AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

RRR Movie: తగ్గేదే లే అంటున్న ట్రిపులార్ టీమ్.. ఇంతకీ జక్కన్న ధైర్యం ఏంటి..?

SS Rajamouli's RRR Movie Update: ఇప్పుడిప్పుడే పరిస్థితులు చక్కబడుతున్నట్టుగా అనిపిస్తున్నా.. భవిష్యత్తు మీద అనుమానాలు మాత్రం అలాగే ఉన్నాయి. ఈ పరిస్థితుల్లో ఇండస్ట్రీ ఆశలన్నీ ట్రిపులార్(RRR Movie) మీదే. తగ్గేదే లేదంటూ...

RRR Movie: తగ్గేదే లే అంటున్న ట్రిపులార్ టీమ్.. ఇంతకీ జక్కన్న ధైర్యం ఏంటి..?
RRR Movie Update
TV9 Telugu Digital Desk
| Edited By: Janardhan Veluru|

Updated on: Jul 29, 2021 | 2:59 PM

Share

కోవిడ్ దెబ్బకు ఇండస్ట్రీ రూపు రేఖలే మారిపోయాయి. ఏడాదిన్నరగా సినిమా ఇండస్ట్రీ డైలామాలోనే ఉంది. మధ్యలో కాస్త బ్రేక్ ఇచ్చినట్టుగానే అనిపించినా మళ్లీ స్లంప్‌ లోకి వెళ్లిపోయింది. కరోనా తీవ్రతతో థియేటర్లు మూత పడ్డాయి. దీంతో చాలా సినిమాలు ఓటీటీ బాటపట్టాయి. ఇప్పుడిప్పుడే పరిస్థితులు చక్కబడుతున్నట్టుగా అనిపిస్తున్నా.. భవిష్యత్తు మీద అనుమానాలు మాత్రం అలాగే ఉన్నాయి. ఈ పరిస్థితుల్లో ఇండస్ట్రీ ఆశలన్నీ ట్రిపులార్(RRR Movie) మీదే. తగ్గేదే లేదంటూ థియేటర్లలోకి వచ్చేందుకు రెడీ అవుతున్నారు ట్రిపులార్ టీమ్‌.  అసలు ఇలాంటి పరిస్థితుల్లో ట్రిపులార్‌ యూనిట్ ధైర్యానికి కారణం ఏంటి..? రిలీజ్‌కు రెడీగా ఉన్న సినిమాలు కూడా డేట్‌ ఫిక్స్ చేసుకోలేకపోతుంటే… జక్కన్న మాత్రం చెప్పిన టైమ్‌కే వస్తానంటూ అంత కాన్ఫిడెంట్‌గా ఎలా చెబుతున్నారు? చెప్పటమే కాదు ఏకంగా ప్రమోషన్‌ కూడా స్టార్ట్ చేసేశారు. మామూలు సినిమా రిలీజ్‌కు ట్రిపులార్‌ లాంటి పాన్‌ ఇండియా సినిమా రిలీజ్‌కు చాలా తేడా ఉంటుంది. రీజినల్ సినిమా రిలీజ్‌ అంటే ఒకటి రెండు స్టేట్స్‌లో సిచ్యుయేషన్‌ చూసుకుంటే సరిపోతుంది. కానీ ట్రిపులార్ విషయంలో పరిస్థితి వేరు. నేషనల్‌ లెవల్‌లో… ఇంకా చెప్పాలంటే ఇంటర్‌ నేషనల్‌ లెవల్‌లో పరిస్థితులు అనుకూలిస్తేగాని సినిమా రిలీజ్ చేయలేని పరిస్థితి.

