AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Disha Patani: సమంతను రీప్లేస్ చేస్తోన్న బాలీవుడ్ బ్యూటీ.. ఆ స్టార్ హీరో సరసన దిశా పటానీ ?.

పుష్ప సినిమాలో సామ్ చేసిన స్పెషల్ సాంగ్ ఏ రేంజ్ హిట్టయ్యిందో చెప్పక్కర్లేదు. ఊ అంటావా మావ.. ఊహు అంటావా పాటకు సామ్, బన్నీ కలిసి వేసిన స్టెప్పులు సెన్సెషన్ అయ్యాయి. 2021లో విడుదలైన పుష్ప చిత్రం బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. ఈ మూవీ ప్రపంచవ్యాప్తంగా రూ. 365 కోట్లు రాబట్టింది. ఇందులో అల్లు అర్జున్‌, రష్మిక మందన్న, ఫహద్‌ ఫాసిల్‌ ప్రధాన పాత్రలలో నటించారు. ఈ సినిమాలో సామ్ చేసిన స్పెషల్ సాంగ్ మాత్రం మైండ్ బ్లోయింగ్ అనే చెప్పాలి.

Disha Patani: సమంతను రీప్లేస్ చేస్తోన్న బాలీవుడ్ బ్యూటీ.. ఆ స్టార్ హీరో సరసన దిశా పటానీ ?.
Disha Patani
Rajitha Chanti
|

Updated on: Feb 17, 2024 | 10:24 AM

Share

ఖుషి సినిమా తర్వాత చిత్రాలకు దూరంగా ఉంటుంది హీరోయిన్ సమంత. చాలా కాలంగా ఆమె విశ్రాంతి తీసుకుంటుంది. ఇప్పుడిప్పుడే తిరిగి సినిమాల్లోకి రీఎంట్రీ ఇచ్చేందుకు రెడీ అవుతుంది. అయితే ఇప్పటివరకు సామ్ కు సంబంధించి ఎలాంటి ప్రాజెక్ట్ అఫీషియల్ అనౌన్స్మెంట్ మాత్రం రాలేదు. ఇదిలా ఉంటే.. పుష్ప సినిమాలో సామ్ చేసిన స్పెషల్ సాంగ్ ఏ రేంజ్ హిట్టయ్యిందో చెప్పక్కర్లేదు. ఊ అంటావా మావ.. ఊహు అంటావా పాటకు సామ్, బన్నీ కలిసి వేసిన స్టెప్పులు సెన్సెషన్ అయ్యాయి. 2021లో విడుదలైన పుష్ప చిత్రం బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. ఈ మూవీ ప్రపంచవ్యాప్తంగా రూ. 365 కోట్లు రాబట్టింది. ఇందులో అల్లు అర్జున్‌, రష్మిక మందన్న, ఫహద్‌ ఫాసిల్‌ ప్రధాన పాత్రలలో నటించారు. ఈ సినిమాలో సామ్ చేసిన స్పెషల్ సాంగ్ మాత్రం మైండ్ బ్లోయింగ్ అనే చెప్పాలి. మాస్ స్టెప్పులతో థియేటర్లను షేక్ చేశారు. ఈ పాటతో సమంత క్రేజ్ మరింత పెరిగిపోయింది. అప్పట్లో ఈసాంగ్ ఇండస్ట్రీలోనే చర్చనీయాంశంగా మారింది.

ఇక కొన్ని నెలలుగా వినిపిస్తున్న టాక్ ప్రకారం పుష్ప 2 చిత్రంలోనూ స్పెషల్ సాంగ్ ఉంటుందట. అయితే ఈ పాటలో నటించనున్న హీరోయిన్ గురించి నిత్యం ఏదోక అప్డేట్ నెట్టింట చక్కర్లు కొడుతుంది. బాలీవుడ్ బ్యూటీ ఊర్వశి రౌతేలా నుంచి శ్రీలీల వరకు అందరి పేర్లు వినిపించాయి. కానీ ఇప్పటివరకు ఎలాంటి క్లారిటీ రాలేదు. తాజాగా మరో బ్యూటీ పేరు వినిపిస్తుంది. తాజా నివేదికల ప్రకారం ఈ సినిమాలోని స్పెషల్ సాంగ్ లో బాలీవుడ్ బ్యూటీ దిశా పటానీ కనిపించనుందని తెలుస్తోంది. ఈ ముద్దుగుమ్మ బాఘీ 3, భరత్, మలంగ్ వంటి చిత్రాలలో ఆమె గ్లామర్ పాత్రలు, డాన్స్ తో పాపులర్ అయ్యింది. పుష్ప 2 స్పెషల్ సాంగ్ కోసం ఇప్పటికే దిశాను సంప్రదించగా.. ఆమె సైతం ఓకే చెప్పేసిందని తెలుస్తోంది. ఈ ట్రాక్‌ని తన పెప్పీ, ఎనర్జిటిక్ ట్యూన్‌లకు ఫేమస్ అయిన దేవి శ్రీ ప్రసాద్ కంపోజ్ చేయనున్నాడు.

పుష్ప: రూల్ ప్రస్తుతం హైదరాబాద్‌లో చివరి దశ షూటింగ్‌లో ఉంది. ఈ సినిమాను మార్చి చివరినాటికి పూర్తి చేయడానికి మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. ఈ ప్రాజెక్ట్ 2024 సంవత్సరంలో అత్యంత ఆసక్తిగా ఎదురుచూస్తున్న చిత్రాలలో ఒకటి. ఇందులో రష్మిక, ఫహాద్ ఫాజిల్, సునీల్, అనసూయ కీలకపాత్రలలో కనిపించనున్నారు. డైరెక్టర్ సుకుమార్ తెరకెక్కిస్తోన్న ఈ మూవీపై ఇప్పటికే భారీ అంచనాలు ఉన్నాయి.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.