AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Telugu Indian Idol 2: ఆస్కార్‌ విజేత చంద్రబోస్‌ కలం గెలుచుకున్న సౌజన్య భాగవతుల

ఆస్కార్‌ విజేత సినీగీత రచయిత చంద్రబోస్‌ ప్రత్యేక అతిథిగా తెలుగు ఇండియన్‌ ఐడల్‌2 ఎపిసోడ్‌ చిత్రీకరించారు. టాప్‌ 9 కంటెస్టంట్లతో పాటు ఆ వేదిక మీద చంద్రబోస్‌ని చూసిన జనాల ఉత్సాహానికి అంతే లేదు. 

Telugu Indian Idol 2: ఆస్కార్‌ విజేత చంద్రబోస్‌ కలం గెలుచుకున్న సౌజన్య భాగవతుల
Telugu Indian Idol 2
Rajeev Rayala
|

Updated on: Apr 16, 2023 | 6:44 AM

Share

తెలుగు ఇండియన్‌ ఐడల్‌2తో సంగీత ప్రపంచంలో సరికొత్త జోరు కనిపిస్తోంది. ఆస్కార్‌ విజేత సినీగీత రచయిత చంద్రబోస్‌ ప్రత్యేక అతిథిగా తెలుగు ఇండియన్‌ ఐడల్‌2 ఎపిసోడ్‌ చిత్రీకరించారు. టాప్‌ 9 కంటెస్టంట్లతో పాటు ఆ వేదిక మీద చంద్రబోస్‌ని చూసిన జనాల ఉత్సాహానికి అంతే లేదు. తెలుగు సినీ సంగీతంలో అజరామరమైన కొన్ని గీతాలను పోటీదారులు ఎంపిక చేసుకుని పాడిన తీరుకు ప్రేక్షకులు ఫిదా అయ్యారు. వారిలోని ప్రతిభ, కళ పట్ల వారికున్న ఆసక్తి చూసి అబ్బురపడ్డారు. అందరిలోనూ సౌజన్య భాగవతుల ప్రత్యేక స్థానాన్న ఆక్రమించారు. నాని సినిమాలోని పెదవే పలికిన మాటల్లోనే గీతాన్ని ఆలపించారు సౌజన్య భాగవతుల. ఆ పాటను ఆమె పాడిన తీరుకు ఉప్పొంగిపోయారు ప్రముఖ సినీ గేయరచయిత చంద్రబోస్‌. అద్వితీయమైన గళం అంటూ ప్రశంసించి తన కలాన్ని ఆమెకు బహూకరించారు.

ఆస్కార్‌ అవార్డు అందుకున్న నాటు నాటు గీతాన్ని రాసిన కలం అంటూ ఆ కలం గురించి పరిచయం చేశారు. అనూహ్యమైన ఆ క్షణాలను పదిలపరచుకున్నారు సౌజన్య. న్యాయనిర్ణేతలకు, సహ గాయనీగాయకులకు తన ధన్యవాదాలు చెప్పుకున్నారు. ఆమె మాట్లాడుతూ ”చంద్రబోస్‌గారి నుంచి ఈ కలం అందుకోవడం గర్వంగానూ, గౌరవంగానూ భావిస్తున్నాను. నా చిరకాల స్వప్నం నెరవేరింది. సంగీతంలో మరెన్నో ఎత్తులకు చేరుకోవాలన్న ఆకాంక్ష బలోపేతమైంది. అత్యంత గొప్ప అవకాశం ఇది” అని అన్నారు.

