Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Actor Vishal: విశాల్ ఆరోగ్యం పాడైనందుకు నేను సంతోషంగా ఉన్నాను.. సింగర్ సంచలన కామెంట్స్..

కోలీవుడ్ స్టార్ హీరో విశాల్ కొన్ని రోజులుగా వైరల్ ఫీవర్‎తో బాధపడుతున్న సంగతి తెలిసిందే. ఇటీవల జరిగిన మదగజరాజ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్‏లో విశాల్ పరిస్థితిని చూసి ఆందోళనకు గురయ్యారు ఫ్యాన్స్. సరిగ్గా నడవడలేకపోవడం.. మాట్లాడుతున్నప్పుడు విశాల్ వణుకుతుండడంతో తమ హీరోకు ఏమైందంటూ సోషల్ మీడియాలో చర్చ నడుస్తుంది.

Actor Vishal: విశాల్ ఆరోగ్యం పాడైనందుకు నేను సంతోషంగా ఉన్నాను.. సింగర్ సంచలన కామెంట్స్..
Vishal
Follow us
Rajitha Chanti

|

Updated on: Jan 11, 2025 | 9:24 AM

సౌత్ ఇండస్ట్రీలో అత్యధిక ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న హీరోలలో విశాల్ ఒకరు. కేవలం తమిళంలోనే కాకుండా తెలుగులోనూ మంచి క్రేజ్ ఉంది. ఎన్నో సూపర్ హిట్ చిత్రాలతో తనకంటూ మంచి గుర్తింపు తెచ్చుకున్న విశాల్.. కొన్ని రోజులుగా అనాగ్యంతో బాధపడుతున్నారు. ఇటీవల జరిగిన మ‌ద‌గ‌జ రాజా సినిమా వేడుకలో పాల్గొన్న విశాల్ కు సంబంధించిన వీడియో నెట్టింట వైరలవుతుంది. దీంతో అసలు విశాల్ కు ఏమైందంటూ ఆందోళనకు గురయ్యారు అభిమానులు. అనారోగ్యంతో బాధపడుతూ మాట్లాడేందుకు, నడవడానికి కూడా ఇబ్బంది పడుతున్న విశాల్ వీడియో తమిళ సినీ ప్రపంచాన్ని నివ్వెరపరిచింది. సహాయకుడి సహాయంతో వేదికపైకి వచ్చాడు విశాల్. అలాగే సినిమా గురించి మాట్లాడుతున్నప్పుడు చేతులు వణుకుతూ కనిపించాడు. ఇక సరిగ్గా చూసేందుకు సైతం విశాల్ ఎంతో ఇబ్బంది పడ్డారు. దీంతో విశాల్ పరిస్థితి చూసి షాకయ్యారు ఫ్యాన్స్.

విశాల్ వైరల్ ఫీవర్ తో ఇబ్బందిపడుతున్నారని.. కొన్ని రోజులుగా ఆయన అపోలో ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటున్నారని ఆయన పర్సనల్ టీం వెల్లడించింది. ఇప్పుడిప్పుడే విశాల్ కోలుకుంటున్నాడని అపోలో వైద్యులు తెలిపారు. ఈ క్రమంలో వివాదాస్పద గాయని సుచిత్ర విశాల్ ఆరోగ్యంపై చేసిన కామెంట్స్ ఇప్పుడు చర్చనీయాంశమయ్యాయి. విశాల్‌ని చూసి మీరంతా జాలిపడతారు కానీ అతడి ఆరోగ్యం ఇలా ఉండడం చూసి సంతోషంగా ఉన్నట్లు తెలిపింది. ఇప్పటికీ విశాల్ పై తీవ్ర ఆరోపణలు చేస్తుంది.

కొన్నాళ్ల క్రితం విశాల్ తనతో అసభ్యంగా ప్రవర్తించాడని సుచిత్ర కామెంట్స్ చేసింది. తన భర్త కార్తీక్ లేని సమయంలో రాత్రి మద్యం సీసాతో విశాల్ తన గది తలుపు తట్టాడని ఆ వీడియోలో సుచిత్ర చెప్పింది. ‘మీరంతా విశాల్‌పై జాలిపడుతున్నారు. అయితే కొన్నాళ్ల క్రితం జరిగిన విషయం ఒకటి చెబుతాను. ఒకరోజు నా భర్త కార్తీక్ ఇంట్లో లేని సమయంలో నాకు తలుపు తట్టిన చప్పుడు వినిపించింది. తెరిచి చూసేసరికి విశాల్ వైన్ బాటిల్ తో నిలబడి కార్తీక్ కుమార్ ఇంట్లో ఉన్నాడా అని అడిగాడు’ అని చెప్పింది. లోపలికి వెళ్తానని చెప్పినా అందుకు తాను అంగీకరించలేదని చెప్పుకొచ్చింది. ఇప్పుడు విశాల్ అనారోగ్యంతో ఇబ్బందిపడడం చూస్తుంటే తనకు చాలా సంతోషంగా ఉందని తెలిపింది.

సుచిత్ర వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ఆమె తీరుపై సర్వత్రా విమర్శలు వస్తున్నాయి. అనారోగ్యంతో ఉన్న వ్యక్తి గురించి ఈ విధంగా మాట్లాడటం దారుణమని, సుచిత్ర క్షమాపణ చెప్పాలని అభిమానులు డిమాండ్ చేస్తున్నారు. విశాల్ సహచరులు ఆయన త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తున్న తరుణంలో సుచిత్ర ఈ వ్యాఖ్యలు చేయడం గమనార్హం. సుచిత్ర ఇంతకు ముందు చాలా మంది నటీనటులపై ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే.

Vishal, Suchitra

Vishal, Suchitra

ఇది చదవండి :  Tollywood: తస్సాదియ్యా.. గ్లామర్ బ్యూటీలో ఈ టాలెంట్ కూడా ఉందా..? ఎవరో తెలుసా..

Tollywood: 7 సంవత్సరాల్లో 3 పెళ్లిళ్లు చేసుకున్న హీరోయిన్.. ఇప్పటికీ ఒంటరిగానే జీవితం.. ఎవరంటే..

Tollywood: వారెవ్వా.. మెంటలెక్కిస్తోన్న మల్లీశ్వరి చైల్డ్ ఆర్టిస్ట్.. ఎంతగా మారిపోయింది.. ?

Tollywood: ఇండస్ట్రీలోనే అత్యంత ఖరీదైన విడాకులు.. ఆ స్టార్ హీరో భార్యకు ఎంత భరణం ఇచ్చాడంటే..