Actor : ఇండస్ట్రీలో కింగ్.. చదువుల్లోనూ టాపర్.. నెట్టింట వైరలవుతున్న స్టార్ హీరో మార్కుల లిస్ట్..
ప్రస్తుతం ఓ స్టార్ హీరోకు సంబంధించిన కాలేజీ మార్కుల లిస్ట్ ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరలవుతుంది. ఇప్పుడు పాన్ ఇండియా లెవల్లో విపరీతమైన క్రేజ్ సొంతం చేసుకున్న ఈ హీరో.. ఒకప్పుడు చదువులలోనూ టాపరే. ఈ విషయం తెలిసి అభిమానులు, సినీప్రియులు ఆశ్చర్యపోతున్నారు. ఇంతకీ ఆ హీరో ఎవరో తెలుసుకుందామా.

పైన ఫోటోలో కనిపిస్తున్న కుర్రాడిని గుర్తుపట్టారా.. ? ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా అత్యధిక ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న హీరో. ఎలాంటి ఫిల్మ్ బ్యాగ్రౌండ్ సపోర్ట్ లేకుండానే సినీరంగంలోకి అడుగుపెట్టాడు. బ్యాక్ టూ బ్యాక్ సినిమాలతో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు. ఇంతకీ అతడు ఎవరో తెలుసా.. ? అతడు మరెవరో కాదు.. బాలీవుడ్ బాద్ షా షారుఖ్ ఖాన్. ఇప్పుడు హిందీ సినిమా ప్రపంచంలోని స్టార్ హీరోలలో ఒకరు. గత నాలుగు దశాబ్దాలుగా సినీరంగంలో చక్రం తిప్పుతున్న హీరో. ఎన్నో బ్లాక్ బస్టర్ హిట్ చిత్రాలతో ఇండస్ట్రీలో తనదైన ముద్రవేశారు. ప్రస్తుతం వరుస సినిమాలతో దూసుకుపోతున్నారు. నిజానికి షారుఖ్ కు హిందీతోపాటు తెలుగులోనూ విపరీతమైన క్రేజ్ ఉన్న సంగతి తెలిసిందే.
ఇవి కూడా చదవండి : Actress : 19 ఏళ్ల వయసులో 32 ఏళ్ల హీరోతో ప్రేమ, పెళ్లి.. 11 సంవత్సరాలకు రీఎంట్రీ ఇస్తున్న హీరోయిన్..
ఇదెలా ఉంటే.. ప్రస్తుతం షారుఖ్ కాలేజీ మార్కుల షీట్ నెట్టింట తెగ వైరలవుతుంది. ఢిల్లీ విశ్వవిద్యాలయానికి అనుబంధంగా ఉన్న హన్స్రాజ్ కాలేజీలో తన విద్యాభ్యాసం పూర్తి చేశారని తెలుస్తోంది. కాలేజీలో ఆయన డిగ్రీకి సంబంధించిన మార్కులు జాబితా ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తుంది. అప్పట్లో ఎలక్టివ్ అనే సబ్జెక్టులో 92, ఇంగ్లీషులో 51, మ్యాథ్స్ 78, ఫిజిక్స్ 78 మార్కులు వచ్చినట్లు ఆ లిస్ట్ చూస్తే అర్థమవుతుంది. అంటే 100కు గానూ 92, 78 మార్కుల చొప్పున రావడంతో షారుఖ్ చదువులో ఎంత ఇంటెలిజెంట్ అనే విషయం స్పష్టమవుతుంది.
ఇవి కూడా చదవండి : Nayanthara : అతడితో నటించాలా.. ? వంద కోట్లు ఇచ్చినా ఆ హీరోతో సినిమా చేయను.. నయనతార..
ఇటీవలే పఠాన్, జవాన్ చిత్రాలతో భారీ విజయాలను ఖాతాలో వేసుకున్నారు షారుఖ్. ఈరెండు సినిమాలు బాక్సాఫీస్ వద్ద దాదాపు 1000 కోట్లకు పైగా కలెక్షన్స్ రాబట్టి సరికొత్త రికార్డ్ క్రియేట్ చేశాయి. ప్రస్తుతం కింగ్ చిత్రంలో నటిస్తున్నారు. దీపికా పదుకొణే, రాణి ముఖర్జీ కీలకపాత్రలు పోషిస్తున్నారు. అలాగే ఈ చిత్రంలో షారుఖ్ తనయ సుహానా ఖాన్ సైతం కనిపించనున్నట్లు తెలుస్తోంది. వచ్చే ఏడాది ఈ చిత్రాన్ని విడుదల చేయనున్నారు.
ఇవి కూడా చదవండి : Racha Movie : ఏంట్రా బాబూ ఈ అమ్మాయి.. హీరోయిన్లకు మించిన అందం.. రచ్చ చైల్డ్ ఆర్టిస్ట్ ఇప్పుడు గ్లామర్ సెన్సేషన్..
View this post on Instagram
ఇవి కూడా చదవండి : Telugu Cinema: ఏంటీ మేడమ్ ఇలా.. ప్రభాస్తో బ్లాక్ బస్టర్ హిట్.. ఇప్పుడు గుర్తుపట్టలేనంతగా.. ఎవరంటే..
