Sid Sriram: సింగర్ సిద్ శ్రీరామ్ ఒక్క పాటకు ఎంత రెమ్యునరేషన్ తీసుకుంటాడో తెలుసా..
సింగర్ సిద్ శ్రీరామ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. తన గాత్రంతో ప్రేక్షకులను మైమరపిస్తాడు.. సిద్ శ్రీరామ్ పాటలతో
సింగర్ సిద్ శ్రీరామ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. తన గాత్రంతో ప్రేక్షకులను మైమరపిస్తాడు.. సిద్ శ్రీరామ్ పాటలతో ఎంతో మంది ప్రేక్షకులను మెస్మరైజ్ చేస్తాడు. చిన్న.. పెద్ద సినిమాలలో సిద్ శ్రీరామ్ పాడిన సాంగ్ ఉంటే.. హిట్ కావాల్సిందే అని మేకర్స్ విశ్వసించేవరకు అతడి గాత్రం వెళ్ళింది. తమిళనాడులో జన్మించి అమెరికాలో పెరిగిన శ్రీరామ్ తెలుగులో తనదైన శైలిలో పాటలు పాడుతూ శ్రోతలను మెస్మరైజ్ చేస్తున్నాడు. ‘డియర్ కామ్రేడ్’ సినిమాతో మొదలైన సిద్ తెలుగు పాటల ప్రస్థానం.. పుష్ప వరకు కొనసాగుతూనే ఉంది. మాటే వినదుగా.. సామజవరగమనా నుంచి ఇటీవల వచ్చిన పుష్ప సినిమాలోని శ్రీవల్లి సాంగ్స్ వరకు అన్ని సూపర్ హిట్. అతను పాడిన పాటలు యూట్యూబ్ షేక్ కావాల్సిందే. దక్షిణాది ఫిల్మ్ ఇండస్ట్రీలలో ఉన్న టాప్ మోస్ట్ సింగర్స్లలో ఒకరిగా దూసుకుపోతున్నాడు సిద్ శ్రీరామ్.
ఇదిలా ఉంటే.. ఇప్పుడు టాలీవుడ్ చిత్రపరిశ్రమలో సిద్ శ్రీరామ్ పాటల హవా కొనసాగుతుంది. అయితే సిద్ శ్రీరామ్ ఒక్కపాటకు తీసుకునే రెమ్యునరేషన్ విషయం ఇప్పుడు సినీ సర్కిల్లో హాట్ టాపిక్‌గా మారింది. సిద్ శ్రీరామ్ ఒక్కపాటకు రూ. 5 లక్షల నుంచి రూ. 7 లక్షల వరకు తీసుకుంటారని టాక్. నిజానికి ఇంత పెద్ద మొత్తంలో సింగర్స్ రెమ్యునరేషన్ తీసుకోవడం చాలా అరుదు. ప్రస్తుతం సిద్ శ్రీరామ్ కు ఉన్న క్రేజ్… అతను పాట పాడితే రెస్పాన్స్ ఎలా ఉంటుందనేది తెలిసి మేకర్స్ సైతం అంత మొత్తంలో రెమ్యునరేషన్ ఇవ్వడానికి రెడీగా ఉన్నారట.
Also Read: BhamaKalapam Teaser: బాబోయ్ ఈ భామ చాలా డేంజర్ సుమా..! ఆసక్తికరంగా భామా కలాపం టీజర్..
Shruti Haasan: ప్రభాస్ అందరూ అనుకునేలా కాదు.. ఆసక్తికర కామెంట్స్ చేసిన అందాల శ్రుతిహాసన్..
Sreeleela : క్రేజ్ పెరిగింది రెమ్యునరేషన్ కూడా పెంచేసింది.. భారీగా డిమాండ్ చేస్తుందట శ్రీలీల..
Raashi Khanna: టాలీవుడ్ అలా బాలీవుడ్ మాత్రం ఇలా.. ఆసక్తికర కామెంట్స్ చేసిన బ్యూటీ..