Maha Samudram: ఫీల్ ది ఇంటెన్సిటీ.. ‘మహ సముద్రం’ క్యారెక్టర్స్ ఇవే.. మోషన్ వీడియో రిలీజ్..

Rajitha Chanti

Rajitha Chanti |

Updated on: Jul 29, 2021 | 3:34 PM

టాలెంటెడ్ హీరోస్ శర్వానంద్, సిద్ధార్థ్ ప్రదాన పాత్రలలో నటిస్తున్న లెటేస్ట్ మూవీ మహా సముద్రం. ఆర్ ఎక్స్ 100 సినిమాతో సూపర్ హిట్

Maha Samudram: ఫీల్ ది ఇంటెన్సిటీ.. 'మహ సముద్రం' క్యారెక్టర్స్ ఇవే.. మోషన్ వీడియో రిలీజ్..
Maha Samudram

టాలెంటెడ్ హీరోస్ శర్వానంద్, సిద్ధార్థ్ ప్రదాన పాత్రలలో నటిస్తున్న లెటేస్ట్ మూవీ మహా సముద్రం. ఆర్ ఎక్స్ 100 సినిమాతో సూపర్ హిట్ అందుకున్న డైరెక్టర్ అజయ్ భుపతి ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తుండగా.. ఎ.కె. ఎంటర్‏టైన్మెంట్స్ బ్యానర్ పై రామబ్రహ్మం నిర్మిస్తున్నారు. ఇందులో అతిధీరావు హైదరీ.. అను ఇమ్మాన్యుయేల్ హీరోయిన్స్‎గా నటిస్తుండగా.. జగపతి బాబు.. రావు రమేష్ కీలక పాత్రలలు పోషిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన పోస్టర్స్‏కు విశేషస్పందన లభించింది. తాజాగా మహా సముద్రం టీం.. మూవీలోని పాత్రలన్నింటినీ పరిచయం చేస్తూ.. ఓ వీడియోను విడుదల చేసింది.

చెడ్డ వాళ్లయిన విలన్లు.. బిందాస్ అనిపించే హీరోలను కూడా ఈ వీడియోలో ఆవిష్కరించారు. చెడుపై మంచి పోరాటం ఎలా సాగనుంది? అందులో ఎమోషన్ ఏమిటన్నది తెరపైనే చూడాలి. ఇక ఈ చిత్రంలో శర్వానంద్ మాస్ లుక్ లో కనిపిస్తుండగా.. సిద్ధార్థ్ డ్యూయల్ షేడ్ పాత్రలో కనిపిస్తున్నారు. అతడిలోని లవర్ బోయ్ షేడ్ ని ఎలివేట్ చేయడం ఆసక్తిని కలిగించింది. ఫీల్ ది ఇంటెన్సిటీ అంటూ విజువల్ వీడియోను రిలీజ్ చేశారు. ఇందులో పాత్రలు ఎలా ఉండబోతున్నాయనేది చూస్తుంటే అర్థమవుతోంది. ఈచిత్రానికి యువ సంగీత దర్శకుడు చైతన్ భరద్వాజ్ సినిమాకు సంగీతం అందిస్తున్నారు. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ మూవీ ఆగస్ట్ 19న థియేటర్లలో తెలుగు, తమిళ భాషలలో విడుదల కానుంది.

ట్వీట్..

Also Read: RRR Movie: తగ్గేదే లే అంటున్న ట్రిపులార్ టీమ్.. ఇంతకీ జక్కన్న ధైర్యం ఏంటి..?

Priya Prakash Varrier: ‘ఇష్క్’ సినిమాకోసం ఆలోచన మార్చుకున్నానంటున్న ప్రియా ప్రకాష్..

Tollywood: తెలుగు ఫిలింఛాంబర్‌‌‌‌‌లో ఎగ్జిబిటర్ల సమావేశం.. సమస్యలను ప్రభుత్వానికి విజ్ఞప్తి చేయాలని నిర్ణయం..

లేటెస్ట్ న్యూస్ హైలెట్స్ చూడండి

Follow us on

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu