AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Star Sapphire: బావి కోసం తవ్వుతుంటే..రూ. 175 కోట్ల విలువజేసే పెద్ద నీలమణుల క్లస్టర్ దొరికింది ఎక్కడో తెలుసా..

Sri Lanka: అదృష్టం ఎవరిని ఎప్పుడు ఎలా వరిస్తుందో ఎవరికీ తెలియదు. ఒక్కసారి కనుక అదృష్టదేవత తలుపు తడితే.. జీవితం మారిపోతుంది. అయితే ఒకొక్కసారి ఈ అదృష్ట దేవత..

Star Sapphire: బావి కోసం తవ్వుతుంటే..రూ. 175 కోట్ల విలువజేసే పెద్ద నీలమణుల క్లస్టర్ దొరికింది ఎక్కడో తెలుసా..
Sapphire Cluster
Surya Kala
|

Updated on: Jul 29, 2021 | 3:48 PM

Share

Sri Lanka: అదృష్టం ఎవరిని ఎప్పుడు ఎలా వరిస్తుందో ఎవరికీ తెలియదు. ఒక్కసారి కనుక అదృష్టదేవత తలుపు తడితే.. జీవితం మారిపోతుంది. అయితే ఒకొక్కసారి ఈ అదృష్ట దేవత.. పేదవారి తలుపు తట్టి కోటీశ్వరులను చేస్తే.. కొన్ని సార్లు ఉన్నవాడిని మరింత ఉన్నవాడిగా మార్చేస్తుంది. అలా ఓ సంపన్నుడి లక్ కలిసి వచ్చి కోట్ల విలువైన రాయి దొరికింది. ఆ రత్నాల వ్యాపారిని మరింత ధనవంతుడికి చేసింది. ఇలాంటి సమయంలోనే మన పెద్దలు చెప్పిన ఓ మాట గుర్తుకొస్తుంది అదృష్ట వంతుడిని పాడు చేసేవాడు లేదు.. దురదృష్టవంతుడిని బాగుచేసేవాడు లేడు అని.. రత్నాల వ్యాపారికి కొన్ని కోట్ల రూపాయలు విలువజేసే రాయి దొరికింది. వివరాల్లోకి వెళ్తే..

శ్రీలంకలో రత్నపుర ప్రాంతాల్లో ఓ రత్నాల వ్యాపారి నివసిస్తున్నాడు. ఇక్కడే దేశంలో అధికంగా మణులు, రత్నాలు దొరుకుతాయి. ఆ రత్నాలవ్యాపారి నీటి కోసం పెరట్లో బావి తవ్వుతుంటే.. అనుకోకుండా ఓ పెద్దరాయి దొరికింది. దీనిని ‘నీలమణి (సెరెండిపిటీ సాఫైర్) అని పేరు పెట్టారు. ఈ విషయంపై ఆ రత్నాల వ్యాపారి స్పందిస్తూ.. బావి తవ్వుతున్న మనుషులు.. “భూమి లోపల అరుదైన రాళ్లు ఉన్నట్లు అనిపిస్తోందని తనకు చెప్పారని.. తవ్వకాల్లో ఈ నీలమణి బయటపడిందని చెప్పాడు.

ఆ రాయి దొరికిన వెంటనే రత్నాల వ్యాపారి అధికారులకు తెలియజేశాడు.. రంగంలోకి దిగిన జెమ్మాలజిస్ట్లు ఆ రాయిని శుభ్రం చేశారు. దానిని విలువను అంచనా వేశారు. ఇప్పటి వరకూ ఈ ప్రాంతాల్లో అనేక విలువైన రాళ్లు, ఇంద్రనీలాలు బయల్పడ్డాయని కానీ ఇప్పటి వరకూ ఇంట పెద్ద రత్నాల రాయిని చూడలేదని అంటున్నారు. అంతేకాదు ఈ రత్నాల రాయి సుమారు 40 కోట్ల సంవత్సరాల క్రితం ఏర్పడి ఉంటుంది” అని ప్రఖ్యాత జెమ్మాలజిస్ట్ డాక్టర్ గామిని జోయిసా అన్నారు. అయితే ఈ రాయి లోపల ఉన్న రాళ్లు మంచి నాణ్యతను కలిగి ఉండక పోయవచ్చని అబిప్రాయపడుతున్నారు.

ఈ పెద్ద రాయిలో అనేక చిన్న చిన్న ఇంద్రనీలపు రాళ్లు ఉన్నాయి. దీన్ని నీలమణుల క్లస్టర్ అంటారు. ఈ నీలపు రాయి బరువు 510 కేజీలు అంటే దాదాపు 2.5 మిలియన్ కేరట్లు ఉంటుంది. ప్రపంచంలో ఇప్పటివరకు దొరికిన నీలమణుల్లో ఇదే అత్యంత పెద్దది. వీటి విలువ బహిరంగ మార్కెట్లో దాదాపు రూ.745 కోట్లు ఉంటుందని అంచనా వేశారు. దీని విలువ బట్టి చూస్తే.. ఈ నీలపు రాయిని ప్రైవేట్ వ్యక్తులు లేదా మ్యూజియంలు నిర్వహించే కొనాల్సిందేనని శ్రీలంక జాతీయ జెమ్, జువెలరీ అథారిటీ చైర్మన్ తిలక్ వీరసింగ్ చెప్పారు.

Also Read: Bisi Bele Bath Recipe: కర్ణాటక స్టైల్ లో ఈజీగా టేస్టీగా బిసిబెల్ బాత్ తయారీవిధానం