AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Actress Raashi: మొదటి రోజే చేయకూడని సీన్ చేయించారు.. అతడిని ఎప్పటికీ క్షమించలేను.. హీరోయిన్ రాశి..

తెలుగు సినిమా ప్రపంచంలో తమకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న హీరోయిన్లలో రాశి ఒకరు. చైల్డ్ ఆర్టిస్టుగా ఎంట్రీ ఇచ్చి ఆ తర్వాత కథానాయికగా రాణించింది. తక్కువ సమయంలోనే అందం, నటనతో మెప్పించింది. అటు ట్రెడిషనల్.. ఇటు గ్లామర్ పాత్రలలో అద్భుతమైన నటనతో కట్టిపడేసింది. ఇప్పుడు బుల్లితెరపై సీరియల్స్ లో తల్లి, అత్త పాత్రలలో నటిస్తుంది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసింది.

Actress Raashi: మొదటి రోజే చేయకూడని సీన్ చేయించారు.. అతడిని ఎప్పటికీ క్షమించలేను.. హీరోయిన్ రాశి..
Raasi
Rajitha Chanti
|

Updated on: Sep 21, 2025 | 5:04 PM

Share

తెలుగు సినీపరిశ్రమలో వరుస సినిమాలతో అలరించిన హీరోయిన్లలో రాశి ఒకరు. బాలనటిగా తెరంగేట్రం చేసి ఆ తర్వాత కథానాయికగా ఎన్నో హిట్ చిత్రాల్లో నటించి మెప్పించింది. పవన్ కళ్యాణ్ సరసన గోకులంలో సీత, జగపతి బాబు జోడిగా శుభాకాంక్షలు, పెళ్లి పందిరి, స్నేహితులు, ప్రేయసి రావే వంటి హిట్ చిత్రాలతో తనదైన ముద్ర వేసింది. తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం భాషలలో అనేక చిత్రాల్లో నటించిన రాశి.. ఇటు ట్రెడిషనల్.. అటు గ్లామరస్ పాత్రలలో అద్భుతమైన నటనతో కట్టిపడేసింది. అయితే కెరీర్ మంచి ఫాంలో ఉండగానే మహేష్ బాబు నటించిన నిజం సినిమాలో నెగిటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో కనిపించి అభిమానులకు షాకిచ్చింది. ఇందులో రాశి యాక్టింగ్ అదరగొట్టింది. పెళ్లి తర్వాత సినిమాలకు దూరమైన రాశి.. ఇప్పుడు సెకండ్ ఇన్నింగ్స్ లో రాణిస్తుంది. సీరియల్స్, సినిమాల్లో కీలకపాత్రలు పోషిస్తూ బిజీగా ఉంటుంది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆమె తన కెరీర్ గురించి ఆసక్తికర విషయాలు పంచుకుంది.

ఇవి కూడా చదవండి : Tollywood : 19 ఏళ్ల వయసులో 31 ఏళ్ల స్టార్ హీరోతో పెళ్లి.. 11 సంవత్సరాలకు రీఎంట్రీ ఇస్తున్న హీరోయిన్..

మెగాస్టార్ చిరంజీవితో తాను ఓ సినిమా చేయాల్సి ఉందని.. ఆర్తి అగర్వాల్ తోపాటు తనకు కూడా అడ్వాన్స్ ఇచ్చారని అన్నారు. కానీ దర్శకుడితో చిరంజీవి విభేదాల కారణంగా ఆ సినిమా ఆగిపోయిదని అన్నారు. అలాగే రంగస్థలం సినిమాలో రంగమ్మత్త పాత్రను సుకుమార్ ముందుగా తనకే ఆఫర్ చేశారని.. కానీ ఆ పాత్రలో జనాలు తనను అంగీకరిస్తారో లేదో అన్న భయంతో రిజెక్ట్ చేసినట్లు చెప్పారు. రాశీ మాట్లాడుతూ.. “నాకు మేకప్ వేసుకోవడం నచ్చదు. ఇండస్ట్రీకి రావాలని అనుకోలేదు. కానీ అనుకోకుండా వచ్చినా నా పనిని ఎప్పుడూ తక్కువ చేసి చూడలేదు. నా పనిని నేనెంతో గౌరవిస్తాను. 2004లో పెళ్లి జరిగింది. ఆ సమయంలోనే సౌందర్య చనిపోయింది. పెళ్లి కూతురిని చేశాక బెంగళూరులో సౌందర్య సంతాపసభకు వెళ్లొచ్చాను. పెళ్లైన పదేళ్లకు పాప పుట్టింది. అదే నా జీవితంలో మ్యాజికల్ మూమెంట్ ” అని అన్నారు.

