భారతి అనే మహిళను చూసి కన్నీళ్లు పెట్టుకున్న సోనుసూద్..! ఎందుకో మీరే తెలుసుకోండి..?
Sonusood : డాన్స్ దీవానే ఎపిసోడ్ షూట్ కోసం సెట్స్‌ను సందర్శించినప్పుడు నటుడు సోను సూద్ కన్నీళ్లు పెట్టుకున్నారు. ఎందుకంటే తీవ్ర అనారోగ్యంతో
Sonusood : డాన్స్ దీవానే ఎపిసోడ్ షూట్ కోసం సెట్స్‌ను సందర్శించినప్పుడు నటుడు సోను సూద్ కన్నీళ్లు పెట్టుకున్నారు. ఎందుకంటే తీవ్ర అనారోగ్యంతో ఉన్న భారతి అనే మహిళను చికిత్స కోసం నాగ్పూర్ నుంచి హైదరాబాద్కు విమానంలో ఎలా తీసుకువెళ్ళారో అతనికి చూపించారు.
ఆన్‌లైన్‌లో షేర్ చేసిన ప్రోమోలో భారతి కుటుంబ సభ్యులు సోనుకు కృతజ్ఞతలు తెలుపుతూ కనిపించారు. అతడు మా కుబుంబానికి ఓ దేవుడు లాంటి వాడని ఉద్వేగానికి లోనయ్యారు. చేతులెత్తి మొక్కుతూ దండం పెట్టారు. ఆ పరిస్థితిని చూసిన సోను కన్నీళ్లు పెట్టుకున్నారు. వంద కోట్ల సినిమాను పంపిణీ చేయడం కంటే ఆసుపత్రి పడకలు, ఆక్సిజన్ సరఫరా, ప్రాణాలను రక్షించే మందులు అందించడం చాలా పెద్ద బహుమతిగా భావిస్తానన్నారు. కొంతమంది నిరుపేదల ప్రాణాలను కాపాడిన ఆ సంతృప్తి వెలకట్టలేనిదన్నారు. ప్రజలు ఆస్పత్రుల్లో బెడ్స్ కోసం ఎదురుచూస్తున్న తరుణంలో తాను ప్రశాంతంగా ఎలా ఉండగలనని ట్విట్టర్ ద్వారా తెలిపారు.
కోవిడ్ -19 వల్ల తల్లిదండ్రులను కోల్పోయిన పిల్లల సహాయానికి రావాలని సోను ప్రభుత్వం, స్వచ్ఛంద సంస్థలకు విజ్ఞప్తి చేశారు. వారికి ఉచిత విద్యను అందించాలని ఆయన అభ్యర్థించారు. అంతకుముందు సోను మాట్లాడుతూ.. తాను ‘జాతీయ హీరో’గా భావించడం లేదన్నారు. వలసదారులందరు తమ ఇళ్లకు చేరుకోవాలని తాను కోరుకున్నట్లు తెలిపారు. అందుకోసం తనకు చేతనైన సాయం చేశానన్నారు. ప్రతి ఒక్కరూ ఆపదలో ఉన్నవారిని చూసి స్పందించాలని కోరారు. తనను అభినందించడం సులువే కానీ తాను చేసిన పనిని అందరు చేయాలని కోరుతున్నట్లు పేర్కొన్నారు.
View this post on Instagram