AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Dhanush Telugu: ధనుష్‌ మరో తెలుగు సినిమాకు సైన్‌ చేశాడా.. ఆ ట్వీట్‌కి అర్థం అదేనా.. డైరెక్టర్‌ ఇతనేనా.?

Dhanush Telugu: సినిమా సినిమాకు తనలోని నటనకు మెరుగుపరుచుకుంటూ వెళుతున్నాడు తమిళ హీరో ధనుష్‌. భారీ స్టార్‌డమ్‌ ఉన్నా వైవిధ్య భరితమైన, నటనకు ప్రాధాన్యత ఉన్న పాత్రల్లో నటిస్తూ తనకంటూ...

Dhanush Telugu: ధనుష్‌ మరో తెలుగు సినిమాకు సైన్‌ చేశాడా.. ఆ ట్వీట్‌కి అర్థం అదేనా.. డైరెక్టర్‌ ఇతనేనా.?
Dhanush In Telugu Movie
Narender Vaitla
|

Updated on: Jul 29, 2021 | 12:47 PM

Share

Dhanush Telugu: సినిమా సినిమాకు తనలోని నటనకు మెరుగుపరుచుకుంటూ వెళుతున్నాడు తమిళ హీరో ధనుష్‌. భారీ స్టార్‌డమ్‌ ఉన్నా వైవిధ్య భరితమైన, నటనకు ప్రాధాన్యత ఉన్న పాత్రల్లో నటిస్తూ తనకంటూ ఓ ప్రత్యేకగుర్తింపును సంపాదించుకున్నాడీ యంగ్‌ హీరో. కేవలం ఇండియన్‌ సినిమాలకే పరిమితం కాకుండా హాలీవుడ్‌లో చిత్రంలోనూ నటిస్తూ దూసుకుపోతున్నాడు. ఇక ధనుష్‌కు తెలుగులోనూ మంచి ఫాలోయింగ్‌ ఉన్న విషయం తెలిసిందే. ధనుష్‌ తెలుగు డబ్బింగ్‌ సినిమాలు టాలీవుడ్‌లోనూ మంచి విజయాలను సొంతం చేసుకున్నాయి. ఇప్పటి వరకు తమిళ సినిమాలకే పరిమితమైన ధనుష్‌ తాజాగా తొలిసారి తెలుగులో నేరుగా ఓ సినిమాలో నటిస్తున్నాడు. శేఖర్‌ కమ్ముల దర్శకత్వంలో నటిస్తున్నట్లు చిత్ర యూనిట్‌ ఇటీవల అధికారికంగా ప్రకటించింది. పాన్‌ ఇండియా నేపథ్యంలో తెరకెక్కనున్న ఈ సినిమాపై ఇప్పటి నుంచే భారీ అంచనాలున్నాయి.

ఇదిలా ఉంటే ఈ సినిమా షూటింగ్‌ ఇంకా ప్రారంభం కాకముందే ధనుష్‌ మరో తెలుగు చిత్రానికి ఓకే చేశారని వార్తలు వస్తున్నాయి. బుధవారం (జులై 28) ధనుష్‌ పుట్టిన రోజు ఈ సందర్భంగా ఆయన అభిమానులతో పాటు సెలబ్రిటీలు సైతం విషెస్‌ తెలియజేశారు. ఈ సందర్భంగా సితారా ఎంటర్‌టైన్‌మెంట్స్‌ చేసిన ఓ ట్వీట్‌ ఆసక్తిని రేకెత్తిస్తోంది. సితారా ఎంటర్‌టైన్‌మెంట్స్‌ లోగోతో ఉన్న ధనుష్‌ ఫొటోను పోస్ట్‌ చేస్తూ.. ‘ఎంతో ప్రతిభావంతులైన నటులు ధనుష్‌ గారికి పుట్టిన రోజు శుభాకాంక్షలు’ అని ట్వీట్‌ చేశారు. దీంతో ధనుష్‌ ఈ బ్యానర్‌పై సినిమా చేయనున్నాడని చర్చ జరుగుతోంది. అంతేకాకుండా ఈ సినిమాకు వెంకీ అట్లూరి దర్శకత్వం వహిస్తున్నారని, ఈ సినిమాను పాన్‌ ఇండియా నేపథ్యంలో తెరకెక్కించనున్నారని వార్తలు వస్తున్నాయి. వెంకీ అట్లూరి.. తొలిప్రేమ, మిస్టర్‌ మజ్నూ, రంగ్‌దే వంటి చిత్రాలకు దర్శకత్వం వహించిన విషయం తెలిసిందే. మరి ధనుష్‌ రెండో తెలుగు సినిమా వార్తలో ఎంత వరకు నిజం ఉందో తెలియాలంటే అధికారిక ప్రకటన వచ్చే వరకు వేచి చూడాల్సిందే.

