AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Trisha: మరోసారి కోలీవుడ్‏లో గుప్పుమన్న పెళ్లి రూమర్స్.. క్లారిటీ ఇచ్చేసిన మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ త్రిష..

ప్రభాస్ ప్రధాన పాత్రలో నటించిన వర్షం సినిమాతో త్రిష కెరీర్ ఒక్కసారిగా మలుపు తిరిగందని చెప్పుకోవచ్చు. ఈ మూవీ తర్వాత త్రిష తెలుగులో

Trisha: మరోసారి కోలీవుడ్‏లో గుప్పుమన్న పెళ్లి రూమర్స్.. క్లారిటీ ఇచ్చేసిన మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ త్రిష..
Trisha
Rajitha Chanti
| Edited By: Janardhan Veluru|

Updated on: Jul 29, 2021 | 4:47 PM

Share

ప్రభాస్ ప్రధాన పాత్రలో నటించిన వర్షం సినిమాతో త్రిష కెరీర్ ఒక్కసారిగా మలుపు తిరిగందని చెప్పుకోవచ్చు. ఈ మూవీ తర్వాత త్రిష తెలుగులో టాప్ హీరోయిన్స్‏లలో ఒకరిగా స్థానం సంపాదించుకుంది. అందం, అభినయంతో తెలుగు ప్రేక్షకులను అలరిస్తూ కొన్నేళ్లపాటు టాప్ హీరోయిన్స్ రేసులో కొనసాగింది. అటు తమిళంలోనూ త్రిష వరుస ఆఫర్లను అందుకుంది. ప్రస్తుతం ఈ అమ్మడు లేడీ ఓరియెంటెడ్ సినిమాలు చేస్తూ బిజీ బిజీగా గడిపేస్తుంది. నాలుగు పదుల వయసుకు చేరువవుతున్న ఇంకా పెళ్లి చేసుకునే ఉద్దేశ్యం ఇప్పుడు లేదు అంటూ షాకింగ్ సమాధానాలిస్తుంది.

గతంలో చెన్నైకు చెందిన ఓ వ్యాపారవేత్తతో ప్రేమలో మునిగితేలింది. నిశ్చితార్థం జరిగి పెళ్లీ పీఠల వరకు వచ్చిన అనుహ్యంగా ఆగిపోయింది. ఇక ఆ తర్వాత తిరిగి సినిమాలపై దృష్టి పెట్టింది ఈ చిన్నది. ఇదిలా ఉంటే.. గత కొన్ని రోజులుగా త్రిష పెళ్లి ప్రస్తావన మరోసారి తెరపైకి వచ్చింది. తమిళ ఇండస్ట్రీకి చెందిన ఓ స్టార్ డైరెక్టర్‏తో త్రిష పెళ్లి జరుగబోతుందని తమిళ మీడియాలో వరుస కథనాలు వెలువడ్డాయి. తాజాగా తన పెళ్లి గురించి వస్తున్న వార్తలపై త్రిష స్పందించింది. తాను పెళ్లికి సిద్ధమవ్వలేదని.. ఇప్పట్లో పెళ్లి చేసుకునే ఉద్దేశ్యం లేదని చెప్పుకొచ్చింది. పెళ్లి విషయంలో వస్తున్న వార్తలన్ని అవాస్తవాలేనని కొట్టిపడేసింది. ప్రస్తుతం తన దృష్టి మొత్తం సినిమాలపైనే ఉందని పేర్కోంది. అయితే వరుస సినిమాలతో కెరీర్ టాప్ లో దూసుకుపోతున్న త్రిష.. అదే సమయంలో ప్రేమ, పెళ్లి అంటూ సినిమాలకు దూరమయ్యింది. కేవలం వెండితెరపైనే కాకుండా.. డిజిటల్ ఫ్లాట్‏ఫామ్‏లోనూ త్రిష తన సత్తా నిరుపించుకుంటుంది.

ఇన్‌స్టాలో నటి త్రిష ఇటీవల పోస్ట్ చేసిన ఆమె ఫొటో..

View this post on Instagram

A post shared by Trish (@trishakrishnan)

Also Read: Alaska Earthquake: భూకంప ప్రకంపనలతో వణికిపోయిన అలాస్కా.. రిక్టర్ స్కేలుపై 8.2 మ్యాగ్నిట్యూడ్ నమోదు.. సునామీ హెచ్చరికల జారీ

US Covid Cases: అమెరికాను మళ్ళీ వణికిస్తున్న కరోనా.. ఒక్క రోజులో 88 వేలకు పైగా కేసులు.. కొత్త మార్గదర్శకాలు జారీ

Hyderabad: పై అంతస్తుకు వెళ్తుండగా కూలిన లిఫ్ట్.. ఉప్పల్ ఎమ్మెల్యే సుభాష్ రెడ్డికి తృటిలో తప్పిన ప్రమాదం..