AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Upasana : అలాంటి మహిళలకు ఇదే నా వార్నింగ్.. ఆ ప్రవర్తన సరికాదు.. రామ్ చరణ్ సతీమణి ఉపాసన హెచ్చరిక..

ఉపాసన కొణిదెల ఫెస్టివల్స్ ఫర్ జాయ్ 5వ వార్షికోత్సవంలో చేసిన కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరలవుతున్నాయి. యాంకర్ సుమ కనకాల కృషిని ప్రశంసిస్తూ, మహిళలు ఒకరికొకరు మద్దతుగా నిలవాలని, ఒకరి బాధ మరొకరి విజయం కాకూడదని అన్నారు. సానుకూల దృక్పథంతో, కలిసి ఎదగాల్సిన ఆవశ్యకతను తెలిపారు. అలాగే ఇది మహిళా సాధికారతకు ఆమె నిబద్ధతను ప్రతిబింబిస్తుంది.

Upasana : అలాంటి మహిళలకు ఇదే నా వార్నింగ్.. ఆ ప్రవర్తన సరికాదు.. రామ్ చరణ్ సతీమణి ఉపాసన హెచ్చరిక..
Upasana
Rajitha Chanti
|

Updated on: Oct 24, 2026 | 8:58 PM

Share

యాంకర్ సుమ కనకాల ఆధ్వర్యంలో ఘనంగా జరిగిన ఫెస్టివల్స్ ఫర్ జాయ్ 5వ వార్షికోత్సవ వేడుకలు మహిళా సాధికారత, ఐక్యతకు వేదికగా నిలిచాయి. ఈ కార్యక్రమంలో అపోలో హాస్పిటల్స్ వైస్ చైర్మన్ ఉపాసన కొణిదెల ముఖ్య అతిథిగా హాజరై, స్ఫూర్తిదాయకమైన కామెంట్స్ చేశారు. వైజాగ్‌ నుండి వచ్చిన హైమ గారు ఉపాసనకు ప్రత్యేకమైన ఖాదీ చీరను బహుకరించడంతో కార్యక్రమం ప్రారంభమైంది. ఉపాసన తన ప్రసంగాన్ని ప్రారంభించకముందు, కార్యక్రమ నిర్వాహకురాలు సుమ కనకాలకు కృతజ్ఞతలు తెలుపుతూ, “ఐయామ్ స్టక్ ఇన్ ఎక్సలెన్స్” అని సుమ అన్న మాటలను గుర్తు చేసుకున్నారు. సుమ కనకాల శక్తివంతమైన, ఆత్మవిశ్వాసం కలిగిన, విజయవంతమైన మహిళ అని ప్రశంసించారు. “ఆమెలో ఆత్మవిశ్వాసం ఆమె నుండే వచ్చింది, మనమంతా ఆమె నుండి స్ఫూర్తి పొందుతాము” అని ఉపాసన పేర్కొన్నారు. అనేక ఆడియో ఫంక్షన్లలో సుమ షోను ఎంత సమర్థవంతంగా నడిపిస్తారో, ఆమె ఎంత మంది హృదయ స్పందనలను ఎంత సునాయాసంగా నిర్వహిస్తారో ఆమె వివరించారు.

ఎక్కువ మంది చదివినవి : ముఠా మేస్త్రీ షూటింగ్ 3 నెలలు ఆగిపోయింది.. అప్పుడు చిరంజీవి చెప్పిన మాటకు ఆశ్చర్యపోయా.. బాబూ మోహన్..

అనంతరం, ఉపాసన తన కీలక సందేశాన్ని అందించారు. సమాజంలో మహిళలు ఎదుర్కొంటున్న ఒక లోతైన సమస్యను ఆమె ప్రస్తావించారు. కొందరు మహిళలు తమ సొంత విజయాల కోసం, లేదా బలహీనమైన పురుషుడిని ప్రసన్నం చేసుకోవడం కోసం ఇతర మహిళలను తొక్కేస్తున్నారని ఆమె హెచ్చరించారు. ఈ ప్రవర్తన సరికాదని, “ఒక మహిళ నొప్పి మరొక మహిళ విజయం కాకూడదు” అని అన్నారు.

