Tollywood: ఇది స్వచ్ఛమైన హలాల్ మాంసమేనా? హోటల్ సిబ్బందిని విసిగించిన టాలీవుడ్ హీరోయిన్.. వైరల్ వీడియో
గతంలో పలు సినిమాల్లో గ్లామరస్ పాత్రలు పోషించి మెప్పించిందీ అందాల తార. అయితే ఏదో కల వచ్చిందంటూ హఠాత్తుగా సినిమాలకు గుడ్ బై చెప్పేసింది. ఆ తర్వాత ఒక ముస్లిం మత పెద్దను పెళ్లి చేసుకుని దుబాయ్ వెళ్లి అక్కడే స్థిరపడిపోయింది.
ప్రముఖ నటి సనా ఖాన్ సినిమా ఇండస్ట్రీకి గుడ్ బై చెప్పిన తర్వాత కూడా ఆమెకు సంబంధించి పలు వీడియోలు వైరల్ అవుతున్నాయి. ఒకప్పుడు తెలుగుతో పాటు కన్నడ, బాలీవుడ్ చిత్రాల్లో మినీ స్కర్టులు, బికినీలు ధరించి అలరించిన ఆమె నాలుగేళ్ల క్రితం సినిమాలకు గుడ్ బై చెప్పేసింది. పూర్తిగా ఇస్లాం మతంలోకి మారిన సనా ఖాన్ ఇప్పుడు తన ఇద్దరు పిల్లలతో సంతోషకరమైన జీవితాన్ని గడుపుతోంది. ఆమె గుజరాత్‌లోని అంక్లేశ్వర్‌కు చెందిన ముస్లిం మత పెద్ద ముఫ్తీ అనాస్ సయ్యద్‌ను వివాహం చేసుకుంది.అయితే ఈ పెళ్లికి ముందే ఆమె సినిమాల నుంచి తప్పుకోవాలని నిర్ణయించుకుంది. తాజాగా సనా మరో బిడ్డకు జన్మనిచ్చింది. కాగా గతంలో మహిళలు 10 నుంచి 12 మంది పిల్లలను కనాలంటూ ఆమె చేసిన కామెంట్స్ పై తీవ్ర వ్యతిరేకత వచ్చింది. ఇప్పుడు మరోసారి సనా వార్తల్లో నిలిచింది. ఓ హోటల్‌లో భోజనం చేసేందుకు వెళ్లిన నటి వీడియో ఇప్పుడు వైరల్‌గా మారింది. ఈ వీడియోలో, సనా స్వచ్ఛమైన హలాల్ మాంసం కోసం హోటల్ సిబ్బందితో మాట్లాడుతున్నట్లు కనిపిస్తోంది. ఆమె అక్కడున్న సిబ్బందిని, ‘ఇది హలాల్ చేసిన ఆహారమేనా?” అని అ డుగుతుంది. దీనికి సిబ్బంది అవును అని సమాధానం ఇస్తారు.
ఆ తర్వాత కూడా సనా మళ్లీ ‘అల్లా హు అక్బర్ అనే మాంసాన్ని హలాల్ చేశారా’? కొంత మంది అలా చెప్పకుండానే మాంసాన్ని కట్ చేస్తారు. అది స్వచ్ఛమైన హలాల్ కాదు. అందుకే నాకు భయంగా ఉంది. ఈ కారణంగానే నేను శాకాహారం తింటాను’ అంటూ సిబ్బందికి చెబుతుంది. ఈ వీడియో ఇప్పుడు నెట్టింట బాగా వైరలవుతోంది. దీనిని చూసిన చాలామంది నెటిజన్లు సనాపై నెగిటివ్ కామెంట్స్ చేస్తున్నారు. ‘ఆహారం విషయంలో ఇన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నప్పుడు హోటల్ కు రావడమెందుకు? ఇంట్లోనే శుభ్రంగా చేసుకుని తినొచ్చుగా? ఇలా హోటల్ సిబ్బందికి ఇలా క్లాస్ తీసుకోవడం అవసరమా?’ అంటూ కామెంట్స్ చేస్తున్నారు.
వీడియో ఇదిగో..
View this post on Instagram
సనా ఖాన్ బాలీవుడ్‌తో పాటు తమిళం, తెలుగు చిత్రాల్లోనూ నటించింది. ఎన్నో సినిమాలు విజయాలు సాధించినప్పటికీ ఆమె సినిమాలకు వీడ్కోలు పలికింది. తనకు ఒక కల వచ్చిందంటూ సోషల్ మీడియా వేదికగా సినిమాలకు గుడ్ బై చెప్పేసింది. ‘నా పాత జీవితంలో నాకు అన్నీ ఉన్నాయి. డబ్బు, పేరు, కీర్తి, అన్నీ సాధించాను. కానీ నాకు మనశ్శాంతి లేదు. అన్నీ ఉన్నా ఆనందం లేదు. చాలా కష్టంగా, నిరుత్సాహంగా రోజులు గడుస్తున్నాయి. అప్పుడే నాకు ఒక కల వచ్చింది. అందులో మండుతున్న సమాధి వైపు చూస్తున్నాను. సమాధిలో నన్ను నేను చూసుకున్నాను. ఇది నన్ను ఆలోచించేలా చేసింది. అందుకే నేను హిజాబ్ ధరించాలని నిర్ణయించుకున్నాను’ అని సనా చెప్పుకొచ్చింది.
మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి . .