AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Shankar Dada MBBS: మెగా అభిమానులకు గుడ్ న్యూస్.. శంకర్ దాదా మళ్లీ వస్తున్నాడు.. ఇక థియేటర్లు దద్దరిల్లాల్సిందే..

మెగాస్టార్ చిరంజీవి మరోసారి శంకర్ దాదాగా అలరించేందుకు అడియన్స్ ముందుకు రాబోతున్నాడు. చిరు ప్రధాన పాత్రలో డైరెక్టర్ జయంత్ సి. పరాన్జీ దర్శకత్వం వహించిన శంకర్ దాదా ఎంబీబీఎస్ సూపర్ హిట్ అయిన సంగతి తెలిసిందే. 2004లో విడుదలైన ఈ మూవీలో సోనాలి బింద్రే కథానాయికగా నటించగా శ్రీకాంత్, వేణు మాధవ్ కీలకపాత్రలు పోషించారు.

Shankar Dada MBBS: మెగా అభిమానులకు గుడ్ న్యూస్.. శంకర్ దాదా మళ్లీ వస్తున్నాడు.. ఇక థియేటర్లు దద్దరిల్లాల్సిందే..
Shankar Dada Mbbs
Rajitha Chanti
|

Updated on: Aug 16, 2024 | 5:00 PM

Share

టాలీవుడ్ ఇండస్ట్రీలో రీరిలీజ్ ట్రెండ్ ఏ రేంజ్ లో దూసుకుపోతుందో చెప్పక్కర్లేదు. తమ అభిమాన హీరోల సూపర్ హిట్ చిత్రాలను మరోసారి థియేటర్లలో చూసేందుకు తెగ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. ఇప్పటికే రిలీజ్ అయిన సినిమాలకు మంచి రెస్పాన్స్ వచ్చింది. అలాగే ఇటీవల మహేష్ పుట్టిన రోజు సందర్భంగా విడుదలైన మురారి సినిమా భారీ కలెక్షన్లతో రికార్డ్ సృష్టించింది. ఈ మూవీ విడుదల సమయంలో థియేటర్లలో మహేష్ ఫ్యాన్స్ చేసిన రచ్చ గురించి చెప్పక్కర్లేదు. ఇక ఇప్పుడు మెగా అభిమానులకు గుడ్ న్యూస్ అందించారు మేకర్స్. మెగాస్టార్ చిరంజీవి మరోసారి శంకర్ దాదాగా అలరించేందుకు అడియన్స్ ముందుకు రాబోతున్నాడు. చిరు ప్రధాన పాత్రలో డైరెక్టర్ జయంత్ సి. పరాన్జీ దర్శకత్వం వహించిన శంకర్ దాదా ఎంబీబీఎస్ సూపర్ హిట్ అయిన సంగతి తెలిసిందే. 2004లో విడుదలైన ఈ మూవీలో సోనాలి బింద్రే కథానాయికగా నటించగా శ్రీకాంత్, వేణు మాధవ్ కీలకపాత్రలు పోషించారు.

కామెడీ అండ్ ఎమోషనల్ డ్రామాగా రూపొందించిన ఈ సినిమా దాదాపు 20 ఏళ్ల తర్వాత మళ్లీ ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈనెల 22న చిరంజీవి పుట్టినరోజు సందర్భంగా జీఆర్కే పిక్చర్స్ బ్యానర్ పై ఈ సినిమాను రీరిలీజ్ చేస్తున్నారు. హిందీలో సంజయ్ దత్ హీరోగా నటించిన ఈ సినిమా మున్నాభాయ్ ఎంబీబీఎస్. ఇదే మూవీని తెలుగు రీమేక్ గా శంకర్ దాదా ఎంబీబీఎస్ పేరుతో తెరకెక్కించారు. ఈ మూవీలో చిరు యాక్టింగ్ ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించింది. అలాగే చిరు, శ్రీకాంత్, సోనాలి బింద్రే మధ్య వచ్చే కామెడీ సీన్స్ గురించి చెప్పక్కర్లేదు.

అలాగే ఈ చిత్రంలోని భావోద్వేగ సన్నివేశాలు ప్రేక్షకులను మనసులను హత్తుకున్నాయి. ఈ చిత్రానికి దేవి శ్రీ ప్రసాద్ మ్యూజిక్ అందించారు. అప్పట్లో ఈ మూవీ భారీ వసూళ్లు రాబట్టింది. ఇప్పుడు దాదాపు ఇరవై ఏళ్ల తర్వాత మరోసారి అడియన్స్ ముందుకు రాబోతుంది. ఈ చిత్రాన్ని బాస్ బర్త్ డే సందర్భంగా ఈనెల 22న మళ్లీ విడుదల చేయబోతున్నట్లు ప్రకటించారు మేకర్స్.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

బుల్లెట్ ప్రూఫ్ కారు లేకపోతే ఆయన ఖేల్ ఖతం
బుల్లెట్ ప్రూఫ్ కారు లేకపోతే ఆయన ఖేల్ ఖతం
షూ చూపించడం ఏంటి? వైభవ్ సూర్యవంశీపై బీసీసీఐ సీరియస్!
షూ చూపించడం ఏంటి? వైభవ్ సూర్యవంశీపై బీసీసీఐ సీరియస్!
హీరోయిన్స్ డ్రెస్‌సెన్స్‌పై శివాజీ షాకింగ్ కామెంట్స్
హీరోయిన్స్ డ్రెస్‌సెన్స్‌పై శివాజీ షాకింగ్ కామెంట్స్
జనవరి 1 నుంచి మారనున్న రూల్స్.. ఇవి తెలుసుకోకపోతే ఇబ్బందే
జనవరి 1 నుంచి మారనున్న రూల్స్.. ఇవి తెలుసుకోకపోతే ఇబ్బందే
Video: కీర్తితో కలిసి డ్యాన్స్ అదరగొట్టిన స్టార్ హీరో భార్య..
Video: కీర్తితో కలిసి డ్యాన్స్ అదరగొట్టిన స్టార్ హీరో భార్య..
ఒక్క రాత్రికి 3 కోట్లు.. ఈ భామ బిజినెస్ రేంజ్ మామూలుగా లేదుగా!
ఒక్క రాత్రికి 3 కోట్లు.. ఈ భామ బిజినెస్ రేంజ్ మామూలుగా లేదుగా!
వెయ్యి కోట్లు దాటేసిన క్రేజీ బ్యూటీ.. టాప్ 5లో ఊహించని పేర్లు
వెయ్యి కోట్లు దాటేసిన క్రేజీ బ్యూటీ.. టాప్ 5లో ఊహించని పేర్లు
కూతురు పెళ్లి కబురుతో షాకిచ్చిన సీనియర్​ హీరో.. ఊహించని ట్విస్ట్!
కూతురు పెళ్లి కబురుతో షాకిచ్చిన సీనియర్​ హీరో.. ఊహించని ట్విస్ట్!
సంక్రాంతి స్పెషల్ రైళ్ల షెడ్యూల్స్ వచ్చేశాయి.. వివరాలు ఇవే..
సంక్రాంతి స్పెషల్ రైళ్ల షెడ్యూల్స్ వచ్చేశాయి.. వివరాలు ఇవే..
టెక్నాలజీతో దోస్తీ.. రోబోలతో పోటీ.. మీ పిల్లలను ఇలా రెడీ చేయండి
టెక్నాలజీతో దోస్తీ.. రోబోలతో పోటీ.. మీ పిల్లలను ఇలా రెడీ చేయండి