Sivakarthikeyan : యాంకర్ నుంచి స్టార్ హీరోగా ఫ్యాన్స్ గుండెల్లో నిలిచిన హీరో.. శివకార్తికేయన్ గురించి ఈ విషయాలు తెలుసా ?..
మెరీనా సినిమాతో హీరోగా తెరంగేట్రం చేసిన ఈ హీరో ఇప్పుడు తమిళ చిత్రపరిశ్రమలో అగ్రగామిగా ఎదిగాడు. తొలినాళ్లలో వాన్ నీచెల్, రజనీ మురుగన్ వంటి కమర్షియల్ హిట్‌లను అందించి అభిమానులను గెలుచుకున్నాడు. అద్భుతమైన నటుడిగానే కాదు.. సూపర్ సింగర్, రచయితగానూ గుర్తింపు తెచ్చుకున్నాడు. ఈ హీరోకు తెలుగులోనూ మంచి ఫాలోయింగ్ ఉంది. గతేడాది ప్రిన్స్ సినిమాతో టాలీవుడ్ ప్రేక్షకులను పలకరించాడు. ఇటీవలే మావీరన్ సినిమాతో సూపర్ హిట్ అందుకున్న శివకార్తికేయన్.. ఇప్పుడు రాజ్ కుమార్ పెరియసామి దర్శకత్వంలో ఎస్కే21 సినిమాలో నటిస్తున్నాడు.

కోలీవుడ్ స్టార్ హీరో శివకార్తికేయన్ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరంలేదు. ఎలాంటి బ్యాగ్రౌండ్ లేకుండా నటుడిగా సినీ పరిశ్రమలోకి అడుగుపెట్టి కోట్లాది అభిమానుల గుండెల్లో స్థానం సంపాదించుకున్నాడు. నటనపై ఆసక్తితో ఇండస్ట్రీలోకి రావాలనుకుంటున్న యువకులకు శివకార్తికేయన్ రోల్ మోడల్. బుల్లితెరపై యాంకర్ గా మొదలుపెట్టిన ప్రయాణం ఇప్పుడు వెండితెరపై పెద్ద నటుడిగా గుర్తింపు తీసుకువచ్చింది. మెరీనా సినిమాతో హీరోగా తెరంగేట్రం చేసిన ఈ హీరో ఇప్పుడు తమిళ చిత్రపరిశ్రమలో అగ్రగామిగా ఎదిగాడు. తొలినాళ్లలో వాన్ నీచెల్, రజనీ మురుగన్ వంటి కమర్షియల్ హిట్‌లను అందించి అభిమానులను గెలుచుకున్నాడు. అద్భుతమైన నటుడిగానే కాదు.. సూపర్ సింగర్, రచయితగానూ గుర్తింపు తెచ్చుకున్నాడు. ఈ హీరోకు తెలుగులోనూ మంచి ఫాలోయింగ్ ఉంది. గతేడాది ప్రిన్స్ సినిమాతో టాలీవుడ్ ప్రేక్షకులను పలకరించాడు. ఇటీవలే మావీరన్ సినిమాతో సూపర్ హిట్ అందుకున్న శివకార్తికేయన్.. ఇప్పుడు రాజ్ కుమార్ పెరియసామి దర్శకత్వంలో ఎస్కే21 సినిమాలో నటిస్తున్నాడు.
ఈ చిత్రానికి అమరన్ అనే టైటిల్ ఫిక్స్ చేసినట్లు శుక్రవారం ప్రకటించింది చిత్రయూనిట్. ఇందులో దేశ సైనికుడిగా కనిపించనున్నారు. ఈరోజు శివకార్తికేయన్ పుట్టినరోజు. ఈ సందర్భంగా అమరన్ టైటిల్ టీజర్ రిలీజ్ చేసింది చిత్రయూనిట్. శివకార్తికేయన్ కు సినీ ప్రముఖులు, అభిమానులు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. ప్రస్తుతం ఒక్కో సినిమాకు శివకార్తికేయన్ రూ. 25 కోట్ల వరకు పారితోషికం తీసుకుంటున్నాడు. ఇప్పటివరకు ఆయన నికర విలువ దాదాపు రూ. 125 కోట్లు. అలాగే అతడికి ఆటోమొబైల్స్ అంటే చాలా ఇష్టం. తన వద్ద ఎన్నో ఖరీదైన కార్లు ఉన్నాయి. అంతే కాకుండా లగ్జరీ హౌస్, షేర్ మార్కెట్, ప్రొడక్షన్ కంపెనీ ఇలా శివకార్తికేయన్ ఆస్తి విలువ 125 కోట్ల వరకు ఉంటుందని అంచనా.
శివకార్తికేయన్ తన మేనమరదలు ఆర్తిని 2010లో వివాహం చేసుకున్నాడు. వీరికి పాప ఆరాధన, బాబు కుగన్ దాస్ ఉన్నారు. చెన్నైలో సొంతంగా ఇల్లు కలిగి ఉన్నాడు. అలాగే ఇటీవల తన సొంత గ్రామం తిరువీజిమిలైలో కొత్త ఇంటిని నిర్మించాడు. ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన 11 ఏళ్లకే రూ. 125 కోట్లు సంపాదించాడు శివకార్తికేయన్. నటుడిగానే కాదు.. సొంతంగా నిర్మాణ సంస్థను కలిగి ఉన్నాడు ఈ హీరో.
View this post on Instagram
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.