ఇవి కూడా చదవండి : Cinema: కాంతార, కేజీఎఫ్ చిత్రాలను వెనక్కు నెట్టింది.. అప్పుడు థియేటర్లు.. ఇప్పుడు ఓటీటీని ఊపేస్తోన్న మూవీ..

అలాగే.. “డైరెక్టర్ తేజ నిజం సినిమాలో నా పాత్రను పాజిటివ్ గా చెప్పారు. తీరా సెట్ కు వెళ్లాక మొదటిరోజే నాతో చేయకూడని సీన్ చేయించారు. అసలు ఆ సీన్ ఉంటుందనే చెప్పలేదు. చాలా హర్టయ్యాను. సినిమా చేయనన్నాను. నాకున్న ఇమేజ్ కు సినిమా చేశానంటే కెరీర్ ఆగిపోతుంది.. నా వల్ల కాదన్నాను. కానీ చేయాల్సిందేనన్నారు. దీంతో ఇష్టం లేకుండానే ఆ మూవీ చేశాను. డబ్బింగ్ సమయంలో తేజ కాల్ చేసి సారీ చెప్పారు. ఈ విషయంలో ఆయనను ఎప్పటికీ క్షమించలేను. ఇండస్ట్రీలో ఏ డైరెక్టర్ ను మర్చిపోవాలనుకుంటున్నారు ? అని అడిగితే తేజ పేరు చెప్తాను. నా పుట్టినరోజే నాన్న చనిపోయారు. అది ఎప్పటికీ మర్చిపోలేని విషాదం” అని అన్నారు.

ఇవి కూడా చదవండి : Actress: అప్పుడు స్కూల్లో టీచర్.. తెలుగు ఇండస్ట్రీని షేక్ చేసిన టాప్ హీరోయిన్.. ఎవరో గుర్తుపట్టారా.. ?

అత్తవారింట సమంతకు గ్రాండ్‌ వెల్‌కమ్‌
అత్తవారింట సమంతకు గ్రాండ్‌ వెల్‌కమ్‌
బిగ్ బాస్ కు షాకిచ్చిన స్టార్ మా.. సీరియల్ ఎఫెక్ట్
బిగ్ బాస్ కు షాకిచ్చిన స్టార్ మా.. సీరియల్ ఎఫెక్ట్
భరణిని తొక్కేసి కళ్యాణ్ దూకుడుకి బ్రేకేసిన రీతూ
భరణిని తొక్కేసి కళ్యాణ్ దూకుడుకి బ్రేకేసిన రీతూ
రాజ్‌ గురించి బ్రేకింగ్ న్యూస్ కావాలా ?? మాజీ భార్య షాక్
రాజ్‌ గురించి బ్రేకింగ్ న్యూస్ కావాలా ?? మాజీ భార్య షాక్
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
వామ్మో.. కరోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్
వామ్మో.. కరోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
కారు స్టార్ట్‌ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్‌ చేసిన డ్రైవర్‌ షాక
కారు స్టార్ట్‌ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్‌ చేసిన డ్రైవర్‌ షాక
వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం
వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం
ఖతర్నాక్‌ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..
ఖతర్నాక్‌ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..