AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Trending Song : కృష్ణ, సౌందర్య కాంబోలో సూపర్ హిట్ సాంగ్.. 32 ఏళ్లైనా తగ్గని క్రేజ్.. ఇప్పటికీ యూట్యూబ్‏లో ట్రెండింగ్..

సూపర్‌స్టార్ కృష్ణ , అభినయ నటి సౌందర్య కాంబినేషన్‌లో వచ్చిన సినిమా అప్పట్లో బ్లాక్ బాస్టర్ హిట్ అయ్యింది. ఈ మూవీ వచ్చి 32 ఏళ్లయినా నేటికీ చెక్కుచెదరని క్రేజ్‌ సొంతం చేసుకుంది. అయితే ఈ సినిమాలోని నాటి మధురమైన జ్ఞాపకాలను గుర్తుచేసే ఈ క్లాసిక్ మెలోడీ, యూట్యూబ్‌లో ఏకంగా మిలియన్ల వ్యూస్‌తో నేటికీ డిజిటల్ ప్లాట్‌ఫామ్‌లపై ట్రెండింగ్‌లో నిలుస్తోంది.

Trending Song : కృష్ణ, సౌందర్య కాంబోలో సూపర్ హిట్ సాంగ్.. 32 ఏళ్లైనా తగ్గని క్రేజ్.. ఇప్పటికీ యూట్యూబ్‏లో ట్రెండింగ్..
Kolo Koloyamma Song
Rajitha Chanti
|

Updated on: Oct 24, 2026 | 9:19 PM

Share

టాలీవుడ్ చలనచిత్ర పరిశ్రమలో సూపర్ స్టార్ ఘట్టమనేని కృష్ణ క్రేజ్ గురించి చెప్పక్కర్లేదు. ఎంతో మంది హీరోయిన్లతో సూపర్ హిట్ చిత్రాలతో మెప్పించారు. అయితే అభినయ నటి సౌందర్యతో కృష్ణ కాంబినేషన్‌కు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. వీరిద్దరి జోడీ తెరపై కనిపిస్తే ఆ చరిష్మానే వేరుగా ఉంటుంది. ఆ కాలంలో అనేక సంచలన విజయాలను సాధించిన ఈ కాంబోకు సంబంధించిన పాటలు నేటికీ సంగీత ప్రియులను అలరిస్తూనే ఉన్నాయి. ముఖ్యంగా వీరు నటించిన నంబర్ వన్ సినిమాలోని ‘కోలు కోలు కొయిలమ్మ…’ పాట గురించి తెలిసిందే. ఈ పాట అప్పట్లో బాక్సాఫీస్ షేక్ చేసింది. దశాబ్దాలు గడుస్తున్నా క్రేజ్ మాత్రం అస్సలు తగ్గలేదు. యూట్యూబ్‌లో ఈ వీడియో సాంగ్ ఏకంగా మిలియన్ల కొద్ది వ్యూస్‌ను సొంతం చేసుకుంటూ ట్రెండింగ్‌లో నిలుస్తోంది.

కాలం ఎంత మారినా కొన్ని మాధుర్యమైన పాటలు ఎప్పటికీ పాతబడవు. అలాంటి కోవకు చెందే ఈ అద్భుతమైన గీతం నాటి ట్రెండ్‌కు తగినట్లుగా ఎంతో చక్కటి సంగీతంతో సాగుతుంది. సినిమాలో కృష్ణ గారి స్టైలిష్ మేనరిజం, సౌందర్య గారి అంతులేని అందం, వారిద్దరి మధ్య కెమిస్ట్రీ ఈ పాటకు ప్రధాన ఆకర్షణగా నిలిచాయి. పాటలో వచ్చే సాహిత్యం, నృత్య రీతులు ప్రేక్షకులను ఇట్టే కట్టిపడేస్తాయి. ఇప్పటికీ యూట్యూబ్ వేదికగా ఈ పాటను కోట్లాది మంది చూస్తుండడం విశేషం.

తెలుగు సినిమా స్వర్ణయుగపు జ్ఞాపకాలను నెమరువేసుకునేలా ఉన్న ఈ పాట, నేటితరానికి కూడా ఆనాటి క్లాసిక్ సినిమాల గొప్పతనాన్ని గుర్తు చేస్తోంది. ఎంత కాలం గడిచినా, ఎన్ని కొత్త పాటలు వచ్చినా లెజెండరీ నటుల కాంబోలో వచ్చిన ఇలాంటి మధురమైన గీతాలకు ఉండే ప్రత్యేకతే వేరు అని చెప్పడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. ఈ పాటను మీరు ఒక్కసారి వినేయండి.

ఎక్కువ మంది చదివినవి : Cinema : గరివిడి లక్ష్మి పాత్రను మిస్ చేసుకున్న మరో హీరోయిన్.. నిత్యా మీనన్‏తోపాటు ఆ క్రేజీ బ్యూటీ కూడా..

కోలో కోలో కోయిలమ్మ సాంగ్..

ఎక్కువ మంది చదివినవి : Idupu Kayitham: ఇడుపు కాయితం నుంచి గడప సాంగ్ రిలీజ్.. ప్రతి అమ్మాయి హృదయాలను హత్తుకునే పాట..

Follow Us