AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

US Covid Cases: అమెరికాను మళ్ళీ వణికిస్తున్న కరోనా.. ఒక్క రోజులో 88 వేలకు పైగా కేసులు.. కొత్త మార్గదర్శకాలు జారీ

అమెరికాపై కరోనా మళ్ళీ పంజా విసురుతోంది. కేసుల సంఖ్య గణనీయంగా పెరుగుతుండడం అగ్ర రాజ్యాన్ని వణికిస్తోంది. తాజాగా ఈ దేశంలో గత 24 గంటల్లో 88,376 కేసులు నమోదయ్యాయి.

US Covid Cases: అమెరికాను మళ్ళీ వణికిస్తున్న కరోనా.. ఒక్క రోజులో 88 వేలకు పైగా కేసులు.. కొత్త మార్గదర్శకాలు జారీ
Joe Biden
Umakanth Rao
| Edited By: Phani CH|

Updated on: Jul 29, 2021 | 3:56 PM

Share

అమెరికాపై కరోనా మళ్ళీ పంజా విసురుతోంది. కేసుల సంఖ్య గణనీయంగా పెరుగుతుండడం అగ్ర రాజ్యాన్ని వణికిస్తోంది. తాజాగా ఈ దేశంలో గత 24 గంటల్లో 88,376 కేసులు నమోదయ్యాయి. గత ఫిబ్రవరి తరువాత దేశంలో ఈ కేసులు ఇంతగా పెరగడం ఇదే మొదటిసారి. జులై 4 న అమెరికా స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ‘సమ్మర్ ఆఫ్ జాయ్’ అంటూ అధ్యక్షుడు జోబైడెన్ ప్రకటించి ఇక మాస్కుల అవసరం లేదని పేర్కొన్నారు. కానీ మూడు వారాల్లో కోవిడ్ కేసులు అనూహ్యంగా పెరిగిపోయాయి. జులై 25 తో ముగిసిన వారంతో అయిదు లక్షలకు పైగా కేసులు నమోదయ్యాయి. అంతకు ముందు వారంతో పోలిస్తే ఇది సుమారు 131 శాతం అధికమని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. ఇక వ్యాక్సిన్ తీసుకున్నా తీసుకోకపోయినా మాస్కులు తప్పనిసరి అంటూ ప్రభుత్వం కొత్త మార్గదర్శకాలను విడుదల చేసింది. ఇళ్లలో ఉన్నా, బహిరంగ స్థలాల్లో ఉన్నా ప్రజలు వీటిని ధరించడం అనివార్యమని పేర్కొంది. కోవిడ్ డెల్టా వేరియంట్ పై నూతన గైడ్ లైన్స్ జారీతో న్యూయార్క్, శాన్ ఫ్రాన్సిస్కో నగరాల్లోని తమ కార్యాలయాలను నిరవధికంగా మూసివేస్తున్నట్టు ట్విటర్ ప్రకటించింది. ఇక ఉద్యోగులు శాశ్వతంగా ఇళ్ల నుంచే పని చేయవలసి ఉంటుందని పేర్కొంది.

అంటువ్యాధుల నివారణా విభాగం ప్రకటించిన నూతన మార్గదర్శకాల గురించే వైట్ హౌస్ లో ప్రెస్ సెక్రటరీ జెన్ సాకి ఎక్కువగా తమ మీడియా సమావేశంలో ప్రస్తావించారు. స్కూళ్ళు, యూనివర్సిటీలు తెరిచినప్పటికీ విద్యార్థులు, టీచర్లు, స్టాఫ్ అంతా విధిగా మాస్కులు ధరించాల్సిందే అని ఆమె వివరించారు. నిన్న సాయంత్రం జర్నలిస్టులకు, అధికారులకు అందిన ఈ-మెయిల్స్ లో మాస్కుల ధారణకు సంబంధించి ప్రధానంగా పేర్కొన్నారు. రిస్క్ ఎక్కువగా ఉన్న ప్రాంతాలవారు మరీ ముఖ్యంగా ఈ గైడ్ లైన్స్ కి కట్టుబడి ఉండాలని సూచించారు.

మరిన్ని ఇక్కడ చూడండి: Chittoor Murder : చిత్తూరు కలెక్టరేట్ అటెండర్ మృతిలో కొత్త ట్విస్ట్.. ప్రియుడి ప్రేమ కోసం భర్త గొంతు నులిమి..

Star Sapphire: బావి కోసం తవ్వుతుంటే..రూ. 175 కోట్ల విలువజేసే పెద్ద నీలమణుల క్లస్టర్ దొరికింది ఎక్కడో తెలుసా..