AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Rashid Khan : బుల్లెట్ ప్రూఫ్ కారు లేకపోతే ఆయన ఖేల్ ఖతం..షాకింగ్ నిజాలు బయటపెట్టిన స్టార్ స్పిన్నర్

Rashid Khan : ఆఫ్ఘనిస్తాన్ క్రికెట్‌ను ప్రపంచ పటంలో నిలబెట్టిన రషీద్ ఖాన్, ప్రస్తుతం తన సొంత దేశంలో స్వేచ్ఛగా తిరిగే పరిస్థితి లేదని వాపోయారు. కెవిన్ పీటర్సన్‌తో జరిగిన చిట్ చాట్‌లో రషీద్ ఖాన్ తన భద్రత గురించి మాట్లాడుతూ.. అక్కడ తాను సాధారణ కారులో అస్సలు ప్రయాణించలేనని చెప్పారు.

Rashid Khan : బుల్లెట్ ప్రూఫ్ కారు లేకపోతే ఆయన ఖేల్ ఖతం..షాకింగ్ నిజాలు బయటపెట్టిన స్టార్ స్పిన్నర్
Rashid Khan
Rakesh
|

Updated on: Dec 23, 2025 | 10:21 AM

Share

Rashid Khan : ఆఫ్ఘనిస్తాన్ క్రికెట్‌ను ప్రపంచ పటంలో నిలబెట్టిన రషీద్ ఖాన్, ప్రస్తుతం తన సొంత దేశంలో స్వేచ్ఛగా తిరిగే పరిస్థితి లేదని వాపోయారు. కెవిన్ పీటర్సన్‌తో జరిగిన చిట్ చాట్‌లో రషీద్ ఖాన్ తన భద్రత గురించి మాట్లాడుతూ.. అక్కడ తాను సాధారణ కారులో అస్సలు ప్రయాణించలేనని చెప్పారు. ఆఫ్ఘనిస్తాన్ రోడ్లపైకి రావాలంటే కచ్చితంగా బుల్లెట్ ప్రూఫ్ కారు ఉండాల్సిందేనని, ప్రస్తుతం తాను అదే వాడుతున్నానని చెప్పడంతో పీటర్సన్ ఒక్కసారిగా ఆశ్చర్యపోయారు. అయితే అక్కడ ఉన్న పరిస్థితుల్లో ఇది చాలా సాధారణ విషయమని రషీద్ బదులివ్వడం అక్కడి భయానక స్థితికి అద్దం పడుతోంది.

బుల్లెట్ ప్రూఫ్ కారు ఎందుకు?

రషీద్ ఏం చెప్పారంటే.. రషీద్ ఖాన్‌ను ఎవరైనా కాల్చి చంపేస్తారా? అని పీటర్సన్ అడిగిన ప్రశ్నకు రషీద్ చాలా ప్రాక్టికల్‌గా సమాధానం ఇచ్చారు. ఎవరైనా తనను టార్గెట్ చేసి కాల్చకపోయినా, అక్కడ ఎప్పుడు ఎక్కడ ఏం జరుగుతుందో తెలియని పరిస్థితి ఉంటుందని ఆయన వివరించారు. అనుకోకుండా ఏదైనా అల్లర్లు లేదా దాడులు జరిగినప్పుడు మనం తప్పుడు సమయంలో తప్పుడు చోట ఉండకూడదనే ముందుజాగ్రత్తతోనే బుల్లెట్ ప్రూఫ్ కారును వాడుతున్నట్లు చెప్పారు. అంతేకాదు ఒక్కోసారి జనం గుంపులుగా వచ్చి కారు తలుపులు తీయడానికి ప్రయత్నిస్తుంటారని, అటువంటి సమయాల్లో ఈ కారు తనకు రక్షణగా ఉంటుందని తెలిపారు.

ఆఫ్ఘనిస్తాన్‌లో ఇది చాలా నార్మల్

ఒక సెలబ్రిటీ క్రికెటర్ కోసం ప్రత్యేకంగా ఆ కారును డిజైన్ చేయించారా? అని అడగగా.. రషీద్ ఆసక్తికరమైన విషయాన్ని చెప్పారు. ఆఫ్ఘనిస్తాన్‌లో బుల్లెట్ ప్రూఫ్ కార్లు వాడటం అనేది ఒక విలాసం కాదని, అది అక్కడ చాలా సామాన్యమైన విషయమని చెప్పారు. చాలా మంది ప్రముఖులు, సంపన్నులు అక్కడ ఇటువంటి కార్లనే వాడుతున్నారని, ప్రస్తుత తాలిబన్ల పాలనలో భద్రత కోసం ఇది తప్పనిసరి అని ఆయన పేర్కొన్నారు. ప్రపంచవ్యాప్తంగా లీగ్‌లు ఆడుతూ కోట్లు సంపాదిస్తున్నా, తన సొంత గడ్డపై మాత్రం రషీద్ ఖాన్ ఒక బందీలా బతకాల్సి రావడం అభిమానులను కలచివేస్తోంది.

క్రికెట్ ప్రపంచంలో రషీద్ ఒక సంచలనం

2015లో అంతర్జాతీయ క్రికెట్లోకి అడుగుపెట్టిన రషీద్ ఖాన్, అనతి కాలంలోనే ప్రపంచంలోనే అత్యుత్తమ స్పిన్నర్‌గా ఎదిగారు. ఆఫ్ఘనిస్తాన్ తరఫున 100కు పైగా వన్డేలు, టీ20లు ఆడిన రషీద్, ఐపీఎల్‌లో గుజరాత్ టైటాన్స్ తరఫున కీలక ఆటగాడిగా ఉన్న సంగతి తెలిసిందే. దేశంలో యుద్ధ వాతావరణం, రాజకీయ అనిశ్చితి ఉన్నప్పటికీ క్రికెట్ ద్వారా తన దేశ ప్రజలకు సంతోషాన్ని పంచాలని రషీద్ నిరంతరం శ్రమిస్తుంటారు. కానీ తన వ్యక్తిగత భద్రత కోసం ఆయన పడుతున్న ఇబ్బందులు ఇప్పుడు చర్చనీయాంశంగా మారాయి.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..