Thaman: అదిదా.. తమన్ మ్యూజిక్ అంటే.. దెబ్బకు కిందపడిన స్పికర్స్.. పడి పడి నవ్విన డాకు మహారాజ్ మూవీ టీం..

ఈ ఏడాది సంక్రాంతి పండక్కి నందమూరి బాలకృష్ణ నటించిన డాకు మహారాజ్ సినిమా థియేటర్లలో రిలీజ్ కానున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే భారీ హైప్ నెలకొన్న ఈ మూవీ ప్రమోషన్స్ జోరుగా సాగుతున్నాయి. ఈ క్రమంలోనే తాజాగా ఈ సినిమా ట్రైలర్ రిలీజ్ ఈవెంట్ నిర్వహించింది చిత్రయూనిట్.

Thaman: అదిదా.. తమన్ మ్యూజిక్ అంటే.. దెబ్బకు కిందపడిన స్పికర్స్..  పడి పడి నవ్విన డాకు మహారాజ్ మూవీ టీం..
Balakrishna, Thaman
Follow us
Rajitha Chanti

|

Updated on: Jan 11, 2025 | 8:53 AM

నందమూరి బాలకృష్ణ నటిస్తోన్న లేటేస్ట్ మూవీ డాకు మహారాజ్. డైరెక్టర్ బాబీ కొల్లి దర్శకత్వం వహించిన మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ పై భారీ అంచనాలు ఉన్నాయి. ఇప్పటికే రిలీజ్ అయిన పోస్టర్స్, టీజర్ సినిమాపై ఆసక్తిని కలిగించాయి. ఇందులో శ్రద్ధా శ్రీనాథ్, ప్రగ్యా జైస్వాల్ హీరోయిన్లుగా నటిస్తుండగా.. బాలీవుడ్ బ్యూటీ ఊర్వశీ రౌతేలా స్పెషల్ సాంగ్ చేసింది. సంక్రాంతి పండగ కానుకగా జనవరి 12న ఈ సినిమాను థియేటర్లలో రిలీజ్ చేయనున్నారు. ఈ క్రమంలోనే కొద్ది రోజులుగా డాకు మహారాజ్ సినిమా ప్రమోషన్స్ జోరుగా సాగుతున్నాయి. ఇందులో భాగంగా శుక్రవారం సాయంత్రం ఈ సినిమా ట్రైలర్ రిలీజ్ ఈవెంట్ నిర్వహించింది చిత్రయూనిట్. హైదరాబాద్ లోని ఐటీసీ కోహినూర్ హోటల్ వేదికగా ఈ వేడుక జరిగింది. అయితే ఈ వేడుకలో జరిగిన ఓ ఇన్సిడెంట్ కు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరలవుతుంది.

డాకు మహారాజ్ ట్రైలర్ రిలీజ్ వేడుకలో ‘డాకు..’ సాంగ్ ప్లే చేశారు. అప్పుడు తమన్ సంగీతంలోని బేస్ దెబ్బకు స్పీకర్లు కిందపడ్డాయి. దీంతో వెంటనే అప్రమత్తమైన టీమ్ వాటిని మళ్లీ తీసి ఏరేంజ్ చేయాల్సి వచ్చింది. ఇక తమన్ మ్యూజిక్ దెబ్బకు స్పీకర్లు కిందపడడంతో తమన్ తోపాటు అక్కడున్న డాకు మహారాజ్ మూవీ టీం పడి పడి నవ్వుకున్నారు. ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరలవుతుండగా..బాలయ్య, తమన్ కాంబో అంటే థియేటర్లు దద్దరిల్లాల్సిందే అంటూ కామెంట్స్ చేస్తున్నారు నెటిజన్స్.

ఆ తర్వాత తమన్ మాట్లాడుతూ.. బాలయ్యగారితో సినిమా అంటే స్పీకర్లు కాలతాయి.. బాలకృష్ణ, నాది సినిమా వస్తుందంటే కొత్త స్పీకర్లు రెడీగా పెట్టుకోండి.. అందుకు నేనెమి చేయలేను. నాది వార్నింగ్ కాదు.. సినిమాలో హై ఉండడం వల్ల అటువంటి మ్యూజిక్ ఇస్తాను” అంటూ చెప్పుకొచ్చారు.

