AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

పవన్ కల్యాణ్, సింగీతం కాంబోలో ఘనంగా ప్రారంభమైన ‘జీసస్ క్రైస్ట్’ బయోపిక్.. మధ్యలోనే ఎందుకు ఆగిపోయిందో తెలుసా?

తెలుగులోనే కాదు యావత్ ఇండియన్ సినిమా ఇండస్ట్రీ హిస్టరీలోని గొప్ప దర్శకుల జాబితాల్లో సింగీతం శ్రీనివాస రావు గారి పేరు ఖచ్చితంగా ఉంటుంది. ప్రేక్షకుల ఊహకు కూడా అందని కాన్సెప్ట్‌లతో సినిమాలు తీసి ది లెజండరీ దర్శకుడిగా తిరుగులేని క్రేజ్ సంపాదించుకున్నారు సింగీతం శ్రీనివాస రావు గారు.

పవన్ కల్యాణ్, సింగీతం కాంబోలో ఘనంగా ప్రారంభమైన 'జీసస్ క్రైస్ట్' బయోపిక్.. మధ్యలోనే ఎందుకు ఆగిపోయిందో తెలుసా?
Singeetam Srinivasa Rao, Pawan Kayan
Basha Shek
|

Updated on: Oct 04, 2026 | 1:26 PM

Share

కమర్షియల్ కథలు, హంగులకు దూరంగా ప్రేక్షకుల ఊహలకు అందని కాన్సెప్టులతో సినిమాలు తీశారు సింగీతం శ్రీనివాసరావు. తెలుగుతోపాటు కన్నడ , తమిళం , హిందీ, ఇంగ్లిష్‌తో సహా పలు భాషలలో సుమారు 60 పైగా చిత్రాలకు దర్శకత్వం వహించారు సింగీతం. సినిమా దర్శకత్వంతోపాటు స్క్రీన్ ప్లే, నిర్మాణం, సంగీతం, నటన.. తదితర రంగాల్లోనూ సింగీతం తన ట్యాలెంట్ చూపించారు. ‘పుష్పక విమానం’, ‘ఆదిత్య 369’, ఇంకా ‘భైరవ ద్వీపం’, ‘మయూరి’, ‘మైఖేల్ మదన కామరాజు’, ‘అపూర్వ సహోదరులు’.. ఇలా సింగీతం కెరీర్ లో ప్రతి సినిమా ఒక ఆణిముత్యమే. చివరకు 95ఏళ్ల వయసులోనూ ‘సింగ్ గీతం’ (2026) అనే మ్యూజిక్ ఫాంటసీ సినిమాను ఆడియెన్స్ కు అందించిన సింగీతం ఇవాళ (అక్టోబర్ 04)న కన్నుమూశారు. ఈ నేపథ్యంలో పలువురు సినీ ప్రముఖులు, సినీ అభిమానులు ఈ లెజెండరీ డైరెక్టర్ కు అశ్రు నివాళి సమర్పిస్తున్నారు. ఇదిలా ఉంటే తెలుగు సినిమా స్థాయిని పెంచిన సింగీతం శ్రీనివాసరావు పవర్ స్టార్ పవన్ కల్యాణ్ తో ఓ సినిమా చేయాలనుకున్నారు. కానీ అది కార్య రూపం దాల్చలేదు. గ్రాండ్ గా ప్రారంభమైన ఈ క్రేజీ ప్రాజెక్టు వివిధ కారణాలతో మధ్యలోనే ఆగిపోయింది.

జీసస్ క్రైస్ట్ జీవిత కథ ఆధారంగా ఓ ఇంటర్నేషనల్ సినిమాను తెరకెక్కించాలనుకున్నారు సింగీతం. ఏసుక్రీస్తు జీవితం, ఆయన చేసిన గొప్ప పనులు, సమాజానికి అందించిన సందేశాలను నేటి తరానికి చెప్పాలని ఒక మంచి కథను రెడీ చేసుకున్నారు. ఇందులో పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ను కథానాయకుడిగా తీసుకున్నారు. పవన్ ది జీసస్ పాత్ర కాదని, కానీ కథను మలుపు తిప్పే ఒక పవర్ ఫుల్ రోల్ అని అని సింగీతం చెప్పుకొచ్చారు. అలాగే అనుష్కను హీరోయిన్ గా ఎంపిక చేశారు. 2010 లో ‘ప్రిన్స్ ఆఫ్ పీస్’ పేరుతో ఈ క్రేజీ ప్రాజెక్టును అధికారికంగా ప్రకటించారు. విజయేంద్ర వర్మ, శ్రీ రామదాసు వంటి సినిమాలు నిర్మించిన కొండా కృష్ణంరాజు ఈ సినిమాకు నిర్మించేందుకు ముందుకొచ్చారు.

ఇవి కూడా చదవండి

ప్రిన్స్ ఆఫ్ పీస్’ సినిమాను కేవలం తెలుగులోనే కాకుండా హిందీ, తమిళం, మలయాళం వంటి భాషలతో పాటు ఇంగ్లిష్ లోనూ ఒక ఇంటర్నేషనల్ ప్రాజెక్టుగా రూపొందించాలని సింగీతం ప్లాన్ చేశారు. ఇందుకోసం పవన్ కళ్యాణ్, సింగీతం, నిర్మాత కొండా కృష్ణంరాజులతో కూడిన చిత్ర బృందం ఇజ్రాయెల్, జెరూసలేం, జోర్డాన్, బెత్లహేం వంటి చారిత్రక ప్రదేశాలను సందర్శించారు. యేసు క్రీస్తు నడయాడిన ఆయా ప్రాంతాలను ప్రత్యక్షంగా చూసి, సినిమాను అత్యంత సహజంగా ఒక విజువల్ వండర్‌గా తెరకెక్కించాలనుకున్నారు. ఇక ప్రీ ప్రొడక్షన్ పనులు పూర్తయి పోయి రెగ్యులర్ షూటింగ్ ప్రారంభమవుతుందనున్న తరుణంలో ఈ క్రేజీ ప్రాజెక్టుకు అనూహ్యంగా బ్రేకులు పడ్డాయి. సెట్స్ పైకి వెళ్లకుండానే అర్ధాంతంగా ‘ప్రిన్స్ ఆఫ్ పీస్’ ఆగిపోయింది. దీనికి ప్రధాన కారణం బడ్జెట్. మొదట ఈ సినిమాకు అనుకున్న బడ్జెట్ కంటే ఇంటర్నేషనల్ లొకేషన్లు, విజువల్స్, రెమ్యునరేషన్ల కోసం అంచనా వేసిన నిర్మాణ వ్యయం భారీగా పెరిగిపోయింది. దీంతో నిర్మాతలు వెనక్కు తగ్గారు. మరోవైపు కథ, స్క్రిప్ట్ సిద్ధం చేయడానికి కూడా రెండేళ్లకు పైగా సమయం పట్టింది. ఈలోగా పవన్ కల్యాణ్ ఇతర సినిమాలతో బిజీ అయిపోయారు. దీంతో జీసస్ క్రైస్ట్ బయోపిక్ సెట్స్‌పైకి వెళ్లకుండానే ఆగిపోయింది. ఒక వేళ పవన్ కల్యాణ్, సింగీతం శ్రీనివాసరావు కాంబినేషన్‌లో ఈ సినిమా వచ్చివుంటే టాలీవుడ్‌లో ఓ ప్రత్యేకమైన సినిమాగా నిలిచేదన్న అభిప్రాయం ఇప్పటికీ ఉంది.

సింగీతంకు పవన్ కన్నీటి నివాళి..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us