అయినా జక్కన్న టీమ్‌ మాత్రం అస్సలు తగ్గటం లేదు. ఈ మధ్యే మేకింగ్ వీడియోతో ఆకట్టుకున్న యూనిట్‌.. ఫస్ట్ సింగల్‌ను రిలీజ్ చేసేందుకు రెడీ అవుతోంది. ప్రతీ అప్‌డేట్‌లోనూ రిలీజ్‌ డేట్‌ను నొక్కి మరీ చెబుతోంది. మూడో వేవ్‌ ముప్పు తప్పదని ఎక్స్‌పర్ట్స్ అంటుంటే ట్రిపులార్ టీమ్ మాత్రం వాటిని పట్టించుకోవటం లేదు.. దీని వెనక సపరేట్‌ స్ట్రాటజీ ఏమైనా ఉందా..? ఇదే ఇప్పుడు ఇండస్ట్రీ వర్గాలను అర్ధం కాని విషయం.

Theatre

Theatre

అయితే ఈ విషయంలో గత రిలీజ్‌ల అనుభవాలే ట్రిపులార్‌కు ఆదర్శం అన్న టాక్ కూడా వినిపిస్తోంది. కోవిడ్ ఫస్ట్ వేవ్ తరువాత తెలుగుతో పాటు ఇతర భాషల్లోనూ చాలా సినిమాలు రిలీజ్ అయ్యాయి. అయితే వెంటనే సెకండ్ వేవ్‌ ఎఫెక్ట్ తగలటంతో షార్ట్ గ్యాప్‌లో ఆ సినిమాలను ఓటీటీలో రిలీజ్ చేశారు. మలయాళ ఇండస్ట్రీలో అయితే ముందే ఓటీటీ డీల్‌ సెట్‌ చేసుకొని సినిమాలు రిలీజ్ చేశారు. వన్‌ ఆర్‌ టు వీక్స్‌ థియేటర్లలో సినిమా ప్రదర్శించి తరువాత ఓటీటీలో వేసేశారు. పరిస్థితి ఏమైనా తేడా పడితే ఇలాంటి ఆప్షన్స్‌ ఉంటాయన్నదే ట్రిపులార్ టీమ్‌ ధైర్యం అయ్యుండొచ్చన్న వాదనా లేకపోలేదు.

అదే సమయంలో బాహుబలి టైమ్‌లోనూ జక్కన్న ఇలాగే చెప్పారు. సెంకడ్ పార్ట్ రిలీజ్‌ డేట్‌ విషయంలో కాన్ఫిడెంట్‌గానే కనిపించిన రాజమౌళి లాస్ట్ మినిట్‌లో ఐయామ్ సారీ అనేశారు. పరిస్థితులు అనుకూలించకపోతే.. చివరి నిమిషంలో అయినా రిలీజ్ వాయిదా వేసే అవకాశం లేకపోలేదన్నది మరో వర్షన్‌. ట్రిపులార్ లాంటి సినిమాను ఆడియన్స్ సిల్వర్‌ స్క్రీన్ మీద ఎక్స్‌పీరియన్స్‌ చేస్తేనే ఆ కిక్‌ ఉంటుంది. అదే సమయంలో ఈ సినిమాకు భారీ లాభాలు రావాలంటే కచ్చితంగా థియేట్రికల్‌ రిలీజ్ కావాల్సిందే.. మరి అక్టోబర్‌ నాటికి పరిస్థితులు సహకరిస్తాయా..? జక్కన్న విజువల్‌ ట్రీట్‌ థియేటర్లలోనే ఇస్తారా..? లెట్స్ వెయట్ అండ్ సీ.

(సతీష్ రెడ్డి జడ్డా, TV9 Telugu, ET Desk)

Also Read..

Bigg Boss 5: బిగ్ బాస్ సీజన్5 సిద్దమవుతోంది.. ప్రేక్షకుల ముందుకు వచ్చేది ఎప్పుడంటే..

Tollywood: తెలుగు ఫిలింఛాంబర్‌‌‌‌‌లో ఎగ్జిబిటర్ల సమావేశం.. సమస్యలను ప్రభుత్వానికి విజ్ఞప్తి చేయాలని నిర్ణయం..

ధనుష్‌ మరో తెలుగు సినిమాకు సైన్‌ చేశాడా.. ఆ ట్వీట్‌కి అర్థం అదేనా.. డైరెక్టర్‌ ఇతనేనా.?