Shruti Haasan: నెటిజన్‌కు దిమ్మతిరిగే సమాధానం చెప్పిన శృతి హాసన్.. ఇంతకు అతడు ఏమడిగాడో తెలుసా..?
స్టార్ వారసురాలిగా ఎంట్రీ ఇచ్చిన శృతి హాసన్... కెరీర్ విషయంలోనే కాదు... కాంట్రవర్షియల్ స్టేట్మెంట్స్ విషయంలోనూ ఎప్పుడూ ముందే ఉంటారు.
Shruti Haasan : స్టార్ వారసురాలిగా ఎంట్రీ ఇచ్చిన శృతి హాసన్… కెరీర్ విషయంలోనే కాదు… కాంట్రవర్షియల్ స్టేట్మెంట్స్ విషయంలోనూ ఎప్పుడూ ముందే ఉంటారు. చాలా కాలం తరవాత క్రాక్ సినిమాతో సక్సెస్ ట్రాక్ లోకి వచ్చింది ఈ చిన్నది. సినిమాలతో సరిసమానంగా కాంట్రావర్సీలను క్యారీ చేస్తూ వస్తుంది. తను అనుకున్నది అనుకున్నట్టుగా పర్ఫెక్ట్‌గా చెప్పేసే ఈ బ్యూటీ… ఓ చాట్ సెషన్‌లో ఫ్యాన్స్… పెళ్లి గురించి అడిగిన ప్రశ్నకు గట్టి కౌంటర్ ఇచ్చారు. ఆ మధ్య ఓ ఫారిన్ బాయ్‌ఫ్రెండ్‌తో డేటింగ్ చేసిన శృతి.. అతడిని పెళ్లి చేసుకుంటారన్న టాక్ వినిపించింది. ఆ లోగా బ్రేకప్ కావటంతో.. తరువాత డిప్రెషన్‌తో శృతి సినిమాలకు దూరం అయ్యారు. దీంతో ఆ టాక్‌కు అక్కడితో ఫుల్ స్టాప్ పడింది. కానీ రీసెంట్‌గా మరో బాయ్‌ఫ్రెండ్‌తో రిలేషన్‌షిప్‌లో ఉన్నారు ఈ బ్యూటీ.
ఆర్టిస్ట్ శాంతను హజారికాతో డేటింగ్‌లో ఉన్న శృతికి ఈ మధ్య రెగ్యులర్‌గా పెళ్లి గురించిన ప్రశ్న ఎదురవుతోంది. అందుకే ఈ విషయంలో కాస్త సీరియస్‌గానే రియాక్ట్ అయ్యారు శృతి. ప్రపంచంలో నా పెళ్లి కాకుండా మాట్లాడుకోవాల్సిన అంశాలు చాలానే ఉన్నాయి. నేను ఇప్పట్లో పెళ్లి చేసుకోను అంటూ ఖరాఖండిగా చెప్పేశారు. మరి ఈ వార్నింగ్ తరువాతైన శృతి పెళ్లి వార్తలకు ఫుల్‌స్టాప్ పడుతుందేమో చూడాలి. ఇక శృతి సినిమాల విషయానికొస్తే ఈ అమ్మడు ప్రస్తుతం పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటిస్తున్న సలార్ సినిమాలో హీరోయిన్ గా చేస్తుంది. ఈ సినిమా ప్రస్తుతం షూటింగ్ దశలో ఉంది. సలార్ తరవాత శృతి చేతిలో మరో రెండు తెలుగు సినిమాలు ఉన్నాయని తెలుస్తోంది. దానికి సంబంధించిన వివరాలు త్వరలోనే తెలిసే అవకాశం ఉంది.
మరిన్ని ఇక్కడ చదవండి :