AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

సైఫ్ , కరీనా పెళ్లిలో వెయిటర్‌గా పనిచేసి.. ఇప్పుడు క్రేజీ హీరో.. ఒక్క సినిమాతో మారిన జీవితం..

ఒకప్పుడు జీవనం కోసం హోటళ్లలో వెయిటర్‌గా, కిచెన్ హెల్ప్‌గా పనిచేసిన ఆసిఫ్ ఖాన్.. స్టార్ హీరోల వివాహ వేడుకల్లో సేవలు అందించి కష్టాలు ఎదుర్కొన్నారు. కానీ పట్టుదలను వీడకుండా నటనపై ఉన్న మక్కువతో ముంబైలో అడుగుపెట్టి, 'పంచాయత్' వంటి వెబ్ సిరీస్‌లతో ఓటీటీ స్టార్‌గా ఎదిగిన ఆయన ప్రయాణం ఎంతో స్ఫూర్తిదాయకం.

సైఫ్ , కరీనా పెళ్లిలో వెయిటర్‌గా పనిచేసి.. ఇప్పుడు క్రేజీ హీరో.. ఒక్క సినిమాతో మారిన జీవితం..
Asif Khan
Rajitha Chanti
|

Updated on: Oct 24, 2026 | 8:42 PM

Share

సినీ పరిశ్రమలో హీరో కావాలని లక్షలాది మంది ముంబై నగరానికి వస్తుంటారు. అయితే ఎటువంటి సినీ బ్యాక్‌గ్రౌండ్ లేకుండా, కేవలం అంతులేని కష్టాన్ని నమ్ముకుని పరిశ్రమలో అడుగుపెట్టే వారి ప్రయాణం ఎంతో స్ఫూర్తిదాయకంగా ఉంటుంది. బాలీవుడ్‌లో ఇప్పుడు నటుడిగా గుర్తింపు తెచ్చుకున్న ఆసిఫ్ ఖాన్ జీవితం కూడా సరిగ్గా అలాంటి కోవకే చెందుతుంది. ఒకప్పుడు జీవనం కోసం హోటళ్లలో వెయిటర్‌గా, కిచెన్ హెల్ప్‌గా పనిచేసిన ఆయన.. బాలీవుడ్ స్టార్ హీరో సైఫ్ అలీ ఖాన్ , కరీనా కపూర్ ఖాన్ వివాహ వేడుకలోనూ వెయిటర్ పనులు చేశారు. కాలక్రమేణా తన కష్టంతో ఓటీటీ స్టార్‌గా ఎదిగిన ఆసిఫ్ ఖాన్ సక్సెస్ జర్నీ ప్రస్తుతం సినీ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. ఆసిఫ్ ఖాన్ తండ్రి మరణం తరువాత కుటుంబ బాధ్యతలు ఆయనపై పడ్డాయి. కుటుంబాన్ని పోషించడానికి ఆయన ఎన్నో చిన్నచిన్న పనులు చేశారు. అప్పట్లో సినిమాలపై ఉన్న మక్కువతో ముంబైకి చేరుకున్న ఆయనకు రోజువారీ ఖర్చుల కోసం డబ్బులు అవసరమయ్యాయి. ఈ క్రమంలోనే ఒక హోటల్‌లో వెయిటర్‌గా, ఆ తర్వాత కిచెన్ డిపార్ట్‌మెంట్‌లో పని చేయడం ప్రారంభించారు. సరిగ్గా అదే సమయంలో బాలీవుడ్ ప్రముఖులు సైఫ్ అలీ ఖాన్ – కరీనా కపూర్ వివాహ రిసెప్షన్ వేడుక జరగగా, ఆ హోటల్‌లో కిచెన్ హెల్ప్‌గా ఉన్న ఆసిఫ్ ఖాన్ ఆ పార్టీకి వచ్చిన అతిథులకు సేవలు అందించే పనుల్లో పాల్గొన్నారు. ఆ రోజుల్లో తాను పడిన కష్టాన్ని ఆయన ఓ ఇంటర్వ్యూలో ఎంతో భావోద్వేగంతో గుర్తు చేసుకున్నారు.

