Tollywood: ఇండియాలో అత్యధిక పన్నులు చెల్లించే స్టార్ హీరోలు వీరే.. టాలీవుడ్ నుంచి టాప్ ఎవరంటే?

భారతదేశంలో అత్యధిక పన్ను చెల్లించిన సినీ సెలబ్రిటీల జాబితాను ఫార్చ్యూన్ ఇండియా విడుదల చేసింది. ఈ జాబితాలో షారుఖ్ ఖాన్, సల్మాన్ ఖాన్, అక్షయ్ కుమార్, హృతిక్ రోషన్ వంటి బాలీవుడ్ సెలబ్రిటీలతో పాటు తెలుగు హీరోలు కూడా ఉన్నారు.

Tollywood: ఇండియాలో అత్యధిక పన్నులు చెల్లించే స్టార్ హీరోలు వీరే.. టాలీవుడ్ నుంచి టాప్ ఎవరంటే?
Actors
Follow us
Basha Shek

|

Updated on: Nov 30, 2024 | 8:17 PM

ఫార్చ్యూన్ ఇండియా భారతదేశంలో అత్యధిక పన్ను చెల్లించే సినీ ప్రముఖుల జాబితాను ప్రకటించింది. తమ నటనతో ప్రేక్షకుల హృదయాలను శాసించడమే కాకుండా, సకాలంలో పన్నులు చెల్లించడంలో కూడా ముందుండే నటులు భారతీయ సినిమాలో ఎందరో ఉన్నారు. ఇటీవల, ఫార్చ్యూన్ ఇండియా భారతదేశంలో అత్యధికంగా చెల్లించే బాలీవుడ్ ప్రముఖుల జాబితాను ప్రకటించింది మరియు ఇందులో షారుఖ్ ఖాన్, సల్మాన్ ఖాన్, అక్షయ్ కుమార్ వంటి చాలా మంది స్టార్స్ ఉన్నారు. ఫార్చ్యూన్ ఇండియా జాబితాలో 2023-24 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి దాదాపు రూ. 92 కోట్ల పన్నులు చెల్లించిన షారుక్ ఖాన్ అగ్రస్థానంలో ఉన్నారు. ఆ తర్వాత తలపతి విజయ్ సుమారు రూ. 80 కోట్లు పన్నులు చెల్లించారు. ఫార్చ్యూన్ ఇండియా జాబితాలో దాదాపు రూ.75 కోట్ల ఆదాయపు పన్ను చెల్లించిన సల్మాన్ ఖాన్ మూడో స్థానంలో నిలిచాడు. ఇది కాకుండా, అమితాబ్ బచ్చన్, అజయ్ దేవగన్, రణబీర్ కపూర్, హృతిక్ రోషన్ తదితర స్టార్ హీరోలు కూడా ఈ జాబితాలో ఉన్నారు.

అత్యధిక పన్ను చెల్లించిన సినీతారలు వీరే

  • షారూఖ్ ఖాన్ – 92 కోట్లు
  • దళపతి విజయ్ – 80 కోట్లు
  • సల్మాన్ ఖాన్ – 75 కోట్లు
  • అమితాబ్ బచ్చన్ – 71 కోట్లు
  • అజయ్ దేవగన్ – 42 కోట్లు
  • రణబీర్ కపూర్ – 36 కోట్లు
  • హృతిక్ రోషన్ – 28 కోట్లు
  • కపిల్ శర్మ – 26 కోట్లు
  • కరీనా కపూర్ – 20 కోట్లు
  • షాహిద్ కపూర్ – 14 కోట్లు
  • మోహన్‌లాల్ – 14 కోట్లు
  • అల్లు అర్జున్ – 14 కోట్లు
  • కియారా అద్వానీ – 12 కోట్లు
  • కత్రినా కైఫ్ – 11 కోట్లు

అల్లు అర్జున్ టాప్..