ఎక్కువ మంది చదివినవి : Cinema : గరివిడి లక్ష్మి పాత్రను మిస్ చేసుకున్న మరో హీరోయిన్.. నిత్యా మీనన్‏తోపాటు ఆ క్రేజీ బ్యూటీ కూడా..

మహిళలందరూ కలిసికట్టుగా ఉండాలని, ఒకరికొకరు మద్దతునిచ్చుకుంటేనే పురోగమించగలరని ఉపాసన పిలుపునిచ్చారు. “మనం కలిసి ఎదగాలంటే, మనం కలిసి ఉండాలి, మన ఆలోచన విధానం మారాలి” అని ఆమె స్పష్టం చేశారు. స్వార్థం లేకుండా మహిళలను ప్రోత్సహించే వారితోనే తాను నిరంతరం ఉంటానని, అన్యాయం చేసిన వారికి కూడా మారడానికి, కోలుకోవడానికి ఒక అవకాశం ఇస్తానని ఉపాసన తెలిపారు. సానుకూల దృక్పథంతో, మహిళలు ఒకరినొకరు శక్తివంతం చేసుకోవాల్సిన ఆవశ్యకతను ఆమె చెప్పారు.

ఎక్కువ మంది చదివినవి : Balakrishna: బాలకృష్ణకు లవర్‌గా, భార్యగా, బామ్మగా నటించిన ఏకైక హీరోయిన్.. ఇప్పటికీ తగ్గని క్రేజ్..

Follow Us
భర్త మరణిస్తే భార్య క్రెడిట్ కార్డు బిల్లు కట్టాలా..? రూల్స్ ఇవే.
భర్త మరణిస్తే భార్య క్రెడిట్ కార్డు బిల్లు కట్టాలా..? రూల్స్ ఇవే.
దువ్వుకుంటే గుప్పెడు జుట్టు వస్తోందా? ఈ లక్షణాలుంటే జాగ్రత్త
దువ్వుకుంటే గుప్పెడు జుట్టు వస్తోందా? ఈ లక్షణాలుంటే జాగ్రత్త
విలేజ్ స్టైల్ కోడి పులావ్.. ఒక్కసారి టేస్ట్ చేస్తే మళ్ళీ మళ్ళీ..
విలేజ్ స్టైల్ కోడి పులావ్.. ఒక్కసారి టేస్ట్ చేస్తే మళ్ళీ మళ్ళీ..
మళ్లీ జన్మంటూ ఉంటే సుమ లాంటి బిడ్డ పుట్టాలి..
మళ్లీ జన్మంటూ ఉంటే సుమ లాంటి బిడ్డ పుట్టాలి..
పట్టభద్రుల ఓట్ల వేట.. ప్రచారంతో కాంగ్రెస్ దూకుడు.. అభ్యర్థులపై..
పట్టభద్రుల ఓట్ల వేట.. ప్రచారంతో కాంగ్రెస్ దూకుడు.. అభ్యర్థులపై..
45 రోజుల పాటు రోజుకో అరటిపండు తింటే శరీరంలో ఏం జరుగుతుంది..?
45 రోజుల పాటు రోజుకో అరటిపండు తింటే శరీరంలో ఏం జరుగుతుంది..?
బిల్లు కట్టిన డబ్బులు ఇవ్వాలంటూ గన్‌తో బెదిరింపు.. కట్‌చేస్తే..
బిల్లు కట్టిన డబ్బులు ఇవ్వాలంటూ గన్‌తో బెదిరింపు.. కట్‌చేస్తే..
32 ఏళ్లైనా తగ్గని క్రేజ్.. కృష్ణ, సౌందర్య ఈ సాంగ్ విన్నారా.. ?
32 ఏళ్లైనా తగ్గని క్రేజ్.. కృష్ణ, సౌందర్య ఈ సాంగ్ విన్నారా.. ?
PCOD, షుగర్, గ్యాస్ సమస్యలు మాయం చేసే గోల్డెన్ వాటర్
PCOD, షుగర్, గ్యాస్ సమస్యలు మాయం చేసే గోల్డెన్ వాటర్
ఏపీలో లోకల్‌ వార్.. ఆ పార్టీ అభ్యర్థికి మద్దతుగా జబర్దస్త్ నటులు
ఏపీలో లోకల్‌ వార్.. ఆ పార్టీ అభ్యర్థికి మద్దతుగా జబర్దస్త్ నటులు