Allari Subhashini: సుమ వల్లే నేను ఇంకా బతికి ఉన్నా.. ఆమె నా ప్రాణదాత.. టాలీవుడ్ నటి ఎమోషనల్..
అల్లరి సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీలో పాపులర్ అయ్యారు సుభాషిణి. ఒకప్పుడు ఎన్నో హిట్ చిత్రాల్లో హాస్య నటిగా అలరించిన ఆమె ఇప్పుడు చాలా కాలంగా సినిమాలకు దూరంగా ఉంటున్నారు. తాజాగా ఫెస్టివల్స్ ఆఫ్ జాయ్ 5వ వార్షికోత్సవంలో కనిపించిన ఆమె సుమ కనకాలకు భావోద్వేగ కృతజ్ఞతలు తెలిపారు. క్యాన్సర్‌తో పోరాడుతున్న తనకు సుమ, రాజీవ్ కనకాల ఆర్థికంగా, మానసికంగా ఎంతో అండగా నిలిచారని, ఆమెను ప్రాణదాత అని అన్నారు.

ఫెస్టివల్స్ ఆఫ్ జాయ్ 5వ వార్షికోత్సవ వేడుకలు ఇటీవల ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమంలో ప్రముఖ యాంకర్ సుమ కనకాల సేవా కార్యక్రమాలపై పలువురు ప్రముఖులు ప్రశంసలు కురిపించారు. ముఖ్యంగా నటి అల్లరి సుభాషిణి తమ మాటలతో సుమ దాతృత్వాన్ని, ఆమె నిస్వార్థ సేవలను కొనియాడారు. క్యాన్సర్‌తో పోరాడి కోలుకుంటున్న నటి అల్లరి సుభాషిణి, సుమ కనకాల తనకు అందించిన మద్దతును గుర్తు చేసుకుని భావోద్వేగానికి లోనయ్యారు. స్టేజిపై ఆమె మాట్లాడుతూ, తనకు ఆరోగ్యం బాగాలేక నడవలేని స్థితిలో ఉన్నప్పుడు, సుమ చేసిన సహాయం తనను ఈ స్థితికి తీసుకువచ్చిందని తెలిపారు. “సుమ నా ప్రాణదాత. సుమ ద్వారా నాకు అందించే దాతలకు కూడా నా హృదయపూర్వక నమస్కారాలు. ఈరోజు నేను ఇలా నిలబడి ఉన్నానంటే సుమయే కారణం” అని సుభాషిణి చెప్పారు.
ఎక్కువ మంది చదివినవి : ముఠా మేస్త్రీ షూటింగ్ 3 నెలలు ఆగిపోయింది.. అప్పుడు చిరంజీవి చెప్పిన మాటకు ఆశ్చర్యపోయా.. బాబూ మోహన్..
ఆర్థికంగా ఇబ్బందులు ఎదురైనప్పుడు సుమ వెంటనే సహాయం పంపేవారని, రాజీవ్ కనకాల కూడా తనకు ఎంతో అండగా నిలిచారని సుభాషిణి కృతజ్ఞతలు తెలిపారు. “సుమ చల్లగా ఉండాలి, నూరేళ్లు బాగుండాలి. సుమ, రాజీవ్ కనకాల గారు, వారి బిడ్డలు అందరూ బాగుండాలి” అని ఆమె కోరుకున్నారు. అంతేకాకుండా, తనకు మళ్లీ జన్మంటూ ఉంటే సుమ లాంటి బిడ్డ పుట్టాలని కోరుకుంటున్నానని సుభాషిణి పేర్కొన్నారు.
ఎక్కువ మంది చదివినవి : Cinema : గరివిడి లక్ష్మి పాత్రను మిస్ చేసుకున్న మరో హీరోయిన్.. నిత్యా మీనన్‌తోపాటు ఆ క్రేజీ బ్యూటీ కూడా..
ఆంధ్రప్రదేశ్‌లోని పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంకు చెందిన సుభాషిణి.. బాల్యదశలోనే నాటకరంగంలోకి అడుగుపెట్టి ‘చింతామణి’ వంటి అనేక ప్రసిద్ధ నాటకాలలో నటించి మంచి పేరు తెచ్చుకున్నారు. రవీంద్రభారతిలో నాటక ప్రదర్శన ఇస్తున్న సమయంలో ఆమె నటనను చూసిన ప్రముఖ నటుడు చలపతిరావు గారు, దర్శకుడు రవిబాబును కలవాల్సిందిగా సూచించారు. రవిబాబు దర్శకత్వంలో వచ్చిన ‘అల్లరి’ (2002) సినిమాతో ఆమె వెండితెరకు పరిచయమయ్యారు. ఆ సినిమాలో ఆమె పోషించిన పాత్ర బాగా పాపులర్ అవ్వడంతో, ఆమె పేరు “అల్లరి సుభాషిణి”గా స్థిరపడిపోయింది. ‘అల్లరి’ విజయం తర్వాత ఈవివి సత్యనారాయణ, కృష్ణవంశీ వంటి ప్రముఖ దర్శకుల సినిమాల్లో వరుస అవకాశాలు దక్కించుకున్నారు.
ఎక్కువ మంది చదివినవి : Idupu Kayitham: ఇడుపు కాయితం నుంచి గడప సాంగ్ రిలీజ్.. ప్రతి అమ్మాయి హృదయాలను హత్తుకునే పాట..
ఎక్కువ మంది చదివినవి : Balakrishna: బాలకృష్ణకు లవర్‌గా, భార్యగా, బామ్మగా నటించిన ఏకైక హీరోయిన్.. ఇప్పటికీ తగ్గని క్రేజ్..