తెలుగు సినిమా ఇండస్ట్రీ నుంచి అల్లు అర్జున్ ఈ జాబితాలో చోటు సంపాదించుకున్నారు. ఈ ఐకాన్ స్టార్ 2023-24లో ఏకంగా రూ. 14 కోట్ల మేర అడ్వాన్స్ ట్యాక్స్ చెల్లించినట్లు ఫార్చూన్ ఇండియా నివేదిక తెలిపింది. టాప్ 20 జాబితాలో అల్లు అర్జున్ 16వ స్థానం చేజిక్కించుకున్నారు. ఇక్కడ ఆసక్తికరమైన విషయం ఏమిటి అంటే ప్రభాస్, మహేష్ బాబు వంటి హీరోల పేర్లు టాప్ 20 జాబితాలో లేకపోవడం.

హీరోయిన్లు వీళ్లే..

ఫార్చ్యూన్ ఇండియా ప్రకారం, కరీనా కపూర్ గత ఆర్థిక సంవత్సరంలో రూ. 20 కోట్ల పన్ను చెల్లించి జాబితాలో తొమ్మిదో స్థానంలో నిలిచింది.ఇక కియారా అద్వానీ 12 కోట్లతో 14వ స్థానంలో ఉండగా, కత్రినా కైఫ్ 11 కోట్లు చెల్లించి టాప్ 20 లో స్థానం సంపాదించింది.

ఇవి కూడా చదవండి

.మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

ఇషా అంబానీ బంగ్లాను కొన్న హాలీవుడ్ స్టార్ కపుల్.. ఎన్ని కోట్లంటే?
ఇషా అంబానీ బంగ్లాను కొన్న హాలీవుడ్ స్టార్ కపుల్.. ఎన్ని కోట్లంటే?
ఈ సీఎం సాబ్ గారి భార్య బాలీవుడ్‌లో స్టార్ సింగర్ అని తెలుసా?
ఈ సీఎం సాబ్ గారి భార్య బాలీవుడ్‌లో స్టార్ సింగర్ అని తెలుసా?
రైఫిల్ గురిపెట్టిన సీఎం రేవంత్.. టార్గెట్ అస్సలు మిస్ అవ్వదు!
రైఫిల్ గురిపెట్టిన సీఎం రేవంత్.. టార్గెట్ అస్సలు మిస్ అవ్వదు!
సూర్యునిపై యూరప్ తాజా అధ్యయనం.. ఇస్రో ప్రయోగానికి తేడా ఇదే..
సూర్యునిపై యూరప్ తాజా అధ్యయనం.. ఇస్రో ప్రయోగానికి తేడా ఇదే..
ఆధార్ కార్డులో సాహా బ్యూటీ శ్రద్ధా కపూర్ ఎలా ఉందో చూశారా? వీడియో
ఆధార్ కార్డులో సాహా బ్యూటీ శ్రద్ధా కపూర్ ఎలా ఉందో చూశారా? వీడియో
రేవతి కుటుంబాన్ని అన్ని విధాలా ఆదుకుంటా: అల్లు అర్జున్
రేవతి కుటుంబాన్ని అన్ని విధాలా ఆదుకుంటా: అల్లు అర్జున్
‘భారతీయ వాయుయాన్‌ విధేయక్‌’ బిల్లుకు పార్లమెంట్ ఆమోదం..
‘భారతీయ వాయుయాన్‌ విధేయక్‌’ బిల్లుకు పార్లమెంట్ ఆమోదం..
అయ్యో చిట్టి తల్లి!.. పిల్లర్ల మధ్యలో ఇరుక్కున్న తల.. 
అయ్యో చిట్టి తల్లి!.. పిల్లర్ల మధ్యలో ఇరుక్కున్న తల.. 
అతడి యాక్టింగ్ చూస్తే దిమ్మతిరిగిపోద్ది..
అతడి యాక్టింగ్ చూస్తే దిమ్మతిరిగిపోద్ది..
చలికాలంలో పిల్లలకు అరటిపండు ఇవ్వడం సరైనదా.. కాదా?
చలికాలంలో పిల్లలకు అరటిపండు ఇవ్వడం సరైనదా.. కాదా?