ఆ తర్వాత ఆ ఉద్యోగాన్ని వదిలేసి మాల్‌లో పని చేస్తూనే, నటనపై ఉన్న ఆసక్తితో జైపూర్‌లోని కొన్ని థియేటర్ గ్రూప్‌లలో చేరారు. మొదట క్యాస్టింగ్ అసిస్టెంట్‌గా కెరీర్ ప్రారంభించిన ఆయన, సల్మాన్ ఖాన్ ‘రెడీ’, హృతిక్ రోషన్ ‘అగ్నిపథ్’ చిత్రాలలో జూనియర్ ఆర్టిస్టుగా చిన్నపాటి వేషాలు వేశారు. అక్షయ్ కుమార్ నటించిన ‘టాయిలెట్: ఏ ప్రేమ్ కథ’ చిత్రంలో చిన్న కేమియో రోల్ చేసిన ఆయన, అర్జున్ కపూర్ ‘ఇండియాస్ మోస్ట్ వాంటెడ్’ సినిమాతో బాలీవుడ్‌లో పూర్తి స్థాయి నటుడిగా అడుగుపెట్టారు. సినిమాలలో చిన్న పాత్రలతో కెరీర్ నెట్టుకొస్తున్న ఆసిఫ్ ఖాన్‌కు ఓటీటీ రంగం నిజమైన బ్రేక్ ఇచ్చింది. 2018లో వచ్చిన సంచలన వెబ్ సిరీస్ ‘మీర్జాపూర్’ లో బాబర్ పాత్రతో ఆయనకు మంచి గుర్తింపు లచించింది. ఆ తర్వాత ‘జంతారా’ సిరీస్‌తో మరింత పాపులారిటీ సంపాదించుకున్నారు. అయితే ఆయన కెరీర్‌ను మలుపు తిప్పింది మాత్రం ప్రముఖ వెబ్ సిరీస్ ‘పంచాయత్’. ఈ సిరీస్‌లో గణేష్ పాత్రలో ఆయన నటన ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది. అందులో ఆయన పలికిన డైలాగ్స్ సోషల్ మీడియాలో మీమ్ మెటీరియల్‌గా మారి ఆయనను ఓవర్ నైట్ స్టార్‌ను చేశాయి.

ఒకప్పుడు స్టార్ హీరోల రిసెప్షన్‌లో వెయిటర్‌గా పనిచేసిన వ్యక్తి, నేడు అదే చిత్ర పరిశ్రమలో నటుడిగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకోవడం ఎంతోమందికి స్ఫూర్తినిస్తోంది. ప్రస్తుతం వరుస సినిమాల్లో నటిస్తూ బిజీగా ఉన్న ఆసిఫ్ ఖాన్ కష్టపడితే ఏ రంగంలోనైనా విజయం సాధించవచ్చు అని నిరూపించి చూపించారు.

ఎక్కువ మంది చదివినవి : ముఠా మేస్త్రీ షూటింగ్ 3 నెలలు ఆగిపోయింది.. అప్పుడు చిరంజీవి చెప్పిన మాటకు ఆశ్చర్యపోయా.. బాబూ మోహన్..

ఆసీఫ్ ఖాన్..

ఎక్కువ మంది చదివినవి : Balakrishna: బాలకృష్ణకు లవర్‌గా, భార్యగా, బామ్మగా నటించిన ఏకైక హీరోయిన్.. ఇప్పటికీ తగ్గని క్రేజ్..

Follow Us
సైఫ్ , కరీనా పెళ్లిలో వెయిటర్‌గా పనిచేసి..ఇప్పుడు క్రేజీ హీరో.
సైఫ్ , కరీనా పెళ్లిలో వెయిటర్‌గా పనిచేసి..ఇప్పుడు క్రేజీ హీరో.
అడవి బిడ్డల భవిష్యత్తుకు బాటలు.. కూతురికి జీవితాంతం గుర్తుండే..
అడవి బిడ్డల భవిష్యత్తుకు బాటలు.. కూతురికి జీవితాంతం గుర్తుండే..
        వాషింగ్ మెషిన్ నుంచి చెడు వాసనా? ఈ సింపుల్ చిట్కా తెలుసా?
        వాషింగ్ మెషిన్ నుంచి చెడు వాసనా? ఈ సింపుల్ చిట్కా తెలుసా?
బిర్యానీ ఆకులు కొనాల్సిన పనిలేదు.. బాల్కనీలోనే ఇలా పెంచేయండి
బిర్యానీ ఆకులు కొనాల్సిన పనిలేదు.. బాల్కనీలోనే ఇలా పెంచేయండి
పచ్చిమిర్చి కోసి కళ్లను తాకారా? వెంటనే ఇలా చేస్తే ముఖం మంటరాదు!
పచ్చిమిర్చి కోసి కళ్లను తాకారా? వెంటనే ఇలా చేస్తే ముఖం మంటరాదు!
ఇంట్లోనే జీలకర్ర మొక్కను ఎలా పెంచాలి..? ఈ సింపుల్ ట్రిక్స్..
ఇంట్లోనే జీలకర్ర మొక్కను ఎలా పెంచాలి..? ఈ సింపుల్ ట్రిక్స్..
2 నెలలు నిల్వ ఉండేలా వంకాయ పచ్చడి.. 
2 నెలలు నిల్వ ఉండేలా వంకాయ పచ్చడి.. 
రొటీన్ బ్రేక్‌ఫాస్ట్ తింటున్నారా? ఈ కొబ్బరి పాల అన్నం ట్రై చేయండి
రొటీన్ బ్రేక్‌ఫాస్ట్ తింటున్నారా? ఈ కొబ్బరి పాల అన్నం ట్రై చేయండి
ట్రంప్ అల్లుడి ఫోన్ హ్యాక్.. సౌదీ నేతలతో రహస్య ఒప్పందాలు?
ట్రంప్ అల్లుడి ఫోన్ హ్యాక్.. సౌదీ నేతలతో రహస్య ఒప్పందాలు?
10 నిమిషాల్లో కుక్కర్‌లో కమ్మనైన ఉప్పుడు పిండి..
10 నిమిషాల్లో కుక్కర్‌లో కమ్మనైన ఉప్పుడు పిండి..