Udit Narayan: అభిమానికి లిప్ కిస్ ఇచ్చిన సింగర్.. నెటిజన్స్ ఆగ్రహం.. ఉదిత్ నారాయణ్ ఏమన్నారంటే..
ఉదిత్ నారాయణ్.. ఇప్పటివరకు సినీ సంగీత ప్రపంచంలో ఎన్నో పాటలు ఆలపించారు. ఇండస్ట్రీలో గాయకుడిగా తనకంటూ మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. కానీ ఇటీవల తన అభిమానులతో ఆయన ప్రవర్తించిన తీరుపై ఇప్పుడు నెట్టింట తీవ్ర దుమారం రేపుతుంది. ఉదిత్ నారాయణ్ తీరుపై నెటిజన్స్ మండిపడుతున్నారు.

ప్రముఖ గాయకుడు ఉదిత్ నారాయణ్ ఇటీవల ఓ షోలో తన అభిమానికి లిప్ కిస్ ఇవ్వడం పై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరలవుతుంది. కొద్ది రోజుల క్రితం ఓ స్టేజ్ పెర్ఫార్మెన్స్ లో ఉదిత్ నారాయణ్ 90’s లో ఫేమస్ అయిన టిప్ టిప్ బార్సా పాటను పాడి అలరించారు. ఈ పాటలో అక్షయ్ కుమార్, రవీనా టాండన్ ఉన్నారు. ఈ పాటను ఉదిత్ నారాయణ్ పాడగానే అభిమానులు సంతోషం వ్యక్తం చేశారు. ఆ తర్వాత ఆయనతో సెల్ఫీ తీసుకోవడానికి మహిళా అభిమానులు వేదిక వద్దకు చేరుకున్నారు. అయితే ఈ క్రమంలోనే ఉదిత్ నారాయణ్ తో ఓ అభిమాని సెల్ఫీ దిగిందేకు ప్రయత్నించింది. అదే సయమంలో ఊహించని విధంగా మహిళా అభిమాని అతడికి కిస్ ఇచ్చాడు. దీంతో ఉదిత్ నారాయణ్ సైతం ఆమెకు లిప్ కిస్ ఇచ్చాడు. ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట క్షణాల్లో వైరలయ్యింది. దీంతో ఉదిత్ నారాయణ్ తీరుపై నెటిజన్స్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
ఈ ఘటన తర్వాత కూడా ఉదిత్ నారాయణ్ అక్కడున్న మహిళా అభిమానులను పిలిచి మరీ ముద్దులు పెట్టారు. ఇక ఇందుకు సంబంధించిన వీడియోస్ నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి. దీంతో ఉదిత్ నారాయణ్ తీరును నెటిజన్స్ ఏకిపారేస్తున్నారు. ఒక మహిళా అభిమానితో ఇలా ప్రవర్తించింది ఉదిత్ నారాయణేనా? పబ్లిక్‌లో ఇంత అసభ్యకరంగా ప్రవర్తిస్తారా అని పలువురు ప్రశ్నించారు.
తాజాగా ఈ ఘటన పై ఉదిత్ నారాయణ సైతం స్పందించాడు. ఈ వివాదంపై ఉదిత్ నారాయణ్ ఓ ఇంగ్లీష్ వెబ్ సైట్ తో మాట్లాడుతూ.. ముద్దు పెట్టే విషయంలో తనకు వేరే ఉద్దేశం లేదన్నారు. అభిమానులపై తనకున్న ప్రేమను తెలియజేసేందుకే అలా చేశానంటూ చెప్పుకొచ్చారు. “అభిమానులకు నేనంటే చాలా ఇష్టం. తమ ఇష్టాన్ని తెలియజేయడానికి చాలా రకాలుగా ప్రయత్నిస్తుంటారు. కొంతమంది షేక్ హ్యాండ్ ఇస్తారు.. మరికొంతమంది ముద్దు పెట్టుకోవాలనుకుంటారు. అది కేవలం ఆత్మీయత, అభిమానం. నేను ఎంతో మర్యాద కలిగిన వ్యక్తిని. సమాజంలో నాకు మంచి పేరు ఉంది. మహిళా అభిమానులతో తప్పుగా ప్రవర్తించే ఉద్దేశం నాకు లేదు. కొందరు కావాలనే దీనిని వివాదం చేస్తున్నారు’ అని అన్నారు.
WTF! what is Udit Narayan doing 😱 pic.twitter.com/Rw0azu72uY
— Abhishek (@vicharabhio) January 31, 2025
ఇది చదవండి : Chala Bagundi Movie: తస్సాదియ్యా.. ఈ హీరోయిన్ ఏంట్రా ఇలా మారిపోయింది.. చాలా బాగుంది బ్యూటీ ఎలా ఉందంటే..
Tollywood: 15 నిమిషాల పాత్రకు రూ.4 కోట్లు తీసుకున్న హీరో.. 55 ఏళ్ల వయసులో తిరిగిన దశ..
Tollywood: 19 ఏళ్ల వయసులోనే డైరెక్టర్ అలాంటి ప్రవర్తన.. డిప్రెషన్లోకి వెళ్లిపోయిన