Tollywood: ఆ టాలీవుడ్ స్టార్ హీరో నా క్లాస్‌మెట్.. ఇద్దరం జాన్ జిగ్రీలం.. కానీ.. టీడీపీ ఎమ్మెల్యే వీడియో వైరల్
ఒకే స్కూల్ లేదా కాలేజీలో కలిసి చదువుకుని మంచి స్నేహితులుగా మారిన సినీ, రాజకీయ ప్రముఖులు చాలా మంది ఉన్నారు. వీరిలో చాలా మంది ఇప్పటికీ తమ స్నేహాన్ని కొనసాగిస్తున్నారు. అలా తాజాగా టీడీపీ నేత, శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బొజ్జల శ్రీధర్ రెడ్డి ఓ టాలీవుడ్ స్టార్ హీరో గురించి ఆసక్తికర కామెంట్స్ చేశారు.

టాలీవుడ్ లో చాలా మంది హీరోలు కలిసి చదువుకున్నారు. వీరిలో ఇప్పటికీ చాలా మంది తమ ఫ్రెండ్ షిప్ ను కంటిన్యూ చేస్తున్నారు. రామ్ చరణ్ – రానా దగ్గుబాటి – శర్వానంద్, మహేష్ బాబు – దళపతి విజయ్, జూనియర్ ఎన్టీఆర్ – మంచు మనోజ్, నాని- యాంకర్ ప్రదీప్.. ఇలా మంది సెలబ్రిటీలు ఒకే స్కూల్ లేదా కాలేజీలో చదువుకున్నారు. వీరితో పాటు ఒకే స్కూల్ లో చదివిన సినీ, రాజకీయ ప్రముఖులు కూడా ఉన్నారు. మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి- అక్కినేని సుమంత్, బాలకృష్ణ – కిరణ్ కుమార్ రెడ్డి తో పాటు ఇంకా చాలా మంది కలసి సినీ, రాజకీయ ప్రముఖులు కూడా కలిసి చదువుకున్నారు. ఈ క్రమంలో టీడీపీ యువ నేత, శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ కూడా ఓ టాలీవుడ్ స్టార్ హీరోతో కలిసి చదువుకున్నాడు. ఈ విషయాన్ని ఆయనే ఓ ఇంటర్వ్యూలో పంచుకున్నాడు. ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారింది.
‘ప్రభాస్ నా క్లాస్ మేట్. అలాగే యువీ క్రియేషన్స్ అధినేత నిర్మాత వంశీ కూడా మా క్లాస్మేట్. హైదరాబాద్ నలందలో మేం ఇంటర్ కలిసే చదువుకున్నాం. నేను మొదట బైపీసీ జాయిన్ అయి మళ్లీ సీయిసీ లోకి వెళ్లాను. అక్కడ ప్రభాస్ కూడా సీయిసీ. అలా ప్రభాస్ తో నా పరిచయం మొదలైంది. ఇప్పుడు ఆయన నేషనల్ కటౌట్. ప్రభాస్ ఎక్కువగా ఎవర్ని కలవడు. ఆయనకు చాలా లిమిటెడ్ ఫ్రెండ్స్ ఉంటారు. చాలా చిన్న సర్కిల్ లో ఉంటాడు. పెద్ద మనసు, మంచి వ్యక్తి. మేం ఫ్రెండ్స్ ఓ రోజు గెస్ట్ హౌస్ లో కూర్చున్నాం. ప్రభాస్ చాలా రకాల ఫుడ్స్ తెప్పించాడు. వాళ్లింట్లో చిల్లి చికెన్ ఫ్రైడ్ రైస్ బాగా చేస్తారు. ఆయన మాత్రం కొంచెమే తింటాడు, మాకు మాత్రం చాలా పెడతాడు. చాలా లవ్లీ పర్సనాలిటీ ఆయన. త్వరలో రిలీజవ్వబోయే ప్రభాస్ ది రాజాసాబ్ సినిమా పెద్ద హిట్ అవ్వాలి’ అని ఆకాంక్షించారు బొజ్జల. ప్రస్తుతం ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో బాగా వైరలవుతోంది.
ప్రభాస్ గురించి బొజ్జల సుధీర్ మాటల్లో .. వీడియో..
ప్రభాస్ గారు నా ఇంటర్ క్లాస్మేట్. హైదరాబాద్లోని ఒకే క్యాంపస్లో కలిసి చదువుకున్నాం.
సినిమాలతో ఆయన నేషనల్ కటౌట్ అయినా, నా దృష్టిలో మాత్రం ఎప్పుడూ తన ఫ్రెండ్స్ కోసం పెద్ద మనసుతో, ప్రేమతో చూసుకునే మంచి మనిషి తన ఫ్రెండ్స్ కోసం రకరకాల ఫుడ్ ఐటమ్స్ ప్రత్యేకంగా చేయించి మరీ తినిపించే… pic.twitter.com/kJhVWTwIbq
— Bojjala Sudhir Reddy (@BojjalaSudhir) December 2, 2025
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.