ఇది చదవండి :  Tollywood: తస్సాదియ్యా.. గ్లామర్ బ్యూటీలో ఈ టాలెంట్ కూడా ఉందా..? ఎవరో తెలుసా..

Tollywood: 7 సంవత్సరాల్లో 3 పెళ్లిళ్లు చేసుకున్న హీరోయిన్.. ఇప్పటికీ ఒంటరిగానే జీవితం.. ఎవరంటే..

Tollywood: వారెవ్వా.. మెంటలెక్కిస్తోన్న మల్లీశ్వరి చైల్డ్ ఆర్టిస్ట్.. ఎంతగా మారిపోయింది.. ?

Tollywood: ఇండస్ట్రీలోనే అత్యంత ఖరీదైన విడాకులు.. ఆ స్టార్ హీరో భార్యకు ఎంత భరణం ఇచ్చాడంటే..

తమన్ మ్యూజిక్ దెబ్బకు కిందపడిన స్పికర్లు..
తమన్ మ్యూజిక్ దెబ్బకు కిందపడిన స్పికర్లు..
ఉదయాన్నే నానబెట్టిన అంజీర్ తింటే ఏమవుతుందో తెలుసా..? ఈ సమస్యలన్నీ
ఉదయాన్నే నానబెట్టిన అంజీర్ తింటే ఏమవుతుందో తెలుసా..? ఈ సమస్యలన్నీ
కారులో కనిపించింది చూసి కంగుతిన్న పోలీసులు
కారులో కనిపించింది చూసి కంగుతిన్న పోలీసులు
ప్రభాస్ అభిమానులకు బ్యాడ్ న్యూస్.. ది రాజా సాబ్‌ లేటెస్ట్ అప్డేట్
ప్రభాస్ అభిమానులకు బ్యాడ్ న్యూస్.. ది రాజా సాబ్‌ లేటెస్ట్ అప్డేట్
ప్రధాని మోదీ తొలి పాడ్‌కాస్ట్‌లో పంచుకున్న ఆసక్తికర విషయాలు
ప్రధాని మోదీ తొలి పాడ్‌కాస్ట్‌లో పంచుకున్న ఆసక్తికర విషయాలు
ప్రమాణ స్వీకారానికి ముందు ట్రంప్‌కు బిగ్‌ రిలీఫ్‌.. దోషే కానీ..
ప్రమాణ స్వీకారానికి ముందు ట్రంప్‌కు బిగ్‌ రిలీఫ్‌.. దోషే కానీ..
కేవలం 4 గంటల్లోనే పర్సనల్ లోన్.. ప్రభుత్వ ఈ పథకం గురించి తెలుసా?
కేవలం 4 గంటల్లోనే పర్సనల్ లోన్.. ప్రభుత్వ ఈ పథకం గురించి తెలుసా?
అవిసె గింజలతో ఆరోగ్యమే కాదు, రెట్టింపు అందం మీ సొంతం..!ఇలా వాడితే
అవిసె గింజలతో ఆరోగ్యమే కాదు, రెట్టింపు అందం మీ సొంతం..!ఇలా వాడితే
153 కిమీల వేగంతో బౌలింగ్.. రిటైర్మెంట్‌తో షాకిచ్చిన ధోని దోస్త్
153 కిమీల వేగంతో బౌలింగ్.. రిటైర్మెంట్‌తో షాకిచ్చిన ధోని దోస్త్
రాజకీయాల్లోకి రావాలంటే బాగా డబ్బుండాలా? ప్రధాని మోడీ ఆన్సర్ ఇదిగో
రాజకీయాల్లోకి రావాలంటే బాగా డబ్బుండాలా? ప్రధాని మోడీ ఆన్సర్ ఇదిగో