Also Read: Bigg Boss 5: బిగ్ బాస్ సీజన్5 సిద్దమవుతోంది.. ప్రేక్షకుల ముందుకు వచ్చేది ఎప్పుడంటే..

Shraddha Srinath: ఒక్కో రోజు ఒక్కో ఆలోచన వచ్చేది.. ఏదేదో అవ్వాలనుకుని చివరికి నటినయ్యాను. శ్రద్ధా ఆసక్తిర వ్యాఖ్యలు.

K.G.F Chapter 2 : కేజీఎఫ్2 నుంచి అధీరా లుక్.. సంజయ్ దత్‌‌‌‌ను చూస్తే వెన్నులో వణుకుపుట్టాల్సిందే..

Follow Us
రోడ్లపై కనిపించే ఈ మొక్క తెలుసా? ఆ రోగానికి బ్రహ్మస్త్రం..
రోడ్లపై కనిపించే ఈ మొక్క తెలుసా? ఆ రోగానికి బ్రహ్మస్త్రం..
వీరిని కష్టాల నుంచి కాపాడటానికి వస్తున్న కర్మ ప్రదాత..
వీరిని కష్టాల నుంచి కాపాడటానికి వస్తున్న కర్మ ప్రదాత..
ఉక్రెయిన్‌పై భారత్‌ స్టాండ్‌ మరోసారి క్లియర్!
ఉక్రెయిన్‌పై భారత్‌ స్టాండ్‌ మరోసారి క్లియర్!
లోన్ EMI చెల్లించకపోతే ఫోన్ లాక్ అవుతుందా? ఆర్బీఐ కొత్త రూల్స్‌!
లోన్ EMI చెల్లించకపోతే ఫోన్ లాక్ అవుతుందా? ఆర్బీఐ కొత్త రూల్స్‌!
100 ఏళ్లైనా బుడ్డోడి ఈ డేంజరస్ రికార్డులను బద్దలు కొట్టడం కష్టమే
100 ఏళ్లైనా బుడ్డోడి ఈ డేంజరస్ రికార్డులను బద్దలు కొట్టడం కష్టమే
కోతుల బెడదకు ఎలుగుబంటి అవతారం,పత్తి పంటకు రక్షణగా సరికొత్త ట్రిక్
కోతుల బెడదకు ఎలుగుబంటి అవతారం,పత్తి పంటకు రక్షణగా సరికొత్త ట్రిక్
7 ఏళ్ల చిన్నారి దెబ్బకు కదిలిన యంత్రాంగం..!
7 ఏళ్ల చిన్నారి దెబ్బకు కదిలిన యంత్రాంగం..!
కొండా సురేఖ, చిన్నారెడ్డి వ్యవహారంపై కీలక నిర్ణయం..!
కొండా సురేఖ, చిన్నారెడ్డి వ్యవహారంపై కీలక నిర్ణయం..!
పీఎం కిసాన్‌ 24వ విడత డబ్బులపై కీలక అప్‌డేట్‌.. వచ్చేది అప్పుడేనా
పీఎం కిసాన్‌ 24వ విడత డబ్బులపై కీలక అప్‌డేట్‌.. వచ్చేది అప్పుడేనా
వెలిగొండ వరద ధాటికి ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని..!
వెలిగొండ వరద ధాటికి ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని..!