రామ్ పోతినేని మూవీ సెట్ లో రామ్ చరణ్ డైరెక్టర్.. సర్ప్రైజ్ విజిట్ ఇచ్చిన శంకర్
ఎనర్జిటిక్ స్టార్ రామ్ ఇప్పుడు యమ దూకుడు మీదున్నాడు. వరుస సినిమాలను లైన్ లో పెడుతూ ఫుల్ బిజీగా ఉన్నాడు ఈ యంగ్ హీరో. 'ఇస్మార్ట్ శంకర్' సినిమాతో భారీ విజయాన్ని సొంతం చేసుకున్న..

ఎనర్జిటిక్ స్టార్ రామ్ ఇప్పుడు యమ దూకుడు మీదున్నాడు. వరుస సినిమాలను లైన్ లో పెడుతూ ఫుల్ బిజీగా ఉన్నాడు ఈ యంగ్ హీరో. ‘ఇస్మార్ట్ శంకర్’ సినిమాతో భారీ విజయాన్ని సొంతం చేసుకున్న హీరో రామ్ వెంటనే ‘రెడ్’ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. అయితే ‘ఇస్మార్ట్’ వంటి భారీ విజయం తర్వాత వచ్చిన ‘రెడ్’ ఆ స్థాయిలో మాత్రం ఆకట్టుకోలేకపోయింది. దీంతో ఈసారి ఎలాగైనా మరో హిట్‌ను దక్కించుకోవాలనే కసితో ఉన్న రామ్..ప్రస్తుతం తమిళ్ దర్శకుడు లింగు స్వామి దర్శకత్వంలో సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. ఇందులో రామ్ సరసన ‘ఉప్పెన’ ఫేమ్ కృతి శెట్టి హీరోయిన్ గా నటిస్తోంది. రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్ సంగీతం సమకురుస్తున్నారు. ఈ సినిమాకు ఉస్తాద్ అనే టైటిల్ ను పరిశీలిస్తున్నారు. ఈ సినిమా యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరెక్కుతుందని తెలుస్తుంది. ఇప్పటికే సెట్స్ లో రామ్ కు సంబంధించిన ఫోటోని చిత్ర యూనిట్ విడుదల చేసింది. శ్రీ వేంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై దిల్ రాజు – శిరీష్ కలిసి ఈ సినిమా నిర్మిస్తున్నారు.
తెలుగు తమిళ భాషలలో వస్తున్న ఈ బైలింగ్విల్ మూవీ షూటింగ్ ఇటీవలే మొదలైంది. తాజాగా ఈ మూవీ సెట్ కు టాప్ డైరెక్టర్ శంకర్ వచ్చారు. లింగుస్వామి తో సన్నిహితంగా ఉండే శంకర్.. రామ్ మూవీ సెట్లో కాసేపు టైం స్పెండ్ చేశారు. చిత్ర బృందానికి విషెస్ అందించారు శంకర్. ఈ సందర్భంగా చిత్రంలోని ఓ మెలోడీ పాటను విన్న శంకర్.. చాలా బాగుందని చెప్పారని టాక్. సెట్స్ లో శంకర్ ఉన్న ఫోటోలను చిత్ర యూనిట్ సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఇప్పుడు ఈ ఫోటోలు వైరల్ గా మారాయి.
మరిన్ని ఇక్కడ చదవండి :