఇస్లెన్ను తీసుకున్నాడు. చెల్సియా ఎలిజబెత్ ఇస్లెన్ ఇండోనేషియా అలాగే ఆ ప్రాంతంలోని కొన్ని ఇతర దేశాలలో బాగా ప్రాచుర్యం పొందింది. ఇప్పుడు ఈ అమ్మడు ఎంట్రీతో విదేశాల్లోనూ మహేష్ , రాజమౌళి సినిమా మంచి మార్కెట్ ను క్రియేట్ చేస్తుంది.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.