Pushpa 2: పుష్ప 2 కోసం రష్మిక కష్టం మాములుగా లేదుగా! శ్రీవల్లి ఏకంగా అన్ని రోజులు షూటింగ్‌కు వచ్చిందా?

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా నటించిన ది మోస్ట్ అవైటెడ్ మూవీ పుష్ప 2 ది రూల్. అన్ని హంగులు పూర్తి చేసుకున్న ఈ సినిమా డిసెంబర్ 05న గ్రాండ్ గా రిలీజ్ కానుంది. దీంతో ప్రమోషన్ కార్యక్రమాల్లో మరింత స్పీడ్ పెంచారు మేకర్స్.

Pushpa 2: పుష్ప 2 కోసం రష్మిక కష్టం మాములుగా లేదుగా! శ్రీవల్లి ఏకంగా అన్ని రోజులు షూటింగ్‌కు వచ్చిందా?
Pushpa 2 Movie
Follow us
Basha Shek

|

Updated on: Nov 30, 2024 | 7:45 PM

మూడేళ్ల క్రితం ఎలాంటి హంగులు, ఆర్బాటాలు లేకుండా రిలీజై సంచలనం సృష్టించింది పుష్ప ది రైజ్. కేవలం మౌత్ టాక్ తోనే బాక్సాఫీస్ రికార్డులు బద్దలు కొట్టింది. ఇప్పుడీ సినిమాకు సీక్వెల్ గా పుష్ప 2 ది రూల్ తెరకెక్కింది. పుష్ప 1 భారీ విజయాన్ని అందుకోవడంతో పుష్ప 2 పై భారీ అంచనాలు నెలకొన్నాయి. అల్లు అర్జున్, రష్మిక మందన్నా జోడి మరోసారి ఆడియెన్స్ ను అలరించేందుకు సిద్ధమైంది. డిసెంబర్ 5న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానున్న ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలు మరింత స్పీడ్ అందుకున్నాయి. పాన్ ఇండియా సినిమా కాబట్టి అందుకు తగ్గట్టుగానే ప్రమోషన్స్ నిర్వహిస్తున్నారు. ఇప్పటికే పట్నా, చెన్నై, కొచ్చి, ముంబైలో పుష్ప 2 ప్రమోషన్స్ ఈవెంట్స్ నిర్వహించారు. శుక్రవారం (నవంబర్ 29)న ముంబైలో నిర్వహించిన పుష్ప 2 ప్రమోషన్ ఈవెంట్‌ కు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, నేషనల్ క్రష్ రష్మిక మందన్నాతో పాటు చిత్ర బృందం కూడా హాజరైంది. ఈ సందర్భంగా మాట్లాడిన అల్లు అర్జున్ హీరోయిన్ రష్మిక పై ప్రశంసల జల్లు కురిపించాడు. ‘ శ్రీవల్ (రష్మిక) సపోర్ట్ లేకుండా ఈ సినిమా కంప్లీట్ అయ్యేది లేదు. ఆమె సినిమా సెట్ కు పాజిటివ్ ఎనర్జీని తీసుకొస్తుంది. అందుకే నాతో పాటు డైరెక్టర్ సుకుమార్ కూడా రష్మికను చాలా గౌరవిస్తాం. రష్మికతో మేం మరిన్ని సినిమాలు చేయాలనుకుంటున్నాం. ఆమె అంకిత భావం, పాజిటివ్ ఎనర్జీకి హ్యట్సాఫ్’ అని రష్మికను కొనియాడారు అల్లు అర్జున్.

ఇవి కూడా చదవండి

ఇక ఇదే ఈవెంట్ లో పాల్గొన్న మైత్రి ప్రొడ్యూసర్ రవి శంకర్ కూడా రష్మిక పై కూడా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ‘ రష్మిక మందన్నా ఈ సినిమా కోసం చాలా కష్ట పడింది. ఈ సినిమాకి తన బెస్ట్ ఇచ్చింది. పుష్ప 2 కోసం ఏకంగా 170 రోజులు షూటింగ్ లో పాల్గొంది’ అని చెప్పుకొచ్చారు. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు సామాజిక మాధ్యమాల్లో బాగా వైరలవుతున్నాయి. ఒక స్టార్ హీరోయిన్ ఇన్ని రోజుల డేట్స్ కేవలం ఒక్క సినిమాకే ఇచ్చిందంటే గ్రేట్ అని సినీ అభిమానులు, నెటిజన్లు రష్మికపై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.

మరో 5 రోజుల్లో పుష్ప 2 రిలీజ్..

పుష్ప 2 సినిమాలో అల్లు అర్జున్, రష్మిక మందన్నతో పాటు ఫహద్ ఫాసిల్ కూడా ఓ కీలక పాత్ర పోషిస్తున్నాడు. సుకుమార్ రైటింగ్స్‌లో బ్యానర్ తో కలిసి మైత్రి మూవీ మేకర్స్ ఈ సినిమాను నిర్మించారు. డిసెంబర్ 5న ఈ సినిమా గ్రాండ్ గా రిలీజ్ కానుంది.

.మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.