ఎన్నో దశాబ్దాలుగా తనదైన ముద్రతో పాటలు రాస్తూ, తెలుగు సినీ సంగీతంలో తనకంటూ ప్రత్యేక స్థానాన్ని పొందిన చంద్రబోస్‌ మాట్లాడుతూ ”ఆహా తెలుగు ఇండియన్‌ ఐడటల్‌2లో పాల్గొనడం చాలా ఆనందంగా అనిపించింది. అత్యద్భుతమైన ప్రతిభావంతులున్నారు ఇక్కడ. తెలుగు సినీ సంగీతానికి వీరందరూ గొప్ప ఆస్తి. సౌజన్య ప్రతిభ నన్ను అబ్బురపరిచింది. తన స్వరంతో, సంగీతంతో ఆమె మరెన్నో మెరుపులు కురిపిస్తుందనే నమ్మకం ఉంది” అని అన్నారు.

దేశవ్యాప్తంగా ఉన్న సంగీతాభిమానులను ఆహా తెలుగు ఇండియన్‌ ఐడల్‌2 ఉర్రూతలూగిస్తోంది. ప్రతిభావంతులైన ఔత్సాహికులకు ఓ అందమైన వేదికగా మారింది. ప్రేక్షకులకు చక్కటి అనుభూతి కలిగిస్తోంది. పవర్‌ఫుల్‌ పెర్ఫార్మెన్సులు, మనసును హత్తుకునే అంశాలు, అద్వితీయమైన ప్రతిభ ఈ షోని గొప్ప గొప్ప తీరాలకు తీసుకెళ్తోంది.

JEE Main 2026లో టాప్‌ స్కోర్ కావాలా? ఐతే ఈ టాపిక్స్‌ మిస్ కావద్దు
JEE Main 2026లో టాప్‌ స్కోర్ కావాలా? ఐతే ఈ టాపిక్స్‌ మిస్ కావద్దు
ఏందిది ఆది..! ఇదేదో ముందే చేయొచ్చుగా
ఏందిది ఆది..! ఇదేదో ముందే చేయొచ్చుగా
తెలుగు రాష్ట్రాల్లో వాతావరణం ఎలా ఉంటుంది..? వెదర్ రిపోర్ట్ ఇదిగో
తెలుగు రాష్ట్రాల్లో వాతావరణం ఎలా ఉంటుంది..? వెదర్ రిపోర్ట్ ఇదిగో
కవలలు ఇంట్లో నిద్రిస్తుండగా భారీ శబ్ధం.. లోపలికి వెళ్లి చూడగా..
కవలలు ఇంట్లో నిద్రిస్తుండగా భారీ శబ్ధం.. లోపలికి వెళ్లి చూడగా..
ఊహించని బాంబు పేల్చిన ధురంధర్ 2.. వాళ్ల పరిస్థితేంటి..?
ఊహించని బాంబు పేల్చిన ధురంధర్ 2.. వాళ్ల పరిస్థితేంటి..?
భారతీయుల బహిష్కరణలో అమెరికా సెకండ్, టాప్‌లో ఏ దేశం ఉందో తెలుసా?
భారతీయుల బహిష్కరణలో అమెరికా సెకండ్, టాప్‌లో ఏ దేశం ఉందో తెలుసా?
గ్లోబల్ బాక్సాఫీస్ ను టార్గెట్ చేస్తున్న సందీప్ వంగా
గ్లోబల్ బాక్సాఫీస్ ను టార్గెట్ చేస్తున్న సందీప్ వంగా
ఇక జీమెయిల్‌ వాడేవారికి పండగలాంటి వార్త.. అదిరిపోయే గుడ్‌న్యూస్‌!
ఇక జీమెయిల్‌ వాడేవారికి పండగలాంటి వార్త.. అదిరిపోయే గుడ్‌న్యూస్‌!
జీమ్‌కు వెళ్లే ముందు ఈ కొన్ని చిట్కాలు పాటించండి..
జీమ్‌కు వెళ్లే ముందు ఈ కొన్ని చిట్కాలు పాటించండి..
పెళ్లైన 24 గంటలకే విడాకులు.. భర్త చెప్పిన సీక్రెట్‌తో షాకైన వధువు
పెళ్లైన 24 గంటలకే విడాకులు.. భర్త చెప్పిన సీక్రెట్‌తో షాకైన వధువు