AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

K.G.F Chapter 2 : కేజీఎఫ్2 నుంచి అధీరా లుక్.. సంజయ్ దత్‌‌‌‌ను చూస్తే వెన్నులో వణుకుపుట్టాల్సిందే..

కేజీఎఫ్..  పాన్ ఇండియా మూవీగా వచ్చిన ఈ మూవీ.. విడుదలైన అన్ని భాషల్లో సంచలన విజయం అందుకుంది. ఈ ఒక్క సినిమాతో ఒక్కసారిగా

K.G.F Chapter 2 : కేజీఎఫ్2 నుంచి అధీరా లుక్.. సంజయ్ దత్‌‌‌‌ను చూస్తే వెన్నులో వణుకుపుట్టాల్సిందే..
Kgf
Rajeev Rayala
|

Updated on: Jul 29, 2021 | 11:51 AM

Share

Happy Birthday Sanjay Dutt: కేజీఎఫ్.. పాన్ ఇండియా మూవీగా వచ్చిన ఈ మూవీ.. విడుదలైన అన్ని భాషల్లో సంచలన విజయం అందుకుంది. ఈ ఒక్క సినిమాతో ఒక్కసారిగా అందరి దృష్టిని తనవైపు తిప్పుకున్నాడు దర్శకుడు ప్రశాంత్ నీల్. కంప్లీట్ యాక్షన్ ఎంటర్టైనర్‌‌‌గా తెరకెక్కిన ఈ సినిమా భారీ విజయాన్ని సొంతం చేసుకోవడమే కాకుండా.. వసూళ్లను కూడా అదే రేంజ్‌‌‌లో రాబట్టింది. ఈ సినిమా రెండు భాగాలుగా ప్రేక్షకుల ముందుకు రాబోతోన్న విషయం తెలిసిందే. ఇప్పటికే మొదటి భాగం అనూహ్య విజయం సాధించడంతో కేజీఎఫ్ చాప్టర్ 2పై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇక కేజీఎఫ్2 కోసం అభిమానులంతా ఎంతో ఆతృతగా ఎదురుచూస్తోన్నారు. ఈ సినిమాలో బాలీవుడ్ తారలు నటిస్తోన్న విషయం తెలిసిందే. ఈ సినిమాలో విలన్ గా బాలీవుడ్ సీనియర్ హీరో సంజయ్ దత్ నటిస్తోన్నారు. అధీరాగా సంజయ్ నటిస్తోన్నారు. ఇప్పటికే విడుదలైన సినిమా టీజర్, పోస్టర్లు ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్నాయి. ఇకకేజీఎఫ్2 టీజర్ యూట్యూబ్‌‌‌‌లో రికార్డ్స్ తిరగరాసింది.

తాజాగా సంజయ్ దత్ బర్త్ డే సందర్భంగా..  ఆయన అభిమానులకు సర్‌‌‌ప్రైజ్ ఇచ్చారు చిత్రయూనిట్. కేజీఎఫ్ 2 నుంచి అదీరా లుక్‌‌‌‌ను రిలీజ్ చేశారు. గతంలో విడుదల చేసిన ప్రీ లుక్‌‌‌‌తోనే అందరి అంచనాలను పెంచేసిన చిత్రయూనిట్ తాజాగా విడుదల చేసిన లుక్‌‌‌‌తో ఆ అంచనాలను రీచ్ అయ్యిందనే చెప్పాలి. ఈ పోస్టర్‌‌‌‌‌లో వెనక సైన్యం ఉండగా.. ముందు సంజయ్ దత్ స్టైలిష్ కళ్లద్దాలు పెట్టుకొని.. భారీ ఖడ్గం చేతపట్టుకొని చాలా ఎగ్రసివ్‌‌‌‌గా కనిపిస్తోన్నారు. మొదటి పార్ట్‌‌‌కు మించి ఇందులో యాక్షన్ సన్నివేశాలు ఉంటాయని ప్రశాంత్ నీల్ మొదటి నుంచి చెప్తూనే వస్తున్నారు. చూడాలి మరి ఈ సినిమా ఏస్థాయిలో ప్రేక్షకులను అలరిస్తుందో..

మరిన్ని ఇక్కడ చదవండి : 

MAA elections: ఎన్నికా.. ఏకగ్రీవమా… మా ఎగ్జిక్యూటివ్ కమిటీ మీటింగ్ పై సర్వత్రా ఉత్కంఠ

Chiranjeevi : మెగాస్టార్ లూసీఫర్ రీమేక్‌‌‌కు ఇంట్రస్టింగ్ టైటిల్.. చక్కర్లు కొడుతోన్న వార్త

ట్రైలర్ రిలీజ్ చేసిన ఆర్జీవీ..ట్రైలర్ ఏమోగానీ ఆర్జీవీ రియాక్షన్ మాత్రం హైలెట్..:RGV reaction Video.